సరిహద్దుల్లో స్పీకర్ల గొడవ.. రూమర్స్ పై స్పందించిన కిమ్ సోదరి!
ఇలా పలు పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కిమ్ సోదరి స్పందిస్తూ.. "దక్షిణ కొరియా ప్రభుత్వం మమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తోంది.;
గత కొన్ని సంవత్సరాలుగా అటు ఉత్తర కొరియా.. ఇటు దక్షిణ కొరియా దేశాలు పరస్పరం వ్యతిరేకంగా ప్రసారాలు చేసుకుంటున్నాయి.. ముఖ్యంగా సరిహద్దులలో లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసి మరీ వ్యతిరేకంగా ప్రసారాలు చేసుకుంటున్న విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ లౌడ్ స్పీకర్లను దక్షిణ కొరియా కూల్చివేయగా.. ఉత్తర కొరియా కూడా ఈ స్పీకర్లను తొలగిస్తున్నట్లు సియోల్ సైనికాధికారులు ఇటీవల ప్రకటించారు. దీనిని తోసిపుచ్చారు కిమ్ సోదరి కిమ్ యో జోంగ్.
ప్రత్యర్థి తో దౌత్య సంబంధాల పునరుద్ధరణను నిరాకరించిన ఈమె.. అమెరికాతో కూడా చర్చలు జరిపే ప్రసక్తే లేదు అ, ని అసలు ఆ ఆలోచన లేదని స్పష్టం చేసింది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ చేపడుతున్న పనులను ప్రతీకార చర్యలుగా పేర్కొన్న దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ ఇరుదేశాలు క్రమంగా సంప్రదింపులు చర్చలు కొనసాగించవచ్చని ఇటీవల ఆశాభావం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లను ఇప్పుడు ఉత్తర కొరియా కూడా తొలగించబోతోంది అని సియోల్ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చెప్పినప్పటికీ కూడా.. వారు లౌడ్ స్పీకర్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నట్టు ఎక్కడ కనిపించడం లేదు. ముఖ్యంగా ప్యాంగ్యాంగ్ వైపు లౌడ్ స్పీకర్లు కనిపిస్తూనే ఉన్నాయి.
ఇలా పలు పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కిమ్ సోదరి స్పందిస్తూ.. "దక్షిణ కొరియా ప్రభుత్వం మమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తోంది.. సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లను తొలగిస్తుందని, దానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తప్పుడు ప్రకటనలు చేశారు. కానీ మేము లౌడ్ స్పీకర్లను తొలగించము. అసలు తొలగించే ఉద్దేశం కూడా మాకు లేదు" అంటూ ఆమె స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా అమెరికా - రష్యా అధ్యక్షులు ఆగస్టు 15న అలస్కాలో భేటీ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా వాషింగ్టన్ తో చర్చల కోసం పుతిన్ ద్వారా ఉత్తరకొరియా ఒక సందేశం పంపనుంది అని దక్షిణ కొరియా మీడియాలో కథనాలు వచ్చాయి . వీటిని కూడా ఆమె తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అటువంటి సందేశం తామెందుకు పంపుతామని, అమెరికాతో చర్చలపై తమకు ఆసక్తి లేదు అని ఆమె తెలిపారు. ఇక ఉక్రెయిన్ పై యుద్ధం మొదలుపెట్టిన రష్యాకి భారీ మొత్తంలో ఆయుధ సామాగ్రితో పాటు వేలాదిమంది సైనికులను కూడా ఉత్తరకొరియా పంపిస్తోంది. యుద్ధం ముగింపునకు అమెరికా వేదికగా పలు ప్రయత్నాలు జరుగుతున్న వేళ.. ఇదే అంశంపై కిమ్ , పుతిన్ లు ఫోన్లో సంభాషించుకున్నారట. అటు అమెరికా అధ్యక్షుడుతో చర్చలకు సంబంధించిన విషయాలను కిమ్ కి పుతిన్ వివరించినట్లు రష్యా అధికారిక మీడియా కూడా తెలిపింది. ఇకపోతే ఇప్పటికైనా అసత్య ప్రకటనలను మానుకోవాలి అని దక్షిణ కొరియా ప్రభుత్వానికి ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చింది కిమ్ సోదరి.