‘చెవి పక్కనుంచే తూటా వెళ్లింది’... పహల్గాంలో ఓ జంట షాకింగ్ అనుభవం!

అవును... పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడిన సంగతి తెలిసిందే.;

Update: 2025-04-30 05:38 GMT

జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఎన్నో కుటుంబాల్లో విషాదాలు మిగిలిస్తే.. మరికొన్ని కుటుంబాలు వెంట్రుక వాసిలో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. ఈ సమయంలో ఒక్కొక్కరూ వారి వారి భయానక అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ సమయంలో వెంట్రుక వాసిలో తప్పించుకున్న ఓ జంట తన షాకింగ్ అనుభవాన్ని పంచుకున్నారు.

అవును... పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరికొంతమంది వెంట్రుక వాసిలో తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. అలాంటి వారిలో కర్ణాటకకు చెందిన ప్రదీప్ హెగ్డే, శుభా హెగ్డే దంపతులు ఒకరు. ఈ సందర్భంగా శ్రీనగర్ లో జరిగిన అనుభవాన్ని పంచుకున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... ప్రదీప్ హెగ్డే, శుభా దంపతులు వారి కుమారుడు సిద్ధాంత్ కలిసి ఈ నెల 21న శ్రీనగర్ వెళ్లారు. ఈ క్రమంలో 22న పహల్గాం చెరుకుని, అక్కడ నుంచి బైసరన్ వ్యాలీకి గుర్రాలపై బయలుదేరారు. అప్పటికే అక్కడ చాలా మంది పర్యాటకులు ఉన్నారు. మరోపక్క గేటుకు ఓ వైపు జిప్ లైన్ ఖాళీగా కనిపించింది. దీంతో.. ముందుగ జిప్ లైన్ ఎక్కాలని అనుకున్నారు.

ఈ క్రమంలో అక్కడే సుమారు గంటసేపు గడిపారు. అప్పటికే సమయం మధ్యాహ్నం 1:45 అయ్యింది. దీంతో... వారి కుమారుడు ఆకలిగా ఉందని చెప్పడంతో సమీపంలోని ఫుడ్ స్టాల్ కు వెళ్లి మ్యాగీ ఆర్డర్ చేశారు. ఇంతలో శుభా హెగ్డే వాష్ రూమ్ కు వెళ్లేందుకు సుమారు అర కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్లింది. అయితే అది పే అండ్ యూజ్ కావడంతో డబ్బుల కోసం తిరిగి వచ్చింది.

ఆమె వచ్చే లోపు ఆమె భర్త, కుమారుడు ఆహారం తినేశారు. దీంతో.. ఆమె కూడా ఆహరం తింటున్న సమయంలో టీ ఆర్డర్ చేశారు. సరిగ్గా అప్పుడే తొలిసారిగా తుపాకీ చప్పులు వినిపించాయి. అయితే... అడవి జంతువులను బెదిరించడానికి టపాసులు పేలుస్తున్నారని భావించారే తప్ప.. అవి కాలుప మోత అని వారికి తొలుత తెలియలేదు. పైగా ఫుడ్ స్టాల్ ఓనర్ కూడా అలానే చెప్పాడు.

అయితే... ఓ 20 సెకన్ల తర్వాత ఇద్దరు ఉగ్రవాదులు తుపాకులు పట్టుకుని వారి దిశగా రావడాన్ని ప్రదీప్ గమనించారు. ఆ తర్వాత వెంటనే నేలపై పడుకున్నారు. ఈ సమయంలో సెల్ ఫోన్లు, కార్డులు, డబ్బులూ అన్నీ ఉన్న బ్యాగ్ టెబుల్ పై ఉండటంతో.. దాని కోసం శుభా పైకి లేచింది. దాన్ని తీసుకుని కిందకు వంగేలోపు ఆమె కుడి చెవి పక్కనుంచి ఏదో వెళ్లినట్లు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే అది తూటా!

అయితే కాసేపటి తర్వాత అలజడి తగ్గడంతో గేటు బయటకు రాగా.. అక్క్డున్న వారిని పైకి తీసుకొచ్చిన గుర్రపుస్వారీ వ్యక్తి కనిపించాడు. అయితే అప్పటికే ఈ అలజడికి అక్కడున్న గుర్రరలన్నీ చెల్లాచెదురైపోయాయి. ఈ సమయంలో తమను కిందకు తీసుకెళ్లమని కోరగా అందుకు అతడు అంగీకరించాడు అని చెబుతూ వారి భయానక అనుభవాన్ని పంచుకున్నారు.

Tags:    

Similar News