"సిరా పూసిన సామన్యుడి వేలి సంతకంతో నీ గెలుపు సిద్దమైంది"

నిన్ను నమ్మని వాళ్ల కోసం కూడా ఎందుకు నిలబడతావ్ అని అడిగితే 'చెట్టుని చూపిస్తాడు' అది నాటిన వాళ్లకి మాత్రమే నీడనిస్తుందా అని.

Update: 2024-05-12 08:43 GMT

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఉద్దేశించి ఆయ‌న సోద‌రుడు, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు క‌వితాత్మ‌క మెసేజ్ ఒక‌టి ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. ''సిరా పూసిన సామన్యుడి వేలి సంతకంతో నీ గెలుపు సిద్దమైంది'' అంటూ.. ఆయ‌న వ్యాఖ్యానించారు. దీనికి ప‌వ‌న్ క‌ల్యాణ్ చెమ‌ట‌ను స్వ‌యంగా నాగ‌బాబు తుడుస్తున్న ఫొటోను పోస్టు చేయ‌డం విశేషం.

నిన్ను నమ్మని వాళ్ల కోసం కూడా ఎందుకు నిలబడతావ్ అని అడిగితే 'చెట్టుని చూపిస్తాడు' అది నాటిన వాళ్లకి మాత్రమే నీడనిస్తుందా అని.

నీతో నడవని వాళ్ల కోసం కూడ ఎందుకు నిందలు మోస్తావ్ అని అడిగితే 'వర్షాన్ని చూపిస్తాడు' తనకి మొక్కని 'రైతు కంటిని తడపుకుండా పంటనే తడపుతుందని.

అప్పట్నుంచి అడగటం మానేసి... ఆకాశం లాంటి అతని ఆలోచనా విశాలతని అర్ధం చేస్కోడం మొదలెట్టాను. సేనానీ మీరు చిందించిన ప్రతి చెమట బొట్టు రేపటితరం ఎక్కబోయే మార్గదర్శపు మెట్టు కాబోతుంది కూటమి రాబోతుంది.- అని నాగ‌బాబు ట్వీట్ చేశారు.

పిఠాపురం నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న అక్క‌డే ఉన్న‌ట్టు స‌మాచారం. సోమ‌వారం జ‌ర‌గ‌నున్న పోలింగ్‌ను ప‌రిశీలించేందుకు.. ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే.. గ‌త 30 రోజులుగా చేసిన ప్ర‌చారం.. ప్ర‌సంగాల నుంచి ఆదివారం ఆయ‌న కొంత రిలాక్స్ అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో నాగ‌బాబు చేసిన ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

Read more!
Tags:    

Similar News