• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అగ్రరాజ్యంలో దారుణ...

అగ్రరాజ్యంలో దారుణ విషాదం: టూరిస్టు బస్సు ప్రమాదంలో 5గురు మృతి

| అగ్రరాజ్యంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షాకింగ్ అంశం ఏమంటే.. ఐదుగురిని బలి తీసుకున్న ఈ ప్రమాదంలో టూరిస్టు బస్సు దేనిని ఢీ కొట్టకుండానే ఐదుగురు ప్రాణాలు కోల్పోవటం గమనార్హం.

By - Garuda Media
Update: 2025-08-23 04:10 GMT

అగ్రరాజ్యంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షాకింగ్ అంశం ఏమంటే.. ఐదుగురిని బలి తీసుకున్న ఈ ప్రమాదంలో టూరిస్టు బస్సు దేనిని ఢీ కొట్టకుండానే ఐదుగురు ప్రాణాలు కోల్పోవటం గమనార్హం. ప్రఖ్యాత నయాగరా జలపాతం అందాల్ని చూసేందుకు వెళ్లి.. తిరిగి వచ్చే సమయంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగాన్ని నియంత్రించటంలో ఫెయిల్ కావటమే ఈ ప్రమాదానికి అసలు కారణంగా చెబుతున్నారు. అసలేం జరిగిందంటే..

నయాగరా జలపాతం నుంచి న్యూయార్క్ కు తిరిగి వస్తున్న వేళలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఉదంతంలో ఐదుగురు మరణించగా.. పలువురు గాయాల బారిన పడ్డారు. బస్సులో ప్రయాణిస్తున్న చాలామంది సీటు బెల్టు పెట్టుకోకపోవటంతో వారిని సులువుగా బస్సు నుంచి బయటకు తీసుకొచ్చినట్లు చెబుతున్నారు.

బస్సు దేన్ని ఢీ కొట్టలేదని.. స్పీడ్ ను కంట్రోల్ చేయటంలో డ్రైవర్ ఫెయల్యూర్ ఈ ప్రమాదానికి అసలు కారణంగా స్థానిక మీడియా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 54 మంది ప్రయాణిస్తున్నారు. మధ్యాహ్నం12.40 సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బస్సు ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

బస్సు బోల్తా పడిన వైనం గురించి సమాచారం అందుకున్నంతనే స్థానిక యంత్రాంగం స్పందించింది. నాలుగు హెలికాఫ్టర్లు.. పలు అంబులెన్సులు గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించాయి. పర్యాటకుల్లో అత్యధికులు భారత్.. చైనా.. ఫిలిప్పీన్స్ కు చెందిన వారున్నారు. జరిగిన ప్రమాదాన్ని తీవ్ర విషాద ఘటనగా న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బస్సు ఢీ కొట్టకుండానే.. వేగాన్ని నియంత్రించటంలో జరిగిన వైఫల్యం.. బస్సు తిరగబడిన వైనం షాకింగ్ గా మారింది.

Tags:    
  • NiagaraAccident 
  • NewYorkCrash 
  • TouristBusTragedy 
  • BreakingNews 
  • GlobalNews 
  • IndianTourists 
  • TragicIncident 
  • USNews 
  • RoadSafety 
  • నయాగరా 
  • రోడ్డు ప్రమాదం 
  • అమెరికాఅపఘాతం 

Similar News

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

పవన్ పిఠాపురంలో రెబెల్స్ కొత్త రికార్డు !

2026-11-03 18:23 GMT

తమిళనాడుకు ప్రత్యేక జెండా ...ఏం జరుగుతోంది ?

2026-11-03 18:16 GMT

బాబుతో విజయ్ డీకే రేవంత్ : దక్షిణాదిన కొత్త ఐక్యత !

2026-11-03 18:15 GMT

ఒక్క ఓటుతో విజేత‌లు.. ఎన్నెన్నో విచిత్రాలు!

2026-11-03 18:13 GMT

బంగ్లా బార్డర్ లో భారత జవాన్లపై దాడి చేస్తే.. ట్రీట్ మెంట్ వేరేలా ఉంటుంది.. అదే జరిగింది..

2026-11-03 18:09 GMT

ఢిల్లీ హోటల్ గొడవపై స్పందించిన మంత్రి దామోదర.. అసలేం జరిగింది?

2026-11-03 18:06 GMT

వైసీపీని 'ఓటు' బ్యాంకు కాపాడిందా?!

2026-11-03 17:30 GMT

కోయ ప్రవీణ్...వైసీపీకి ఆయన కఠినం కానీ !

2026-11-03 17:00 GMT

పెళ్లి కోసం 7 వేల మంది క్యూ.. ఇంత కరువులో ఉన్నారేంట్రా సామీ

2026-11-03 16:30 GMT

మీరు గెలిచినా, ఓడినా ఎవరికీ పట్టదు.. వైరల్ అవుతున్న బిజినెస్‌మ్యాన్ ట్వీట్!

2026-11-03 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS