ప్రపంచానికి మరో యుద్దం..పాక్ vs అఫ్గాన్
ఇప్పటికే అస్థిర వాతావరణంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచానికి ఇప్పుడు మరో యుద్దం మీద పడింది.;
ఇప్పటికే అస్థిర వాతావరణంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచానికి ఇప్పుడు మరో యుద్దం మీద పడింది. ఆసియాలోని రెండు పేద దేశాల మధ్య జరుగుతున్న యుద్దం చేసే నష్టం ఆ రెండు దేశాల ఆర్థిక ముఖచిత్రాన్ని మరింత అధ్వానంగా చేయనుంది. గడిచిన కొంతకాలంగా ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తీవ్రస్థాయికి చేరుకోవటమే కాదు.. ఇప్పుడు ఏకంగా యుద్ధం మొదలైన పరిస్థితి. తమ సహనం నశించిందని.. ఇకపై అఫ్గాన్ ను నేరుగా ెదుర్కొంటామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. పాక్ తో బహిరంగ యుద్ధాన్నిప్రారంభించినట్లుగా ఆయన ప్రకటించారు.
ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల గురించి తెలిసిందే అయినా.. గురువారం రాత్రి ఎనిమిది గంటల వేళలో దురాండ్ లైన సరిహద్దు వెంట అఫ్తాన్ దళాలు పాక్ సైనిక పోస్టులపై దాడులు ప్రారంభించాయి. దీనికి ప్రతీకారంగా శుక్రవారం తెల్లవారుజామున (అఫ్గాన్ స్థానిక కాలమానం ప్రకారం 1.50 గంటలు) మొదటి బాంబు దాడిని పాక్ చేపట్టింది. మొదటి దాడి తర్వాత కొన్ని వైమానిక దాడులు కాబూల్ నగరాన్ని లక్ష్యంగా చేసుకొని జకాబూల్ లో పేలుళ్లు.. కాల్పుల వభ్దాలు వినిపించినట్లుగా అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.
పాక్ జరిపిన దాడులు కాబూల్.. కాందహార్ లక్ష్యంగా చేసినట్లు చెబుతున్నారు. దాదాపు ఎనిమిది మంది అఫ్గాన్ పౌరులు మరణించినట్లుగా తెలుస్తోంది. రెండు దేశాల మధ్య దాడులు ముమ్మరంగా సాగుతున్న వేళ ఈ రోజు (శుక్రవారం) ఉదయం 7.15-7.50 మధ్యన పాక్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతాలో యుద్దానికి సంబంధించిన వివరాల్ని ప్రకటించారు. ఈ రెండు దేశాల ఆర్థిక పరిస్థితి మహాదారుణంగా ఉన్ననప్పటికీ.. ఆయుధ బలంలో మాత్రం అఫ్గాన్ తో పోలిస్తే.. పాక్ మెరుగైన అధిక్యతను ప్రదర్శిస్తోంది.
అదే సమయంలో.. గెరిల్లా తరహా యుద్ధంలో పాక్ కంటే అఫ్గాన్ మెరుగ్గా ఉంది. యుద్ధం దీర్ఘకాలం సాగితే మాత్రం పాక్ కు మరిన్ని తలనొప్పులుఖాయం. ఆయుధ బలంలో అఫ్గాన్ కంటే పాక ఎన్నో రెట్లు ముందుంది. మొత్తంగా ఈ యుద్ధానికి కారణం ఏమైనా.. ఏ పేరు మీద జరిగినా.. అంతిమంగా నష్టపోయేది మాత్రం ఆ రెండు దేశాల ప్రజలు.. ఆ రెండుదేశాలే. దీర్ఘకాలం మరింత దుర్బర పరిస్థితులకు తాజా యుద్ధం కారణమవుతుందని చెప్పక తప్పదు.