నంబర్ టూ...లోకేష్ కి టఫ్ టాస్క్
తెలుగుదేశం పార్టీ ఈనాటిది కాదు, నాలుగున్నర దశాబ్దాల చరిత్ర ఆ పార్టీ సొంతం. పార్టీ అధినాయకత్వానికి క్యాడర్ కి మధ్య అన్యోన్యమైన అనుబంధం ఉండడమే తెలుగుదేశం పార్టీ స్పెషల్.;
తెలుగుదేశం పార్టీ ఈనాటిది కాదు, నాలుగున్నర దశాబ్దాల చరిత్ర ఆ పార్టీ సొంతం. పార్టీ అధినాయకత్వానికి క్యాడర్ కి మధ్య అన్యోన్యమైన అనుబంధం ఉండడమే తెలుగుదేశం పార్టీ స్పెషల్. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా నిద్ధతతో పనిచేసే సైన్యం టీడీపీ సొంతం. తెలుగుదేశం పార్టీ నాది అనుకునే కార్యకర్తలు లక్షల్లో ఉన్నారు. అలాంటి వారికి ఎన్టీఆర్ చంద్రబాబు నాయకత్వం ఎంతో ఉత్తేజం గా ఉంటూ వచ్చింది. తెలుగుదేశంలో ఇపుడు మూడవ తరం ప్రవేశించింది. నారా లోకేష్ టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణం చేశారు. పార్టీలో ఆయన ఇపుడు నంబర్ టూగా ఉంటున్నారు. చంద్రబాబు తరువాత అంతటి స్థానం. ఒక విధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే పార్టీని తాను గా ముందుకు నడిపించాల్సి ఉంటుంది.
బాబు వ్యూహాల పుట్ట :
తెలుగుదేశం పార్టీ సుదీర్ఘమైన ప్రస్థానం తీసుకుంటే వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ది గ్లామర్. ఆయన ఇమేజ్ పార్టీకి కొండంత శ్రీరామ రక్షగా ఉంటూ వచ్చింది. ఇక చంద్రబాబు హయాంలో చూస్తే ఆయన గ్రామర్ పార్టీని నిలబెట్టింది. కష్టకాలాలూ సంక్షోభాలు ఎన్నో చూసినా బాబు తనదైన శైలిలో వ్యూహ రచన చేసి టీడీపీని ఎపుడూ ముందు నిలబెడుతూ వచ్చారు. టీడీపీకి ఇన్ని సార్లు అధికారం దక్కడం వెనక బాబు మార్క్ చాణక్య రాజకీయం ఉంది. ఇలా టీడీపీ లాంగ్ టెర్మ్ ఇన్నింగ్స్ వెనక బాబు ప్రణాళికలు ఎన్నో ఉన్నాయి.
సవాళ్ళు ఉన్నాయి :
ఇపుడు లోకేష్ నాయకత్వంలోకి దాదాపుగా టీడీపీ వచ్చినట్లే. మరి టీడీపీని ఆయన ఏ విధంగా నడిపిస్తారు అన్నది అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. అది సొంత పార్టీ వారే కాదు బయట పార్టీ వారు మిత్రులు ప్రత్యర్ధులు అందరి చూపూ లోకేష్ మీదనే ఉంటుంది. ఎందుకంటే ఆయన టీడీపీ వంటి చరిత్ర కలిగిన పార్టీలో అత్యంత కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి. ఇక ఈ పదవిలో లోకేష్ ముందు ఉన్న సవాళ్ళు ఏమిటి అన్న చర్చ కూడా సాగుఓంది. ఆయనకు సొంత పార్టీలో బాగానే పట్టు ఉంది. బాబుతో పాటుగా లోకేష్ మాటను కూడా తుచ తప్పకుండా టీడీపీ శ్రేణులు పాటిస్తాయి. ఆ మేరకు ఇబ్బంది లేకపోయినా కూటమి పార్టీలను కో ఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఆయనకు ఉంది. ఎందుకంటే మూడు పార్టీలు కలసిన కూటమి ఏపీలో అధికారంలో ఉంది.
వ్యూహ రచనా చాతుర్యం :
ఏ రాజకీయ పార్టీ అధినాయకత్వానికి అయినా వ్యూహ రచన అన్నది అవసరం. సమయానుకూలంగా ఎత్తుకు పై ఎత్తులు వేయాలి. ఎపుడూ తమదే పై చేయిగా చేసుకోవాలి. ఈ విషయంలో బాబుకు తిరుగులేదు. ఆయన వ్యూహాలు ప్రత్యర్ధుల అంచనాలకు అందవు. అంతలా బాబు తన రాజకీయాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అయితే లోకేష్ కూడా అదే విధమైన వ్యూహాలకు పదును పెట్టాల్సి ఉంటుంది. రాజకీయంగా ఆయన మరింతగా రాటు తేలాల్సి ఉంటుందని సూచనలు అయితే వస్తున్నాయి. ఇక ఎన్నికల ప్రచారంలో కూడా లోకేష్ తనదైన మార్క్ ని చూపించాలి. చంద్రబాబు ప్రచార ఎత్తుగడలు వేరుగా ఉంటాయి. ఆయన ఎదుటి పక్షాన్ని నిలువరిస్తూనే టీడీపీని ముందు నిలుపుతారు. తన మాటలతోనే ప్రత్యర్ధులను చిత్తు చేస్తారు, వారిని కార్నర్ లోకి నెడతారు. ఆంత రక్షణలో పడేస్తారు. లోకేష్ కూడా తన తండ్రి పంధాలో సాగుతారా లేక వర్తమాన కాలానికి తగినట్లుగా మరిన్ని మెలకువలతో దూసుకుని వెళ్తారా అన్నది చూడాల్సి ఉంది.
క్యాడర్ టూ లీడర్ :
ఏ రాజకీయ పార్టీకి అయిన ఇది అయ్తంత ముఖ్యం. లీడర్ కి క్యాడర్ కి మధ్య కనెక్షన్ ఉండాలి. అది కనుక సక్రమంగా లేకపోతే అన్ని ఇంబ్బందులూ వస్తున్నారు. అంతే కాదు కూటమి పార్టీలతో టీడీపీ పార్టీ క్యాడర్ కి మంచి కో ఆర్డినేషన్ ఉండాలి. ఈ విషయంలో కూడా ఎప్పటికప్పుడు అధినాయకత్వం సరిచేసుకోవాల్సి ఉంటుంది. పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజులల్లో అందరికీ రాజకీయ ఆకాంక్షలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో పోటీ ఉంది. వాటిని తట్టుకుంటూ ఎవరికీ ఇబ్బంది లేకుండా చూడడమే లోకేష్ వంటి యువ నేత ముందున్న ప్రాథమిక కర్తవ్యం. మొత్తానికి చూస్తే లోకేష్ పార్టీకి సరైన వారధిగా సిసలైన సారధిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ విషయంలో లోకేష్ ఆలోచనలు ఏమిటి ఎలా చేయబోతున్నారు అన్నదే ఇపుడు అందరూ ఆసక్తిగా గమనిస్తున్న విషయం.