విద్యావ్యవస్థలో సరికొత్త శకం: నారా లోకేష్ 'నిజాయితీ' మార్క్ సంస్కరణలు

రాజకీయాలంటే అధికారం..ప్రచారం.. విమర్శలు మాత్రమే అని భావించే కాలంలో.. విలువలకి పట్టం కడుతూ విద్యావ్యవస్థను రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్దుతున్న అరుదైన నాయకత్వం ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తోంది.;

Update: 2026-05-01 06:19 GMT

రాజకీయాలంటే అధికారం..ప్రచారం.. విమర్శలు మాత్రమే అని భావించే కాలంలో.. విలువలకి పట్టం కడుతూ విద్యావ్యవస్థను రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్దుతున్న అరుదైన నాయకత్వం ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తోంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నారా లోకేష్ తనదైన ముద్ర వేస్తున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కేవలం సంస్కరణలు మాత్రమే కావు.. అవి రేపటి తరం భవిష్యత్తుకు బలమైన పునాదులు.

రాజకీయాలకు అతీతంగా విద్య.. అదే అసలైన సంకల్పం

గతంలో విద్యా వ్యవస్థ తరచుగా రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండేది. కానీ లోకేష్ గారు బాధ్యతలు చేపట్టాక "నో పాలిటిక్స్.. ఓన్లీ ఎడ్యుకేషన్" అనే నినాదాన్ని ఆచరణలో చూపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు అంటే కేవలం భవనాలు కావని.. అవి ప్రతిభకు నిలయాలని ఆయన నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్త విద్యా సంస్కరణలను అధ్యయనం చేస్తూ మన రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా వాటిని అమలు చేస్తున్నారు.

చరిత్రాత్మక నిర్ణయం.. విద్యార్థులే అసలైన సెలబ్రిటీలు

ఇటీవల విడుదలైన పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల సందర్భంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సాధారణంగా ప్రభుత్వ విజయాలను చాటిచెప్పే ప్రకటనల్లో రాజకీయ నాయకుల ఫోటోలు భారీగా కనిపిస్తాయి. కానీ చరిత్రలో తొలిసారిగా విద్యాశాఖ విడుదల చేసిన ఫుల్ పేజీ ప్రకటనల్లో నాయకుల ఫోటోలు లేవు. కేవలం విజయం సాధించిన విద్యార్థుల చిరునవ్వులు.. వారి ప్రతిభ మాత్రమే కనిపించాయి."రాజకీయ ప్రచారం కోసం కాదు, విద్యార్థుల కష్టాన్ని గౌరవించడం కోసమే ఈ అడుగు" అని నిరూపించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది.

విలువల విద్యా వ్యవస్థ.. మహనీయుల స్ఫూర్తి

లోకేష్ నేతృత్వంలో విద్యా పథకాల అమలులో పారదర్శకత స్పష్టంగా కనిపిస్తోంది. పథకాలకు రాజకీయ రంగు పులమకుండా మహనీయుల పేర్లను పెట్టడం ద్వారా విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. స్కూల్ కిట్లు, పుస్తకాలు లేదా సైకిళ్లపై రాజకీయ నాయకుల చిత్రాలు ఉండకూడదనే నిర్ణయం ఆయన నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. ప్రచార ఆర్భాటం కంటే సేవ ముఖ్యం అనే సందేశాన్ని ఆయన చేతల్లో చూపిస్తున్నారు.

కార్పొరేట్ సవాళ్లకు దీటుగా ప్రభుత్వ విద్య

కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఉండే ఒత్తిడితో కూడిన వాతావరణానికి భిన్నంగా ప్రభుత్వ పాఠశాలల్లో స్నేహపూర్వక బోధనను ప్రవేశపెట్టారు. పిల్లలకు కేవలం పాఠాలు నేర్పడమే కాకుండా వారి రక్షణ, పోషణ మరియు నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉపాధ్యాయులతో నిరంతరం చర్చిస్తూ క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరిస్తూ వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచారు.

ఆశావహ దృక్పథం

ఒక నాయకుడి విజయం ఆయన చెప్పే మాటల్లో కాదు.. ప్రజల్లో కలిగే నమ్మకంలో ఉంటుంది. నారా లోకేష్ గారు తన పారదర్శకతతో ఆ నమ్మకాన్ని గెలుచుకున్నారు. అతిశయోక్తులు లేని నివేదికలు, ఆచరణ సాధ్యమైన ప్రణాళికలు ఆంధ్రప్రదేశ్ విద్యా రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెడతాయనడంలో సందేహం లేదు.

ప్రతి విద్యార్థి కల నిజం కావాలని.. ప్రతి తల్లిదండ్రి గర్వంగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపే రోజు రావాలనే ఆకాంక్షతో ముందుకు సాగుతున్న లోకేష్ గారి ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం.

 

Tags:    

Similar News