• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నాలుగేళ్ల క్రితం బాలికను...

నాలుగేళ్ల క్రితం బాలికను వేధించాడు.. ఇప్పుడేమో ఆమె తండ్రిని చంపేశాడు

| నిడదవోలు పట్టణానికి చెందిన 46 ఏళ్ల షేక్ వల్లీబాషా వంటలు చేస్తుంటాడు. ఆయనకు భార్య.. ఇద్దరు పిల్లలు. నాలుగేళ్ల క్రితం 2021లో వల్లీబాషా చిన్న కుమార్తె ఇంటర్ చదువుతూ ఉండేది.

By - Tupaki Desk
Update: 2025-05-05 05:30 GMT

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో దారుణ ఉదంతం చోటు చేసుకుంది. ఒక బాలికను వేధింపులకు గురి చేసిన ఉదంతంలో ఫోక్సో కేసు నమోదు కావటం.. తాజాగా ఆ కేసును వెనక్కి తీసుకోమంటే.. ససేమిరా అన్నాడన్న కోపంతో ఆమె తండ్రిని దారుణంగా హతమార్చిన దుర్మార్గం చోటు చేసుకుంది. ఈ తరహా ఘటనలకు పాల్పడే వారిని తేలిగ్గా వదిలిపెట్టకూడదన్న మండిపాటు వ్యక్తమవుతోంది.

నిడదవోలు పట్టణానికి చెందిన 46 ఏళ్ల షేక్ వల్లీబాషా వంటలు చేస్తుంటాడు. ఆయనకు భార్య.. ఇద్దరు పిల్లలు. నాలుగేళ్ల క్రితం 2021లో వల్లీబాషా చిన్న కుమార్తె ఇంటర్ చదువుతూ ఉండేది. అప్పట్లో ఆమెను నిడదవోలు వైఎస్సార్ కాలనీకి చెందిన అనిల్ కుమార్ వెంటపడి వేధింపులకు గురి చేసేవాడు. లారీ డ్రైవర్ అయిన ఇతగాడి తీరుకు ఆమె భయపడిపోయింది. చివరకు తల్లిదండ్రులకు తాను ఎదుర్కొంటున్న సమస్య గురించి చెప్పటంతో.. వారు పోలీసుల్ని ఆశ్రయించారు.

వల్లీబాషా ఫిర్యాదు మేరకు అనిల్ కుమార్ మీద పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసు నిరూపితమైతే శిక్ష పడటం ఖాయమన్న భయంతో పాటు.. ఈ కేసు కారణంగా తనకు పెళ్లి కావటం లేదన్న కోపాన్ని పెంచుకున్నాడు. ఈ క్రమంలో వల్లీబాషాతో రాజీకి సైతం ప్రయత్నించాడు. అయితే.. తన కుమార్తెను వేధించిన వాడితో రాజీ కుదుర్చుకోవటానికి వల్లీబాసా ససేమిరా అన్నాడు.

ఇదిలా ఉండగా.. ఈ మధ్యన మరోసారి రాజీ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆదివారం తెల్లవారుజామున షాపు తెరిచేందుకు బయటకు వచ్చిన బాషా మీద అనిల్ కుమార్ దాడి చేశాడు. గొంతు.. వీపు భాగాలపై కత్తితో పొడిచేయటంతో తీవ్రగాయాలు కావటంతో వల్లీభాషా అక్కడిక్కడే మరణించాడు. పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో కేసు రాజీ కోసం ప్రయత్నించి.. ఇప్పుడు హత్య కేసు మీదేసుకున్న అనిల్ కుమార్ ను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

Tags:    
  • JusticeForValibasha 
  • NidadavoluCrime 
  • POCSOCase 
  • ChildSafety 
  • StopRapeCulture 
  • VictimJustice 
  • AndhraPradeshNews 
  • NoCompromiseOnAbuse 
  • BrutalMur8der 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS