విశాఖలో ఫస్ట్: 'సిఫీ' డేటా సెంటర్‌కు లోకేష్ శంకుస్థాపన.. లాభాలు ఇవే!
ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌గా పిలిచే ఏఐ ఎడ్జ్ డేటా కేంద్రానికి తాజాగా ఆదివారం ఉదయం మంత్రి నారా లోకేష్ శంకు స్థాపన చేశారు;
ఏపీకి ఐటీ రాజధానిగా విరాజిల్లుతున్న విశాఖకు మరో మణిహారం వచ్చి చేరింది. ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌గా పిలిచే ఏఐ ఎడ్జ్ డేటా కేంద్రానికి తాజాగా ఆదివారం ఉదయం మంత్రి నారా లోకేష్ శంకు స్థాపన చేశారు. ప్రముఖ డిజిటల్ ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ దీనిని ఏర్పాటుచేస్తోంది. ఈ కేంద్రం ద్వారా 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్‌తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు.
తద్వారా.. ఏఐ ఆధారత డేటాను విశాఖ కేంద్రం నిక్షిప్తం చేయనున్నారు. దీనిలో 50 మెగా వాట్ల డేటాను నిక్షిప్తం చేయనున్నారు. ఇది తాజా అంచనా. భవిష్యత్తులో 550 మెగా వాట్ల డేటా సామర్థ్యాన్ని పెంచను న్నారు. దీనికి గాను మొత్తం 15 వేల కోట్ల రూపాయలను సంస్థ వెచ్చించనుంది. ప్రాథమికంగా వచ్చే రెండే ళ్లలో 1500 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. తర్వాత దశల వారీగా 15 వేల కోట్ల మేరకు పెట్టుబడు లు పెట్టనుంది. ఈ సంస్థ రాకతో ప్రస్తుతం 1000 మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఈ డేటా కేంద్రాన్ని రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 29 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. రుషికొండలో 3.6 ఎకరాలు, పరదేశి పాలెంలో 20 ఎకరాలను ప్రభుత్వం ఇవ్వనుంది. ప్రస్తుతం రుషికొండపై ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో 2027 నాటికి పూర్తిస్థాయిలో డేటా కేంద్రం అందుబా టులోకి రానుంది. వాస్తవానికి సిఫీ సంస్థకు దేశవ్యాప్తంగా బ్రాంచులు ఉన్నాయి. అయితే.. ఏపీలో మాత్రం ఇదే తొలిసంస్థ కావడం విశేషం.
ఇవీ లాభాలు..
1) దశల వారీగా 10 వేల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పన జరగనుంది.
2) దేశంలోని అన్ని డేటా కేంద్రాల్లో కెల్లా ఇదే పూర్తిస్థాయి అతి పెద్ద కేంద్రం.\
3) విశాఖ ఐటీ రాజధానిగా అవతరించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించనుంది.
4) ప్రపంచ స్థాయి కంపెనీలు సైతం ఇక్కడకు వచ్చే వీలుంది.
5) క్వాంటం కంప్యూటింగ్‌లో ఈ డేటా కేంద్రం కీలక పాత్ర పోషించనుంది.