• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జగన్ కు కూటమి సర్కార్ ...

జగన్ కు కూటమి సర్కార్ న్యాయం చేయాలట.. నాగబాబు వ్యంగ్యాస్త్రాలు!

| జనసేన నేత కొణిదెల నాగబాబు ‘ఎక్స్’ వేదికగా చేసే పోస్ట్ లు నెట్టింట తీవ్ర చర్చనీయాంశం అవుతుంటాయనే సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-07-29 09:22 GMT

జనసేన నేత కొణిదెల నాగబాబు ‘ఎక్స్’ వేదికగా చేసే పోస్ట్ లు నెట్టింట తీవ్ర చర్చనీయాంశం అవుతుంటాయనే సంగతి తెలిసిందే. అందులో కొన్ని ప్రజలను ఆలోచింపజేసేవిగా ఉంటే.. మరికొన్ని మాత్రం బౌన్స్ బ్యాక్ అవుతుంటాయని అంటుంటారు. ఇక ప్రధానంగా వైసీపీ మీద, జగన్ పైనా చేసే కామెంట్లు వైరల్ గా మారుతుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు నాగబాబు.

అవును... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పైనా, ఆ పార్టీ అధినేత జగన్ పైనా జనసేన నేత నాగబాబు చేసే ట్వీట్లు, కామెంట్లు, నర్మగర్భంగా పెట్టే కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతాయనే సంగతి తెలిసిందే. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త తగ్గినట్లే కనిపించినా.. ఈ మధ్య మళ్లీ మొదలుపెట్టినట్లున్నారు నాగబాబు. ఈ సందర్భంగా కోడి కత్తి కేసు ప్రస్థావన తెరపైకి తెచ్చారు నాగబాబు.

ఈ సందర్భంగా ట్వీట్ చేసిన ఆయన... జగన్ నిన్నమొన్నటివరకు ముఖ్యమంత్రిగా బిజీగా ఉండటం వల్ల ఈ కోడి కత్తి కేసుపై పూర్తిగా కాన్ సంట్రేషన్ చేయలేదన్నట్లుగా మొదలుపెట్టిన నాగబాబు... ఇప్పుడు జగన్ ఫుల్ ఫ్రీ అన్నట్లుగా వెటకారమాడారు! ఈ సందర్భంగా జగన్ కు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్, వంగలపూడి అనితలను కోరారు.

"2019కి ముందు అప్పటి ఎమ్మెల్యేగా ఉండి, తదనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మారి, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలినటువంటి జగన్ మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి" అంటూ మొదలుపెట్టిన నాగబాబు... "ఎందుకంటే.. 2019లో శ్రీను అనే వ్యక్తి ఆయనపై కోడికత్తితో దాడి చేశాడు. 5 ఏళ్లు అయినా కూడా ఆ కేసు ఇంకా కొలిక్కి రాలేదు" అందుకని అని చెప్పారు.

అయితే... "అప్పుడంటే జగన్ మోహన్ రెడ్డికున్న బిజీ షెడ్యూల్ వల్ల ఆయనకు కుదరలేదు.. కానీ, ఇప్పుడు ఆయన ఖాళీగానే ఉన్నారు. అందువల్ల కూటమి ప్రభుత్వం ఆయనకు న్యాయం చేయాల్సిన అవసరం అత్యవసరంగా ఉంది" అని చెబుతూ... "అతని మీద హత్యాయత్నం చేసిన నేరస్థుడికి సరైన శిక్ష విధించాలి కదా!" అని అన్నారు.

అందువల్ల ఆయన కోడికత్తి కేసుని తక్షణమే విచారించి, అమాయకుడైనటువంటి జగన్ ని న్యాయం చేయాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, రాష్ట్ర హోం మంత్రిని కోరుకుంటున్నట్లు నాగబాబు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. దీంతో... ప్రస్తుతం ఈ పోస్ట్ కింద కామెంట్లు హల్ చల్ చేస్తున్నాయి. నాగబాబు ర్యాగింగ్ అలా ఉందంటూ స్పందిస్తున్నారు నెటిజన్లు!

2019 కి ముందు అప్పటి ఎమ్మెల్యేగా ఉండి తదనంతరం అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మారి ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి.

ఎందుకంటే 2019 లో శ్రీను అనే వ్యక్తి ఆయన మీద కోడికత్తితో దాడి చేసాడు. 5 ఏళ్లు అయిన…

— Naga Babu Konidela (@NagaBabuOffl) July 29, 2024
Tags:    
  • Nagababu 
  • Janasena 
  • Ndaalliance 
  • Ysrcp 
  • Jaganmohanreddy 
  • Tdp 
  • Chandrababunaidu 
  • Bjp 

Similar News

భారత్ తో క్రికెట్ ఆడకపోతే దివాళా తీయాల్సిందే.. ఇంగ్లండ్ పరిస్థితి అదే..

2026-11-09 04:25 GMT

డాటర్ ఆఫ్ చింతమనేని...జెడ్పీ పీఠం కన్ఫర్మ్ ?

2026-11-09 04:03 GMT

కూటమిలో జూనియర్ గానే... బీజేపీ బలమెంత ?

2026-11-09 04:03 GMT

జగన్ పరీక్షలో పాస్....ఫెయిల్- లిస్ట్ రెడీ ?

2026-11-09 04:02 GMT

బాబు కేబినెట్ లోకి బీటెక్ రవి ?

2026-11-09 04:01 GMT

సోనియా నోట తొలిసారి సంజయ్ మాట...ఆ పుస్తకంలో ఏముంది ?

2026-11-09 03:54 GMT

దిమాగీ నక్సల్స్..బ్రహ్మ పదార్ధమా....మోడీ బ్రహ్మాస్త్రమా !

2026-11-09 03:42 GMT

గిరి'జ‌నం'లో జ‌న‌సేన‌కు ప‌ట్టెంత‌.. ?

2026-11-08 17:30 GMT

'అప్పిరెడ్డి'పై అనుమానాలు.. గుంటూరు వైసీపీలో ఏం జ‌రిగింది..?

2026-11-08 16:30 GMT

''జ‌గ‌న్ ఊరుకోరు: ఇంచార్జ్‌ల‌ను మార్చేస్తారు.. ! ''

2026-11-08 15:30 GMT

కూట‌మి గెలుపు బాగుంది.. అస‌లు స్టోరీ ఏంటంటే.. !

2026-11-08 14:30 GMT

అమెరికాలో 22 ఏళ్ల తెలంగాణ యువకుడు అనుమానాస్పద మృతి

2026-11-08 13:35 GMT

Copyright @2026

Powered by Blink CMS