• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాబు మైనస్ లు...లోకేష్ కి...

బాబు మైనస్ లు...లోకేష్ కి అవే ప్లస్ లు !

| ఎంత తండ్రీ కొడుకులు అయినా ఒకరి ఆలోచనలు భావాలు నూరు శాతమూ మరొకరికి రావాల్సిన అవసరం అయితే లేదు.

By - Tupaki Desk
Update: 2025-05-20 09:30 GMT

ఎంత తండ్రీ కొడుకులు అయినా ఒకరి ఆలోచనలు భావాలు నూరు శాతమూ మరొకరికి రావాల్సిన అవసరం అయితే లేదు. అలా చూస్తే తండ్రులు ఒక విధంగా విజయం సాధిస్తే తనయులు మరో విధంగా సక్సెస్ అయిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. వారసత్వంగా వచ్చి బలంగా తమ ముద్ర వేసుకుని సూపర్ సక్సెస్ అయిన వారూ అనేకమంది ఉన్నారు. ఇపుడు ఆ జాబితాలో బాబు వారసుడు నారా లోకేష్ చేరబోతున్నారా అన్నదే ప్రధాన చర్చగా ఉంది.

ఒకనాడు పప్పు అని విపక్షాలు గేలి చేసిన లోకేష్ ఈ రోజున నిప్పు కణికగా మారారు. ఆయన చంద్రబాబు కుమారుడు కాబట్టే అలా మారలేదు. తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకోవాలని పట్టుదలతో శ్రమించడం వల్లనే లోకేష్ ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నారు. నిజానికి బాబుకు వారసులుగా నిలవడం ఎవరికీ సాధ్యం కాదు ఎందుకంటే బాబు అన్నింటికీ ఒక బెంచ్ మార్క్ ని చాలా ఎత్తులో పెట్టేశారు.

కానీ లోకేష్ మాత్రం తండ్రి మాదిరిగా అగ్ర శ్రేణి నాయకుడుగా నిలవాలని కలకాలం జనంలో ఉండాలని భావిస్తూ తాను ఎన్నుకున్న రూట్లో వెళ్తున్నారు. అందువల్లనే ఆయన విజయాలు సాధిస్తున్నారు బాబుతో లోకేష్ కి పోలిక పెట్టకపోవడమే ఆయనకు చాలా అనుకూలిస్తోంది. అయితే ఏంత కాదనుకున్నా బాబుతో పోల్చతగిన విషయాలు తేడాలు అన్న చర్చ మరో వైపు జరుగుతూనే ఉంది.

అలా చూసుకుంటే కనుక బాబు లోకేష్ ల మధ్య కొన్ని పోలికలు మరికొన్ని తేడాలు స్పష్టంగా ఉన్నాయి వాటి వల్ల వారికి కలిగిన ప్లస్ మైనస్ ఏమిటి అన్నదే ఒక చర్చ ముందుగా చూసుకుంటే టీడీపీలో బిగ్ ఫిగర్ ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబే అని చెప్పకతప్పదు. దాదాపుగా మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు తన భుజాల మీద మోస్తున్నారు.

తనకు గ్లామర్ లేకున్నా గ్రామర్ తోనే పార్టీని ఇంతదూరం ఆయన తీసుకుని వచ్చారు. 1995లో ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని లాక్కున్నరు అన్న అపప్రధ బాబుకు ఉన్నా 1999, 2014, 2024లలో మూడు సార్లు తానుగానే అధికారాన్ని జనం నుంచి తెచ్చుకుని సీఎం అయిన సంగతిని కూడా ఎవరూ మరచిపోరాదు. ఆ విధంగా చూసుకుంటే కనుక బాబు వ్యూహాలు ఆయన రాజకీయ చాణ్యం ఆయనకు రాజకీయాల మీద మమకారం ప్రజలకు ఏదో చేయాలని తాను చరిత్ర పుటలలో నిలవాలన్న ఆరాటం ఇవన్నీ కలిస్తే బాబుని మహా నాయకుడిగా చేశాయి.

ఇక లోకేష్ విషయానికి వస్తే తండ్రి చాటు బిడ్డగానే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అయితే లోకేష్ పార్టీలో తెర వెనక చాన్నాళ్ళు ఉండి అన్నీ గమనించారు. మెల్లగా అన్నీ చక్కదిద్దుతూ వచ్చారు. పార్టీకి టెక్నాలజీని అద్దిన ఘనత లోకేష్ ది అని చెప్పాలి అంతే కాదు టీడీపీకి కొత్త నీరు చేర్చినదీ ఆయనదే అని ఒప్పుకుని తీరాలి.

క్యాడర్ తో డైరెక్ట్ కనెక్షన్ వారి కోసం పార్టీ ఉందని ఇచ్చిన భరోసా ఇవన్నీ లోకేష్ ఖాతాలోని సక్సెస్ గానే చూడాలి. అలా పార్టీలో తన పట్టుని పెంచుకున్న లోకేష్ ఇంట గెలిచినట్లే అని చెబుతున్నారు. తెలుగుదేశంలో సీనియర్ జూనియర్లు ఉన్నారు. జూనియర్లు యూత్ అంతా ఇపుడు లోకేష్ తోనే ఉంటున్నారు. సీనియర్లలో సైతం పార్టీ పది కాలాలు ఉండాలని భావించే వారు లోకేష్ వైఖరికి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతు ప్రకటిస్తున్నారు.

ఇక లోకేష్ తీసుకునే కొన్ని కఠినమైన నిర్ణయాల్తో ఇబ్బంది పడుతున్న వారు ఎటూ అసంతృప్తి చెందుతారు అది వేరే విషయం. ఇక చంద్రబాబుకూ లోకేష్ కి పోలికలు ఏంటి అంటే ఇద్దరూ కొత్తగా ఆలోచనలు చేయడం, కష్టపడి పనిచేయడం, ప్రజలతో మమేకం కావాలని చూడడం, అందరితో కలివిడిగా ఉండడం, పార్టీకి నాయకులకు అత్యంత విలువ ఇవ్వడం అని చెప్పాలి.

ఇక తేడాలు ఇద్దరిలో ఏమిటి అన్నది చూస్తే కనుక లోకేష్ లో నిర్మొహమాటం ఉంటుంది. అలాగే ముక్కుసూటి తీరు కనిపిస్తుంది. డెసిషన్స్ ఫాస్ట్ గా తీసుకుంటారు. ఎక్కడా నాన్చే వైఖరి ఉండదు, దూకుడుగా రాజకీయాలు చేయడానికి రెడీ అంటారు. నమ్ముకున్న వారికి ఎంతలా ఆదరిస్తారో వెన్నుపోటు పొడిచిన వారి విషయంలో కఠినంగా ఉంటారు.

దీని వల్లనే లోకేష్ పార్టీలో యూత్ కి బాగా నచ్చుతున్నారు. ఈ రోజున పాలిటిక్స్ లో ఈ తరహా డైనమిక్ నేచర్ కావాలని అది లోకేష్ లో ఉందని యువతరం నమ్ముతోంది. ఆయనకు అందుకే పార్టీలో అత్యధికుల మద్దతు కూడా లభిస్తోంది.

చంద్రబాబు విషయంలోకి వస్తే ఆయన మొహమాటం ఎక్కువగా ఉన్న వారు. తనను పార్టీని ఎన్నో మాటలు అని అధికారంలో పార్టీ లేనపుడు వేరుగా ఉన్న వారు తీరా పవర్ లోకి వచ్చాక మళ్ళీ చేరువ అయితే గతాని మరచిపోయి అక్కున చేర్చుకుంటారు. అలాగే సీనియర్ల పేరుతో పార్టీకి భారంగా ఉన్నా వారితో ఉన్న అనుబంధం దృష్య్టా బాబు వారిని కొనసాగిస్తారు అని అంటారు.

అదే లోకేష్ విషయంలో అయితే ఒకసారి వద్దు అనుకున్న వారిని అలాగే దూరం పెడతారు అని చెబుతారు. మొత్తానికి లోకేష్ రేపటి తరం నాయకుడు అన్నది టీడీపీలో వినిపిస్తున్న మాట. బాబు ఈ రోజుకి పార్టీకి సారధ్యం వహిస్తున్న రానున్న రాజకీయాలు మారుతున్న కాలం తీరుకు లోకేష్ నూరు శాతం సూటబుల్ లీడర్ అంటున్నారు.

Tags:    
  • NaraLokesh 
  • ChandrababuNaidu 
  • TDPLegacy 
  • AndhraPolitics 
  • YouthLeader 
  • TDP2024 
  • PoliticalLeadership 
  • TeluguDesam 
  • FutureLeader 
  • LokeshRising 
  • TeluguPolitics 

Similar News

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

Copyright @2026

Powered by Blink CMS