30న టీడీపీ కూటమి మ్యానిఫెస్టో రిలీజ్ !

తెలుగుదేశం పార్టీ కూటమి ఈ నెల 30న తన ఎన్నికల మ్యానిఫేస్టో రిలీజ్ చేస్తోంది.

Update: 2024-04-28 14:08 GMT

తెలుగుదేశం పార్టీ కూటమి ఈ నెల 30న తన ఎన్నికల మ్యానిఫేస్టో రిలీజ్ చేస్తోంది. ఈ మ్యానిఫెస్టోలో వైసీపీ మ్యానిఫెస్టోలో జగన్ మిస్ అయిన అంశాలు ఆయా వర్గాలకు భారీ ఎత్తుల తాయిలాలతో ఉంటాయని అంటున్నారు. అన్ని వర్గాలకు మేలు చేసేలా సమతూల్యతతో ఈ మ్యానిఫెస్టోని రూపొందించారు అని అంటున్నారు.

మ్యానిఫెస్టోలో కీలక అంశాలనే ప్రస్తావించారు అని తెలుస్తోంది. ఇదిలా ఉండగా రైతులకు రుణమాఫీ డ్వాక్రా మహిళలకు రుణాలు రద్దు వంటి కీలక అంశాలు మ్యానిఫేస్టోలో ఉంటాయా అన్న ఆసక్తి ఉంది. ఎందుకంటే వీటి చుట్టూనే వైసీపీ ఎన్నికల మ్యానిఫేస్టో తిరిగింది.

ఎంతో మంది ఆశలు కూడా పెట్టుకున్నారు. వార్ వన్ సైడ్ చేసెది రైతు రుణ మాఫీ డ్వాక్రా మహిళలకు రుణాలు రద్దు హామీలు అని కూడా వైసీపీ నేతలు భావించారు. జగన్ కి సూచించారు అని ప్రచారం సాగింది. కానీ నిజానికి చూస్తే ఆ హమీలు ఏవీ కనిపించలేదు అన్న అసంతృప్తి కూడా కనిపించింది. ఇక పెన్షనర్లకు కనీసం నాలుగు వేల రూపాయలు అయినా పెన్షన్ ఇస్తే బాగుండేది అది కూడా అనుకున్న మాట ఉంది.

టీడీపీ కూటమి ఇప్పటికే నాలుగు వేల పెన్షన్ ని తన ఎన్నికల హామీని ప్రకటించింది. ఇక మిగిలిన హామీలు ఎలా ఉంటాయో చూడాలి. ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో జనాల్లోకి టీడీపీ కూటమి వెళ్తోంది. ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లను ఉచితంగా ఇవ్వడం, తల్లికి వందనం పేరుతో ప్రతీ కుంటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడం వంటివి కూటమి హామీలుగా ఉన్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉంది.

Read more!

ఈ పధకాలకు తోడుగా మరిన్ని ఆకర్షణీయమైన పధకాలను వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉంటాయని అని అంటున్నారు. మరి టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఏవేమిటి ఉంటాయి అన్న దాని మీదనే చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా టీడీపీ ఎన్నికల ప్రణాళికను రిలీజ్ చేయాలని చూశారు. కానీ ప్రధాని ఎన్నికల ప్రచారం ఏపీలో మరింత లేట్ అయ్యేలా ఉంది. దాంతో ఈ నెల 30వ తేదీన మ్యానిఫేస్టోని రిలీజ్ చేయడానికి చంద్రబాబు నిర్ణయించారు అని తెలుస్తోంది.

దానికి వేదికగా రాయలసీఅం లోని ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరులో జరిగే ఒక సభలో కూటమి నాయకులు అంతా కలసి మ్యానిఫెస్టోని రిలీజ్ చేస్తారు అని అంటున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు పాలుపంచుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే టీడీపీ మ్యానిఫేస్టో రిలీజ్ అయితే అపుడు అసలైన కధ స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. రెండు మ్యానిఫేస్టోలను చూసుకుని బేరీజు వేసుకుని జనాలు కీలక నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు.

Tags:    

Similar News