వైసీపీ కుట్ర రాజ‌కీయం: లోకేష్ ఫైర్‌

ఏపీ విప‌క్ష పార్టీ వైసీపీపై మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Update: 2026-06-01 04:20 GMT

ఏపీ విప‌క్ష పార్టీ వైసీపీపై మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైసీపీ కుట్ర రాజ‌కీ యాలు చేస్తోంద‌ని మండిప‌డ్డారు. తానే దొంగ‌త‌నం చేసి.. ఎవ‌రో చేసిన‌ట్టుగా.. న‌య‌వంచ‌క రాజ‌కీయాల‌కు తెర‌దీసింద‌ని ఆరోపించారు. నంద్యాల‌లోని శ్రీనివాస సెంటర్ వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై మంత్రి లోకేష్ స్పందించారు. ఈ ఘ‌ట‌న గురించి వైసీపీ చేస్తున్న ప్ర‌చారంలో ఎలాంటి వాస్త‌వం లేద‌ని ఆయ‌న అన్నారు.

వైఎస్సార్ విగ్రహం ధ్వంసం వ్యవహారంలో మరోమారు వైసీపీ డ్రామాలు బట్టబయలు అయ్యాయ‌ని తెలిపారు. నంద్యాల లో వైఎస్సార్ విగ్రహం తల ధ్వంసం చేసిన వ్యవహారంలో వైసీపీ కుట్రలు వెలుగులోకి వ‌చ్చాయ‌ని తెలిపారు. సీసీ కెమేరా ఫుటేజీ ద్వారా వైసీపీ డ్రామా ప‌క్కాగా రుజువైంద‌ని తెలిపారు. ఈ ఘటనకు పాల్పడింది వైసీపీ కార్యకర్త జమలయ్య అని పోలీసులు నిర్ధారించిన విష‌యాన్ని నారా లోకేష్ పేర్కొన్నారు. 2018 నుంచి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి, నంద్యాల వార్డు కౌన్సిలర్, వైసీపీ నేత పున్నా శేషయ్యకు నిందితుడు జమలయ్య అనుచరుడిగా ఉన్నాడ‌ని పేర్కొన్నారు.

వైసీపీ రాజకీయ కార్యకలాపాల్లో సుదీర్ఘ కాలంగా క్రియాశీలకంగా ఉన్న జమలయ్య 2022 లో అప్పటి పాలకుల సిఫార్సు తో కమ్యూనిటీ రిసోర్సు పర్సన్ గా ఆయ‌న భార్య‌ పని చేశార‌ని తెలిపారు. వైఎస్సార్ విగ్రహం ధ్వంసం చేసిన వ్యవహారంలో ఇతర పార్టీల ప్రమేయం ఏమి లేదని, ఈ ఘటనలో నేరుగా నిందితుడు జమలయ్య పాల్గొన్నట్టు పోలీసులు తేల్చి చెప్పిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. సీసీ కెమెరాల వీడియోతో పాటు ఇతర ఆధారాల ను పరిశీలించి ఈ కుట్రలో ఇతరుల భాగస్వామ్యం పై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు స్ప‌ష్టం చేశార‌ని తెలిపారు.

ఉద్దేశపూర్వకంగా ముందుగానే ఈ కుట్రకు పాల్పడ్డారా అన్న అంశంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసినా, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే ప్రయత్నం చేసినా కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మ‌రోవైపు.. సామాజిక మాధ్య‌మం వేదిక‌గా వైసీపీ తీరును మంత్రి త‌ప్పుబ‌ట్టారు. గ‌తంలో గుల‌క రాయి, కోడిక‌త్తి డ్రామాలు ఆడిన జ‌గ‌న్నాట‌క సూత్ర‌ధారి.. జ‌గ‌న్ అని ఎద్దేవా చేశారు. జనం ఛీకొట్టినా ఇంకా మార‌లేద‌ని దుయ్య‌బ‌ట్టారు.

Tags:    

Similar News