• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  లోకల్ ఫైట్ : మంత్రులకు...

లోకల్ ఫైట్ : మంత్రులకు బాబు మార్కులెన్ని ?

| ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నవంబర్ 10న ఉదయం 10.30 గంటలకు వెలగపూడి సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. విశాఖలో నవంబర్ 12, 13 తేదీల్లో జరిగే పార్టనర్‌షిప్ సమ్మిట్, పెట్టుబడుల ఆకర్షణపై చర్చించనున్నారు. అధికారిక ఎజెండా తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, మంత్రుల పనితీరుపై సమీక్ష నిర్వహించి, కొందరిని అభినందించడంతో పాటు మరికొందరికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.

By - Satya P
Update: 2026-11-10 03:46 GMT

ఏపీలో మున్సిపల్ పరిషత్తు ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫలితాలు కూడా కూటమిని అనుకూలంగా వచ్చాయి. ఒక విధంగా కూటమి స్వీప్ చేసి పారేసింది. ఈ నేపధ్యంలో ఏపీలో కూటమి ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా తమ పరిధిలో గట్టిగానే పనిచేశారు. ఈ పరిస్థితులలో లోకల్ ఫైట్ తర్వాత తొలిసారి ఏపీ కేబినెట్ మీటింగ్ నవంబర్ 10న మంగళవారం జరగబోతోంది. దీంతో చంద్రబాబు తన కేబినెట్ మంత్రివర్గ సహచరులతో స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఫలితాల గురించి మంత్రుల పనితీరు గురించి చర్చిస్తారు అని అంటున్నారు.

కీలక అంశాలతోనేనే :

ఇక ఏపీ కేబినెట్ భేటీ చంద్రబాబు అధ్యక్షతన నవంబర్ 10వ తేదీ ఉదయం పదిన్నర గంటలకు వెలగపూడి సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో విశాఖపట్నంలో ఈ నెల 12, 13 తేదీలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్టనర్‌షిప్ సమ్మిట్‌ను విజయవంతం చేసే విషయం మీద చర్చిస్తారు అని అంటున్నారు. అదే విధంగా ఈ సమ్మిట్ సక్సెస్ కోసం మంత్రులకు చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించనున్నారని అంటున్నారు. సదస్సు నిర్వహణ, పెట్టుబడుల ఆకర్షణ, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయం వంటి అంశాలపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. అలాగే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ప్రతిపాదనలకు ఈ కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలపనున్నారని అంటున్నారు.

ఎవరికి అభినందనలు :

ఇక కేబినెట్ అధికారిక ఎజెండా ముగిసిన తరువాత మంత్రులతో ఏపీలో రాజకీయాల మీద స్థానిక స్థానిక సంస్థల ఎన్నికల మీద చంద్రబాబు సమీక్ష చేస్తారు అని అంటున్నారు. గత కొద్దిరోజులుగా మంత్రుల పనితీరును గమనిస్తున్న ముఖ్యమంత్రి, యాక్టివ్‌గా పనిచేస్తున్న కొందరిని అభినందిస్తూనే తాను ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచని మంత్రులకు దిశానిర్దేశం చేస్తూ బాబు క్లాస్ తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఎవరికి ర్యాంకులు :

ఈసారి మంత్రుల పనితీరుతో పాటు ఎన్నికల్లో ఫలితాలను కూడా బేరీజు వేస్తారు అని అంటున్నారు. చాలా మంది మంత్రులు తమ జిల్లాలలో బాగానే కష్టపడ్డారు. అనేక చోట్ల కూటమి స్వీప్ చేయడానికి వారు దోహదపడ్డారు. అయితే ఇంకా కష్టపడితే వైసీపీకి మరింతగా సీట్లు తగ్గే చాన్స్ ఉందన్నది కూటమి పెద్దల భావనగా ఉంది. మొత్తం మీద కంగ్రాట్స్ బాబు ఎవరికి చెబుతారు, ఎవరికి క్లాస్ తీసుకుంటారు అన్నది అయితే చూడాల్సి ఉంది. అలాగే ర్యాంకులు ఇస్తారా అన్నది కూడా మరో ఆసక్తిని కలిగించే విషయంగా ఉంది.

Tags:    
  • chandrababu 
  • apcabinetmeeting 
  • apministers 
  • andhrapradesh 
  • localbodyelections 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS