• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  కూటమిలో జూనియర్ గానే......

కూటమిలో జూనియర్ గానే... బీజేపీ బలమెంత ?

| ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమితో కలిసి పోటీ చేసిన బీజేపీకి 152 మున్సిపల్ వార్డులు, 4 చైర్మన్ స్థానాలు, 19 జెడ్పీటీసీలు, 120 ఎంపీటీసీలు దక్కాయి. అయితే ఈ విజయాల్లో టీడీపీ ఓట్ల బదిలీ కీలకమైందనే చర్చ జరుగుతోంది. మరోవైపు జనసేన సొంతంగా సంస్థాగత బలాన్ని పెంచుకుంటూ మెరుగైన ఫలితాలు సాధిస్తుంటే, బీజేపీ మాత్రం కూటమిపైనే ఆధారపడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

By - Satya P
Update: 2026-11-09 04:03 GMT

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కూటమితో జట్టు కట్టి పోటీ చేసింది. రెండు మేయర్ సీట్లు ఇచ్చారు. అందులో రాజమహేంద్రవరం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఒక్క మేయర్ సీటు అనంతపురంలో అది చేజారింది. ఇపుడు చూస్తే జెడ్పీ పీఠాలలో కడపను బీజేపీకి ఇస్తారు అని అంటున్నారు. ఇక చూస్తే మొత్తం జెడ్పీటీసీలలో బీజేపీ వాటా అలాగే ఎంపీటీసీలలో కూడా బీజేపీకి దక్కినవి చూసినపుడు బీజేపీ బలం ఎంత పెరిగింది అన్న చర్చ వస్తోంది.

సొంత బలం కాదు :

పొత్తులలో ఏడు శాతం వాటాను దక్కించుకున్న బీజేపీ స్థానిక సంస్థల గెలిచిన స్థానాలు ఎన్ని అన్నది చూస్తే కనుక మునిసిపాలిటీలలో బీజేపీ గెలిచిన వార్డులు 152 దాకా ఉన్నాయి. అలాగే బీజేపీ 4 మున్సిపల్ చైర్మన్ స్థానాలను దక్కించుకుంది. పరిషత్తు ఎన్నికల్లో బీజేపీ 19 జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ ఎంపీటీసీ 120 దాకా గెలిచింది. ఇక బీజేపీ గెలిచిన స్థానిక సంస్థల సీట్లలో బలం అయితే సొంతది కాదనే అంటున్నారు. మిత్రపక్షం టీడీపీ ఓట్ల బదలాయింపు లేకపోతే కనుక బీజేపీకి ఇబ్బంది అయ్యేదని అంటున్నారు. ఇక బీజేపీకి ఎంత మద్దతు ఇచ్చినా వైసీపీ చాలా చోట్ల ఎంపీటీసీలుగెలిచింది వార్డులు గెలిచింది బీజేపీ అభ్యర్ధుల మీదనే అని అంటున్నారు.

వైసీపీకి లాభంగా :

బీజేపీకి సొంతంగా గ్రామీణ ప్రాంతాలలో కానీ అర్బన్ లో అనేక చోట్ల కానీ లేకపోవడం వల్లనే ఇలా జరిగింది అని అంటున్నారు. అనంతపురం కార్పోరేషన్ మేయర్ సీటుని కూడా వైసీపీ బీజేపీ నుంచే గెలుచుకుంది అని అంటున్నారు. అలాగే 2024లో అరకు రాజంపేట ఎంపీ సీటుని బీజేపీ నుంచే వైసీపీ గెలుచుకుంది.ఇక 2024లో 10 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే అందులో రెండు వైసీపీ గెలిచిందని అంటున్నారు. ఇలా పొత్తు పార్టీగా బీజేపీకి ఎన్ని సీట్లు ఇచ్చినా అందులో కొన్ని ఓటమి పాలు అవుతోంది అని అంటున్నారు.

జనసేన సంస్థాగతంగా బలం :

అదే జనసేనకు పొత్తులో సీట్లు ఎక్కువ ఇచ్చినా సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేటు తో గెలుస్తున్నసంగతిని కూడా గుర్తు చేస్తున్నారు. దానికి కారణం జనసేన సంస్థాగతంగా బలం పెంచుకుంటోంది. బలమైన నాయకత్వం పవన్ రూపంలో ఉంది. బీజేపీకి ఆ విధమైన పరిస్థితి లేకపోవడం వల్లనే ఎప్పటికీ జూనియర్ పార్టనర్ గా కూటమిలో ఉంటోంది అని అంటున్నారు. మరి పొత్తులతోనే బీజేపీ కాలం వెళ్లబుచ్చుకుంటోందని రెండున్నరేళ్ల కూటమి పాలనలో అధికారంలో ఉండి కూడా పార్టీని విస్తరించుకోలేకపోయిందని అంటున్నారు. ఎంపీటీసీల విషయానికి వస్తే తాజా ఎన్నికల్లో 285 కి పోటీ చేస్తే 120 దక్కాయి అని అంటున్నారు. రేపటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయాలంటే ఎక్కువ సీట్లు పొత్తులో తెచ్చుకుని గెలవాలి అన్నా కూడా ఇప్పటినుంచే పార్టీని పటిష్టం చేసుకోవాల్సి ఉందని అంటున్నారు.

Tags:    
  • bjp 
  • andhrapradeshpolitics 
  • tdp 
  • janasena 
  • localbodyelections 

Similar News

ఎలా ఓడిపోయాం.. అధ్య‌య‌నం చేయించిన జ‌గ‌న్‌!

2026-11-10 05:12 GMT

జనసేన ఎమ్మెల్యేకు మామూలుగా లేదు ట్రోలింగ్ !

2026-11-10 05:03 GMT

లాజిక్ తో కొట్టిన బాబు...కొత్త పేరు పెట్టిన జగన్ !

2026-11-10 03:49 GMT

బొత్స అనూష ఓడినా భీమిలీ ఆమెకే... ఎందుకంటే ?

2026-11-10 03:48 GMT

లోకల్ ఫైట్ : మంత్రులకు బాబు మార్కులెన్ని ?

2026-11-10 03:46 GMT

ఆ ఓటు మీ ఇష్టం.. ఇదే కూట‌మికి శాప‌మైందా.. ?

2026-11-10 01:30 GMT

ఏపీ ప‌ల్లె పోరు.. జెండాలు కాదు.. అజెండాలే కీల‌కం.. !

2026-11-10 00:30 GMT

చిత్రంగా ఉందే.. ఎలా ఓడిపోయాం: బీజేపీ అంతర్మ‌థ‌నం

2026-11-09 22:30 GMT

రెబెల్స్ ని కూటమి తలుపులు క్లోజ్... బాబు కఠిన నిర్ణయం

2026-11-09 19:19 GMT

జనసేనకే డిప్యూటీ మేయర్ పదవి ?

2026-11-09 19:18 GMT

ష‌ర్మిల‌కు ఆల్ట‌ర్నేట్‌.. కాంగ్రెస్‌లో హాట్ టాపిక్.. ?

2026-11-09 19:14 GMT

ఆమెను త‌ట్టుకోలేమ‌బ్బా.. చెవిరెడ్డికి సుధ సంక‌టం.. !

2026-11-09 19:13 GMT

Copyright @2026

Powered by Blink CMS