బాలయ్య... జగన్-లోకేష్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ రాజకీయాల్లో ఇపుడు లోకేష్ ఒక కీలక నేతగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు.;

Update: 2026-04-29 18:17 GMT

ఏపీ రాజకీయాల్లో ఇపుడు లోకేష్ ఒక కీలక నేతగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. దాంతో సమరోత్సాహంతో ఉన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో లోకేష్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలంగానే ఉన్నాయి. ఆయన ఇపుడు టీడీపీకి సర్వ సత్తాక నాయకుడు. దాంతో పార్టీ గురించి ఆయన కీలక ప్రకటనలు చేస్తున్నారు. వర్తమానం భవిష్యత్తు గురించి కూడా లోకేష్ తన ప్రసంగంలో మాట్లాడారు. ఈ సమయంలో తన మేనమామ బాలయ్య గురించి అలాగే రాజకీయ ప్రత్యర్ధి జగన్ గురించి చేసిన వ్యాఖ్యలు అయితే వైరల్ అవుతున్నాయి.

ముద్దుల మామయ్య తొడ కొట్టాడంటే :

అందరికీ బాలయ్య తనకు మాత్రం ముద్దుల మామయ్య అని లోకేష్ ఈ సందర్భంగా చెప్పడం విశేషం. ఇక బాలయ్య సినిమాల్లో తొడ కొడుతూ ఉంటారు, విలన్లకు ఆయన సినిమాలో చుక్కలు చూపిస్తూంటారు. అలాంటి బాలయ్య రాజకీయంగా తొడకొట్టాడంటే వైసీపీ బ్యాచ్ కి ఎండ్ కార్డు పడుతుందని ఒక్కరు కూడా మిగలరని లోకేష్ చెప్పుకొచ్చారు. పసుపు సైన్యమే వైసీపీకి తెర దించుతుందని అన్నారు.

జగన్ ఒక ఉదాహరణ :

టీడీపీ సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ జగన్ ప్రస్తావన తెచ్చారు. పైగా ఆయన్ని ఉదాహరణగా తీసుకోవాలని క్యాడర్ కి దిశా నిర్దేశం చేశారు. మరి జగన్ ని ఎందుకు ఉదాహరణకు తీసుకోవాలీ అంటే అదే లోకేష్ చెప్పేది. అహంకారం తలకెక్కితే ఏ స్థాయిలో దిగజారుతమో జగన్ వైఖరి ఒక ఉదాహరణ అని లోకేష్ గుర్తు చేశారు. అధికారంలో ఉండగా జగన్ అనుసరించిన వైఖరి వల్లనే వైసీపీ ఏకంగా 11 సీట్లకు దిగజారిందని క్రికెట్ టీం నంబర్ కి పడిపోయింది అని లోకేష్ ఎద్దేవా చేశారు.

పార్టీలో సిస్టం తెచ్చాం :

పార్టీలో ఒక సిస్టం ని తెచ్చామని ఓటీపీ విధానం ప్రవేశపెట్టామని లోకేష్ చెప్పారు. అలా ఎందుకు తెచ్చారని పార్టీ నాయకులు అనుకున్నారని కానీ ఒక విధానం ప్రకారం పార్టీ పనిచేయాల్సి ఉందని అన్నారు. అంతే కాదు ఎవరు పనిచేస్తున్నారో ఎవరు చేయడం లేదో పార్టీ ఎప్పటికపుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మై యాప్ టీడీపీ అన్న యాప్ తీసుకుని వచ్చామని లోకేష్ చెప్పారు. టెక్నాలజీతో అనుసంధానం అవాలని ఆయన కోరారు. మైటీడీపీ ని ప్రతీ ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకోవాలని అన్నారు. నాయకులు ఎవరైనా పార్టీ కోసం చేసే ప్రతీ కార్యక్రమాన్ని అందులో అప్ లోడ్ చేయాలని లోకేష్ సూచించారు.

ఎన్నో మంచి పనులు :

ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఎన్నో మంచి పనులు చేశామని లోకేష్ చెప్పారు. ఏపీకి దాదాపుగా 800 దాకా ప్రాజెక్టులు తీసుకుని వచ్చామని అలాగే 10 060 పోస్టులు జాబ్ క్యాలండర్ తెచ్చామని లోకేష్ చెప్పారు. వీటిని పార్టీ నాయకులు జనంలో ప్రచారంలోకి తీసుకుని రావాలని కోరారు ప్రతీ ఒక్కరు తమ బాధ్యతలను తెలుసుకుని పార్టీ కోసం పనిచేయాలని లోకేష్ దిశా నిర్దేశం చేశారు.

Tags:    

Similar News