1100 రకాల విదేశీ కరెన్సీ.. అభినందిస్తున్న ప్రముఖులు!
ఒక్కొక్కరి అభిరుచి ఒక్కో విధంగా ఉంటుంది. అందుకే జివ్వకో రుచి.. పుర్రెకో బుద్ది అని ఊరికే అన్నారా.;
ఒక్కొక్కరి అభిరుచి ఒక్కో విధంగా ఉంటుంది. అందుకే జివ్వకో రుచి.. పుర్రెకో బుద్ది అని ఊరికే అన్నారా. కొన్ని కొన్ని అభిరుచులు బాల్యంలో మొదలై మధ్యలోనే ఆగిపోతాయి. కానీ కొన్ని కొన్ని మాత్రం బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు కూడా కొనసాగుతాయి. కొందరు కొందరు వెడ్డింగ్ కార్డ్స్ కలెక్షన్ చేస్తుంటారు. ఇంటికి వచ్చిన కార్డ్స్ ను జాగ్రత్తగా దాచిపెడతారు. కొందరు విజిటింగ్ కార్డ్స్ ఇలా ఎవరి ఇంట్రస్ట్ ఉన్న దానిపై వారు కసరత్తు చేస్తారు.
బాల్యం నుంచే సేకరణ..
సేకరణ అంటే మనకు ఎక్కువగా గుర్తుకు వచ్చేది స్టాంప్స్, కరెన్సీ. గతంలో పోస్టాఫీస్ లేని గ్రామం ఉండేది కాదు.. ఉత్తర ప్రత్యుత్తరాలతోనే యోగ క్షేమాలు, సమాచారం తెలుసుకునేవారు. కాబట్టి స్టాంట్స్ ఇంపార్టెంట్ అయిపోయాయి. కానీ నేడు ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు. ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉత్తరాల గురించి ఆలోచించడం కూడా లేవు. బహుషా 20'sలో పుట్టిన వారికి ఉత్తరం (లెటర్) అంటే కూడా తెలియకపోచ్చు అంటే ఆశ్చర్యం కలుగకమానదు.
ఇక కరెన్సీ సేకరణ గురించి తెలుసుకుంటే.. కరెన్సీ సేకరణ అనేది ఎక్కువగా విదేశాలలో తిరిగే వారు.. వారి కుటుంబ సభ్యులకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. వివిధ దేశాలకు వెళ్లిన, వచ్చిన సందర్భంలో అక్కడ ఉన్న కరెన్సీకి తీసుకువచ్చి దాచిపెడతారు. విదేశీ ట్రిప్పులు వేయకున్నా కూడా కరెన్సీని సేకరించవచ్చని ఒక యువకుడు నిరూపించాడు. ఆయన కలెక్షన్ చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆయన సేకరించిన కరెన్సీని ప్రదర్శించాడు కూడా..
నవీన్ కుమార్ కు మంచి గుర్తింపు..
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండల కేంద్రానికి చెందిన గర్శకుర్తికి గ్రామవాసి మిట్టపల్లి నవీన్ కుమార్ వృత్తి రిత్యా విద్యుత్ శాఖలో ఏఈగా పని చేస్తున్నారు. తనకు తన తండ్రి చిన్నతనంలో శివాజీ బొమ్మ ఉన్న 2 రూపాయల నాణెం ఇచ్చారు. అప్పటి నుంచి ఆయనకు కరెన్సీ సేకరణపై ఇంట్రస్ట్ పెరిగింది. ఆయన 20 సంవత్సరాలలో 180 దేశాల 1100 రకాల కరెన్సీ సేకరించారు. అందులో నాణేలు, నోట్లు ఉన్నాయి. స్వాతంత్రం రాకముందు బ్రిటీష్ ఈస్ట్ ఇండియాకు చెందిన నాటి (1835) కరెన్సీ కూడా ఆయన వద్ద ఉంది. రాజుల కాలం నుంచి నిజాం రాజు వరకు అందరి కరెన్సీ నాణేల రూపంలో ఉంది.
విదేశీల ను మిత్రులుగా చేసుకొని..
నవీన్ కుమార్ నుమిస్టా అనే వెబ్ సైట్ ద్వారా బెల్జియంకు చెందిన ఒక వ్యక్తిని స్నేహితుడిగా చేసుకున్నాడు. ఆయన పరిచయంతో 60 దేశాల నాణేలను సేకరించారు. ఈయనే కాదు.. ఇటాలియన్ వ్యక్తిని కూడా పరిచయం చేసుకున్న నవీన్ కుమార్ అతడి నుంచి కూడా వివిధ దేశాల కరెన్సీని సేకరించారు. ఇంకా కరెన్సీని సేకరించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు దక్కించుకోవాలని నవీన్ కుమార్ అనుకుంటున్నారట. ఇదే లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తున్నారట.