• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆపరేషన్‌ సిందూర్‌తో మసూద్...

ఆపరేషన్‌ సిందూర్‌తో మసూద్ అజార్ కుటుంబం ఖతం.. ఎట్టకేలకు వీడియోతో బయటపడింది..

| జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన దారుణ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్‌ సిందూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలపై ఘోర దాడులు జరిపిన విషయం తెలిసిందే.

By - A.N.Kumar
Update: 2025-09-16 10:32 GMT

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన దారుణ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్‌ సిందూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలపై ఘోర దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో భాగంగా జైషే మహ్మద్‌ సంస్థకు చెందిన అనేక శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తాజాగా ఈ దాడుల్లో జైషే చీఫ్‌ మసూద్‌ అజార్‌ కుటుంబ సభ్యులు మరణించిన విషయాన్ని ఆ సంస్థ కమాండర్‌ మసూద్‌ ఇలియాస్‌ కశ్మీరీ బహిరంగంగా అంగీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మసూద్‌ కుటుంబంపై తీవ్ర దెబ్బ

మే 7న భారత ఆర్మీ బహవల్‌పూర్‌లోని జైషే ప్రధాన కార్యాలయం మర్కజ్‌ సబాన్‌పై దాడి చేసింది. దీనిని జైషే ఆపరేషనల్ హెడ్‌క్వార్టర్‌గా వినియోగిస్తారు. అంతేకాదు ఇది మసూద్‌ అజార్‌ నివాసంగా కూడా ఉపయోగపడుతున్న భవనం. ఈ దాడిలో అజార్‌ కుటుంబానికి చెందిన 10 మంది ముక్కలైపోయారని మసూద్‌ ఇలియాస్‌ కశ్మీరీ అంగీకరించాడు. భారత సైన్యం రహస్యంగా వారి స్థావరాల్లోకి ప్రవేశించి చేసిన దాడులు తమకు పెద్ద నష్టం కలిగించాయని ఆయన ఒప్పుకోవడం గమనార్హం.

పహల్గాం దాడి – ఆపరేషన్ సిందూర్

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులపై జరిపిన దాడిలో 26 మంది నిరపరాధులు ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తమైంది. వెంటనే భారత ప్రభుత్వం ప్రతీకార చర్యలకు శ్రీకారం చుట్టింది. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా భారత ఆర్మీ పాక్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసింది. వీటిలో జైషే మహ్మద్‌ ప్రధాన కేంద్రం కూడా ఉంది.

ఉగ్రవాదానికి స్పష్టమైన సమాధానం

"మేము దిల్లీ, కాబూల్‌, కాందహార్‌లతో పోరాడాం. ఇందుకోసం అన్నింటినీ త్యాగం చేశాం" అని మసూద్‌ ఇలియాస్‌ కశ్మీరీ చేసిన వ్యాఖ్యలు, భారత్‌ చేసిన దాడుల ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. పహల్గాం దాడికి ప్రతీకారంగా జరిగిన ఆపరేషన్‌ సిందూర్‌తో ఉగ్రవాదానికి భారత్‌ ఇచ్చిన గట్టి సమాధానం, పాక్‌ మద్దతుతో నడుస్తున్న ఉగ్రశిబిరాలకు గట్టి హెచ్చరికగా మారింది.

మొత్తానికి, పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌తో ఉగ్రవాదంపై కఠినమైన ప్రతీకారం తీర్చుకుంది. జైషే మహ్మద్‌కి ఇది మరచిపోలేని దెబ్బగా మిగిలిపోనుంది.

Big Expose 🚨 Jaish-E-Mohammad (JeM) commander Masood Ilyas Kashmiri admits: On May 7, Masood Azhar’s family was ripped apart in Bahawalpur strike by Indian forces. But ISPR still shamelessly parades gun-toting terrorists as innocent civilians. pic.twitter.com/02qIMaUTWg

— Baba Banaras™ (@RealBababanaras) September 16, 2025
Tags:    
  • OperationSindoor 
  • IndianArmy 
  • PahalgamAttack 
  • MasoodAzhar 
  • IndiaStrikesBack 
  • పహల్గాంఉగ్రదాడి 
  • జైషేక్యాంపులు 
  • భారతదాడి 
  • ఉగ్రవాదం 

Similar News

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

పాపం ఏబీవీ : సోషల్ మీడియా హైప్....డిపాజిట్ గల్లంతు

2026-11-04 08:06 GMT

సుప్రీంషాక్‌: దిగొచ్చిన ఎన్నిక‌ల సంఘం.. బిగ్ రిలీఫ్‌!

2026-11-04 08:02 GMT

ఈమె ఏ పార్టీలోచేరినా విజయమే.. లక్ అంటే రమాకుమారిదే..

2026-11-04 08:01 GMT

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

2026-11-04 04:56 GMT

అమెరికాలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

2026-11-04 04:55 GMT

Copyright @2026

Powered by Blink CMS