జైషే మహ్మద్ చీఫ్ ఫ్యామిలీ హతం.. 10 + 4 మృతి!

పాకిస్థాన్ లోని బహవల్ పూర్ లో భారత సైన్యం జరిపిన దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, నలుగురు సహాయకులు మరణించారని అంతర్జాతీయ మీడియా నివేదించింది.;

Update: 2025-05-07 07:57 GMT

పహల్గాంలో పాకికిస్థాన్ మద్దతుగల ఉగ్రవాదులు దాడి చేసి 25 మంది పర్యాటకులు ఒక కశ్మీర్ పౌరుడిని హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ దాడిపై ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్.. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత ఆపరేషన్ సిందూర్ మొదలుపెట్టింది. ఈ దాడిలో జైషే మొహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఫ్యామిలీ మొత్తం మరణించినట్లు తెలుస్తోంది.

పాక్ లో భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సిందూర్ దాడుల్లో 9 ఉగ్ర శిభిరాలు ధ్వంసం అవ్వగా, సుమారు 80 మంది ఉగ్రవాదులు మరణించినట్లు చెబుతున్నారు. ఇది పాక్ ఉగ్రమూకలకు ఇప్పట్లో తేరుకోలేని దెబ్బ అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో మసూద్ అజార్ ఫ్యామిలీ మెంబర్స్ 10 మంది, సహాయకులు నలుగురు మృతి చెందినట్లు తెలుస్తొంది.

అవును... పాకిస్థాన్ లోని బహవల్ పూర్ లో భారత సైన్యం జరిపిన దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, నలుగురు సహాయకులు మరణించారని అంతర్జాతీయ మీడియా నివేదించింది. బహవల్ పూర్ లోని సుభాన్ అల్లా కాంప్లెక్స్ పై జరిగిన దాడులతో ఈ మరణాలు సంభవించినట్లు చెబుతున్నారు.

మరణించిన వారిలో మసూద్ అజార్ అక్క, ఆమె భర్త, అతని మేనల్లుడు, అతని భర్య, మేనకోడలు, అతని కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలు ఉన్నారని మీడియా నివేదించింది. ఇదే సమయంలో... మసూద్ అజార్, అతని తల్లి సహాయకులతో పాటు మరో ఇద్దరు సహాయకులు కూడా మరణించారని ఆ ప్రకటన పేర్కొంది.

ఇక.. పాకిస్థాన్ లో 12వ అతిపెద్ద నగరంగా బహవల్పూర్ ఉంది. ఇది లాహోర్ నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ సుమారు 18 ఎకరాల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ స్థావరం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ శిబిరాన్ని ఉస్మాన్ ఓ అలీ క్యాంపస్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రధానంగా జైషే మహ్మద్ నియామకాలు, బోధనలకు కేంద్రంగా పనిచేస్తుంది!

ఈ సమయంలో బహవల్ పూర్ లో జరిగిన దాడి మసూద్ అజార్ మదర్సాపైనేనని ఓ పాకిస్థానీ కన్ఫాం చేశాడు. ఈ సందర్భంగా సదరు మదర్సాపై నాలుగు మిస్సైల్స్ పడినట్లు వెల్లడించాడు. అంతా చెప్పిన అతడు.. ఇంత జరుగుతుంటే పాక్ సైన్యం నిద్రపోతుందా అని ప్రశ్నించడం గమనార్హం. అయితే ఈ దాడుల్లో అజార్ పరిస్థితి ఏమిటనేది తెలియాల్సి ఉంది!

Tags:    

Similar News