టీడీపీ పోరాట యోధుడు శేషగిరిరావు మృతి... ఎవరో గుర్తుకు వచ్చారా?

గత ఏడాది జరిగిన చారిత్రాత్మక ఎన్నికలకు ముందు నంబూరి శేషగిరి రావు పేరు చాలా మందికి తెలియకపోవచ్చు.;

Update: 2025-07-20 11:17 GMT

గత ఏడాది జరిగిన చారిత్రాత్మక ఎన్నికలకు ముందు నంబూరి శేషగిరి రావు పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ... ఆ ఎన్నికల సమయంలో మార్చర్ల నియోజకవర్గంలో జరిగిన ఓ ఘటన ఈయన పేరును టీడీపీ శ్రేణుల్లో ఓ హీరోగా మార్చేసింది. అయితే ఆ టీడీపీ హీరో దురదృష్టవశాత్తు గుండెపోటుతో మరణించారు. ఈ వార్త తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదం నింపింది.

అవును... మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయిగేట్‌ గ్రామానికి చెందిన టీడీపీ నేత నంబూరి శేషగిరిరావు గుండెపోటుతో మృతి చెందారు. దీనిపై సీఎం చంద్రబాబు, లోకేష్, విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నాడు వైసీపీ అరాచకాలపై తిరుగుబాటు చేసి వీరోచితంగా పోరాడిన ఒక యోధుడిని కోల్పోవడం బాధాకరమని చంద్రబాబు అన్నారు.

శేషగిరిరావు గుండెపోటుతో మృతి చెందడం విచారకరమని.. నాడు ప్రతిపక్షంలో వైసీపీ అరాచకాలపై తిరుగుబాటు చేసి వీరోచితంగా పోరాడిన యోధుడిని కోల్పోవడం బాధగా ఉందని.. పసుపుజెండా చేతబట్టి రౌడీ, ఫ్యాక్షన్ రాజకీయ నాయకులపై శేషగిరిరావు చేసిన తిరుగుబాటు టీడీపీకి స్ఫూర్తిగా నిలిచిందని.. ఈ సందర్భంగా శేషగిరిరావు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు.

ఈ సందర్భంగా... 2024 ఎన్నికల సమయంలో పాల్వాయిగేట్ లోని ఓ బూత్ లో వైసీపీ నేతలు సాగించిన విధ్వంసం పట్ల శేషగిరి రావు ఎదురొడ్డి నిలిచారని.. ఆయన పోరాటం టీడీపీ నేతలు, కార్యకర్తల్లో ఎంతో స్ఫూర్తి నింపిందని.. ఆయన మరణం పార్టీకి తీరనిలోటని.. ఆయన కుటుంబానికి పార్టీ అన్నివిధాల అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ అన్నారు.

ఇదే సమయంలో... నంబూరి శేషగిరిరావు కుటుంబ సభ్యులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సాధారణ ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బూత్ క్యాప్చర్‌ ను శేషగిరిరావు ధైర్యంగా అడ్డుకున్నారని గుర్తుచేశారు.

కాగా... 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. మరికొందరిని వెంటబెట్టుకుని పోలింగ్‌ బూత్‌ లోకి చొరబడి ఈవీఎంను ధ్వంసం చేయడంతోపాటు, సామాగ్రిని పగులగొట్టిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎమ్మెల్యే దాడిని.. టీడీపీ ఏజెంట్ అయిన శేషగిరి రావు అడ్డుకున్నారు.

దీంతో పిన్నెల్లి మనుషులు ఆయనపై దాడి చేశారు. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా నిలవడమే కాక.. నంబూరి శేషగిరి రావు పేరు టీడీపీ శ్రేణుల్లో మార్మోగిపోయింది.

Full View
Tags:    

Similar News