నాగార్జున ఫ్యామిలీ మెంబెర్ డిజిటల్ అరెస్ట్.. కింగ్ షాకింగ్ కామెంట్స్!

పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.;

Update: 2025-11-17 08:13 GMT

పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నేపథ్యంలో సినీపెద్దలు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్టార్ నటుడు, నిర్మాత అక్కినేని నాగార్జున మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడి వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సైట్ వెనకున్న మాస్టర్ మైండ్ ఇమ్మడి రవి వద్ద ఉన్న హార్డ్ డిస్క్ లో సుమారు 21 వేల సినిమాలు ఉన్నాయని హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించడం షాకింగ్ గా మారింది. అనంతరం అక్కినేని నాగార్జున మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా... ఐబొమ్మతో సినిమా పైరసీ అనేది కేవలం రూ.20 కోట్ల కోసం చేసిన పని కాదని.. దీని వెనుక అంతర్జాతీయ రాకెట్, అంతర్జాతీయ మోసం ఉందని తెలిపారు. అతని వద్ద 50 లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారని సీపీ సజ్జనార్ తెలిపారని.. అంటే వారందరి పర్సనల్ డేటా పూర్తిగా వాళ్ల వద్ద ఉన్నట్లేనని అన్నారు. ఈ నేపథ్యంలో తన కుటుంబంలో జరిగిన షాకింగ్ విషయాన్ని పంచుకున్నారు.

ఇందులో భాగంగా... సుమారు ఆరేడు నెలల క్రితం తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఆల్ మోస్ట్ రెండు రోజులు డిజిటల్ అరెస్ట్ చేశారని నాగార్జున తెలిపారు. దీని వెనుకున్న వ్యవస్థ పక్కాగా పని చేస్తుందని.. ఇందులో తొలుత ట్రాప్ చేస్తారని, బలహీనతలు తెలుసుకుంటారని.. ఈ క్రమంలో క్రెడిట్ కార్డ్ వివరాలతో పాటు అన్ని వివరాలు సంపాదిస్తారని అన్నారు. పైరసీ లో సినిమాలు చూపించడం అనేది బిగ్ ట్రాప్ అని తెలిపారు.

తన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ కీ ఈ సమస్య ఎదురైనప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించినట్లు నాగార్జున తెలిపారు. దీంతో పోలీసులు లైన్ లోకి రాగానే.. డిజిటల్ అరెస్ట్ కు ప్రయత్నించినవాళ్లు వెంటనే మాయమైపోయారని అన్నారు. అయితే, తర్వాత వాళ్లను ట్రేస్ చేయడం కుదరలేదని.. వాళ్లు అంత పగడ్భందీగా ఉన్నారని నాగ్ వివరించారు.

పైరసీ సినిమా వెబ్ సైట్ నిర్వాహకులు.. జనాలకు ఏదో ఉచితంగా సినిమాలు చూపించాలని కాదని, దీని వెనుక బిగ్ ప్లాన్ ఉంటుందని, ఇందులో భాగంగా వేల కోట్ల రూపాయలు సంపాదన లక్ష్యం ఉంటుందని, ఇమ్మడి రవి వద్ద దొరికిన రూ.3 కోట్లు వాళ్ల సంపాదనలో 'చిల్లర' అని నాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.




Tags:    

Similar News