• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మోదీ వంద రోజుల ప్లాన్‌.....

మోదీ వంద రోజుల ప్లాన్‌.. రెండు కీలక రోడ్‌ ప్రాజెక్టులివే!

| కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే

By - Tupaki Desk
Update: 2024-06-19 12:30 GMT

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. అప్పట్లో అటల్‌ బిహారి వాజపేయి ప్రభుత్వం, ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం జాతీయ రహదారులు, రైల్వే నిర్మాణాలు, కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాయి.

ఇప్పుడు వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ పదవిని చేపట్టారు. ఈ నేపథ్యంలో తొలి వంద రోజుల ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. తొలి వంద రోజుల్లో ప్రారంభించాల్సిన పనుల్లో తెలంగాణకు చెందిన రెండు కీలక రోడ్‌ ప్రాజెక్టులు స్థానం దక్కించుకోవడం విశేషం.

మోదీ 3.0 తొలి ‘వంద రోజుల ప్రణాళిక’లో తెలంగాణలోని ఆర్మూరు–జగిత్యాల–మంచిర్యాల యాక్సెస్‌ కంట్రోల్డ్‌ హైవే, జగిత్యాల–కరీంనగర్‌ నాలుగు వరసల జాతీయ రహదారుల ప్రాజెక్టులకు స్థానం లభించింది. దీంతో ఈ రెండు రోడ్‌ ప్రాజెక్టుల నిర్మాణాలు వేగం పుంజుకోనున్నాయి.

కాగా ప్రధాని మోదీ తన తొలి వంద రోజుల ప్రణాళికకు దేశవ్యాప్తంగా 3 వేల కి.మీ. మేర జాతీయ రహదారుల ప్రాజెక్టులను ఎంచుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో స్వయంగా ప్రధానమంత్రే వీటిని పర్యవేక్షిస్తుండటంతో యుద్ధప్రాతిపదికన ఈ 3 వేల కి.మీ రోడ్డు నిర్మాణ పనులు జరగనున్నాయి. ఇందులో తెలంగాణలోని ఆర్మూరు–జగిత్యాల–మంచిర్యాల యాక్సెస్‌ కంట్రోల్డ్‌ హైవే, జగిత్యాల–కరీంనగర్‌ నాలుగు వరసల జాతీయ రహదారి ఉన్నాయి.

కాగా ఇప్పటికే ఆర్మూరు–జగిత్యాల–మంచిర్యాల రోడ్డుకు టెండర్లు పూర్తయ్యాయి. గతేడాది ఫిబ్రవరిలోనే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ముగిసింది. అలాగే జగిత్యాల–కరీంనగర్‌ జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి కూడా ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి. అయితే ఇప్పుడు స్వయంగా ప్రధానే వీటిని పర్యవేక్షిస్తుండటం, తన వందరోజుల ప్రణాళికలో చేర్చడంతో వీటి పనులు వేగం పుంజుకోనున్నాయి.

నిజామాబాద్‌–ఛత్తీస్‌గడ్‌ లోని జగ్దల్‌ పూర్‌ మధ్య ఉన్న ఎన్‌హెచ్‌–63 ఘోర ప్రమాదాలకు నిలయంగా మారింది. ముఖ్యంగా ఈ రహదారిలో భారీ ట్రక్కులు తిరుగుతుంటాయి. రోడ్డు రెండు వరుసలతో ఇరుకుగా ఉండటంతో తరచూ ప్రమాదాలు జరగడం.. భారీ ఎత్తున ప్రాణ నష్టం సంభవిస్తున్నాయి. దీంతో ఈ రహదారిని నాలుగు వరుసలకు విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఎన్‌హెచ్‌ –63లో ఆర్మూరు–మంచిర్యాల మధ్య ప్రాంతం కూడా ఉంది.

ఆర్మూరు, మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, లక్సెట్టిపేట మీదుగా సాగే ఈ రోడ్డు నిడివి 131.8 కిలోమీటర్లు. ఈ మొత్తం ప్రాజెక్టుకు రూ.3,850 కోట్లు ఖర్చు చేయనున్నారు.

అలాగే జగిత్యాల నుంచి కరీంనగర్, ఖమ్మం వరకు విస్తరించి ఉన్న ఎన్‌హెచ్‌–563లో కీలక భాగమైన 58.86 కి.మీ. రోడ్డును కూడా విస్తరించనున్నారు. ఈ రోడ్డు కూడా ఇరుకుగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు విస్తరణ పనులకు రూ.2,300 కోట్లవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దీనికి కావాల్సిన భూమిని సేకరిస్తున్నారు. దాదాపు పూర్తి కావచ్చింది. దీంతో రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరగనున్నాయి.

Tags:    
  • Narendramodi 
  • Modi 
  • Bjpgovernment 
  • Telanganaroadprojects 
  • Nationalhighways 
  • Nh63 
  • NHAI 
  • Modi100daysplan 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS