కారు ఎక్కించి మార్కులు కొట్టేసిన లోకేశ్

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కొన్ని సిత్రాలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు సదరు నేత ఇమేజ్ నను పెంచేలా ఉంటే.. మరికొన్ని సందర్భాల్లో ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయ్యేలా వ్యవహరిస్తుంటారు.;

Update: 2025-09-23 04:20 GMT

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కొన్ని సిత్రాలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు సదరు నేత ఇమేజ్ నను పెంచేలా ఉంటే.. మరికొన్ని సందర్భాల్లో ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయ్యేలా వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు రెండో కోవలోకి వస్తారు ఏపీలోని కూటమి సర్కారులో అత్యంత పవర్ ఫుల్ వ్యక్తుల్లో ఒకరు ఏపీ మంత్రి నారా లోకేశ్. అహాన్ని ప్రదర్శించకుండా ఎప్పటికప్పుడు డౌన్ టు ఎర్త్ అన్నట్లుగా వ్యవహరిస్తూ మార్కులు కొట్టేస్తున్నారు ఈ మధ్యన. ఏపీ లోని కూటమి సర్కారులోని అత్యంత ముఖ్యుల్లో ఒకరు నారా లోకేశ్ అన్న విషయం తెలిసిందే. అత్యంత పవర్ ఫుల్ స్థానంలో ఉండి కూడా.. ఆ అహాన్ని ప్రదర్శించకుండా ఉండటంతో ఆయనకు ఆయనే సాటి అన్న పేరు పలువురినోట వినిపిస్తూ ఉంటుంది.

వీలైనంతవరకు అందరిని కలుపుకుంటూ పోతున్న ఆయన.. ఏ మాత్రం అవకాశం ఉన్నా.. తనను నమ్మిన వాళ్లకు మేలు చేస్తూ శ్రమించటం.. తన నియోజకవర్గ ప్రజలకు మాత్రమే కాదు.. పార్టీకి చెందిన వారు ఎవరైనా సరే.. సాయం కోసం వస్తే వారిని ఉత్త చేతులతో పంపకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తోంది. అదే సమయంలో మీడియాలోనూ.. సామాజిక మాధ్యమాల్లోనూ హైలెట్ అయ్యే అంశాలకు ర్యాపిడ్ వేగంతో రియాక్టు అవుతూ.. ప్రభుత్వ స్పందన బాగుందన్న భావన కలిగేలా చేయటంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాము డిసైడ్ చేసి.. గౌరవనీయ స్థానాల్లో కూర్చోబెట్టే వారి విషయంలోనూ ప్రోటో కాల్ ప్రకారం వ్యవహరిస్తున్న వైనం అందరిని ఆకర్షిస్తోంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సోమవారం అసెంబ్లీ ఆవరణ ఈ తరహా ఆసక్తికర సన్నివేశానికి వేదికైంది. అసెంబ్లీ లాబీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడికి మంత్రి లోకేశ్ ఎదురుపడ్డారు. ఈ క్రమంలో స్పీకర్ కు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తూ.. ఆయన వెంటన వాహనం వరకు లోకేశ్ వెళ్లారు.

స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్న పాత్రుడికి లోకేశ్ స్థాయి తెలియంది కాదు కదా. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాల్ని చూసిన ఆయన.. లోకేశ్ స్వయంగా కారు వద్దకు రావటం ఆయనకు ఇబ్బందిగా అనిపించింది. స్పీకర్ హోదాలో తాను ఉన్నప్పటికి.. తన స్థాయి నేతను లోకేశ్ అంత మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తున్న తీరుకు కాస్త ఇబ్బంది పడుతూ.. కారులోకి తనను ఎక్కించే పని లోకేశ్ చేయొద్దన్నట్లుగా గట్టిగా ఆయన చేతిని పట్టుకొని అక్కర్లేదని.. తాను వెళతానని చెప్పేందుకు ప్రయత్నించారు.

అయితే.. లోకేశ్ మాత్రం అయ్యన్న పాత్రుడ్ని స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తినన్న విషయాన్ని తాను గుర్తిస్తున్నట్లు.. ఆ పదవిలో ఉన్న వారికి తాను ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చే విషయంలో తాను కట్టుబడి ఉన్న విషయాన్ని చాటి చెబుతూ.. ఆయన వారిస్తూ ఉన్నా.. ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకుంటూ.. స్వయంగా కారు ఎక్కించిన వైనం అందరిని ఆకర్షించింది. ఉన్నత స్థానాలకు చేరుకోవటం చాలామందికి సాధ్యమవుతుంది. కానీ.. ఆస్థాయికి వెళ్లిన తర్వాత కూడా ఒదిగి ఉండే లక్షణం కొద్దిమందిలోనూ కనిపిస్తుంది. అలాంటి తీరు ఉన్న నేత లోకేశ్ అన్న భావన కలిగేలా చేయటంలో ఆయన సక్సెస్ అవుతున్నారని చెప్పాలి.

Tags:    

Similar News