• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  Eluru >  డాటర్ ఆఫ్...

డాటర్ ఆఫ్ చింతమనేని...జెడ్పీ పీఠం కన్ఫర్మ్ ?

| ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె సాయి నవ్యశ్రీ పెదవేగి జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆమె పేరు చైర్ పర్సన్ పదవికి వినిపిస్తోంది. అయితే చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి కుమార్తె మందలపు జాహ్నవి కూడా ఈ పదవిని ఆశిస్తుండటంతో ఇద్దరు రాజకీయ వారసురాళ్ల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.

By - Satya P
Update: 2026-11-09 04:03 GMT

ఏలూరు జిల్లా రాజకీయాల్లో టీడీపీ రాజకీయాల్లో కూడా చూస్తే ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసుకున్న వారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఆయన టీడీపీలో సీనియర్ నేత. పలు మార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారుగా ఉన్నారు. ఇక తాజాగా చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభాకర్ కుమార్తె చింతమనేని సాయి నవ్యశ్రీ సడెన్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. పెదవేగి జెడ్పీటీసీగా చింతమనేని సాయి నవ్యశ్రీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ఆమె పేరు చాలా గట్టిగానే వినిపిస్తోంది. చింతమనేని కుమార్తె పోటీ చేసిన చోట ప్రత్యర్ధులు చివరి నిముషంలో తప్పుకున్నారు. దాంతో ఆమె ఏకగ్రీవంగా నెగ్గారు. ఇప్పుడు ఆమె నేరుగా జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ సీటు కోసమే గురి పెట్టారు అని అంటున్నారు.

మంత్రి పదవి దక్కక :

ఇక చింతమనేని ప్రభాకర్ విషయం చూస్తే ఆయన సీనియర్ నేత అయినప్పటికీ మంత్రి పదవి అయితే దక్కడం లేదు, దానికి సామాజిక సమీకరణలే కారణం అని అంటున్నారు. దాంతో ఇపుడు ఆయన కుమార్తెకు కీలకమైన పదవి కట్టబెట్టడం ద్వారా న్యాయం చేస్తారు అని చర్చ సాగుతోంది. చింతమనేని కూడా వ్యూహాత్మకంగానే తన కుమార్తెని బరిలోకి దింపారు అని అంటున్నారు. కేవలం జెడ్పీటీసీ గా అయితే ఆమె రంగంలోకి దిగడం అన్నది కుదరదని అంటున్నారు. వెనక బలమైన భరోసా ఉండడం వల్లనే ఆమెకు చైర్ పర్సన్ గా అయ్యేందుకు చాన్స్ ఎక్కువగా ఉంది అని అంటున్నారు.

గట్టి పోటీ ఉంది :

అయితే ఇదే పదవికి మరో సీనియర్ నేత చింతలపూడి మాజీ ఎమ్మెల్యే అయిన గంటా మురళి కుమార్తె మందలపు జాహ్నవి నుంచి గట్టి పోటీ ఉందని అంటున్నారు. ఆమె కూడా ఇదే పదవి మీద ఆశ పెట్టుకున్నారని అంటున్నారు. గంటా మురళి అయితే తన కుమార్తెని జెడ్పీ చైర్మన్ పీఠం మీద కూర్చోబెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. దాంతో ఒక్కటే పదవి ఇద్దరు సీనియర్ నేతల రాజకీయ వారసురాళ్ళ మధ్యలో పోటా పోటీతో ఏలూరు రాజకీయ వర్గాలలో ప్రస్తుతం ఇది అతి పెద్ద చర్చగా సాగుతోంది.

జిల్లా రాజకీయాల్లోనే :

ఇక చింతమనేని ప్రభాకర్ విషయం తీసుకుంటే ఆయన పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లోనే తన బ్రాండ్ ని చూపిస్తూ వచ్చారు. ఇపుడు ఏలూరు కొత్త జిల్లాగా ఉంది. దాంతో ఆయన మరింత పట్టు సాధించారు అని అంటున్నారు. ఈ క్రమంలో ఆయన తన కుటుంబానికి రాజకీయంగా ప్రాధాన్యత కల్పించే విషయంలో పావులు కదుపుతున్నారని అంటున్నారు. హైకమాండ్ కూడా సీనియర్ నేతగా చింతమనేని వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే కనుక జరిగితే ఫైర్ బ్రాండ్ చింతమనేని కుమార్తె కొత్త చైర్ పర్సన్ అవడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    
  • chintamaneniprabhakar 
  • sainavyasri 
  • tdp 
  • elurupolitics 
  • andhrapolitics 

Similar News

కోర్టు ధిక్కారణ కేసు.. అనాథలకు సేవ చేయడమే శిక్ష

2026-09-24 13:30 GMT

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం హఠాన్మరణం.. విషాదంలో టీడీపీ నేతలు

2026-09-15 10:33 GMT

దెందులూరులో ఎమ్మెల్యే చింతమనేని రచ్చ.. సొంత పార్టీ నేతపై అర్ధరాత్రి దండయాత్ర

2026-06-15 05:44 GMT

‘‘మంచోడు మహేశ్’’ ఏలూరు ఎంపీకి తండ్రి సర్టిఫికెట్!

2026-03-23 10:58 GMT

పుట్టా విష‌యంలో బాబు ఆ ప‌ని చేస్తారా...?

2026-03-21 08:30 GMT

ఇక సెలవు.. కావూరి స్వీయ ప్రకటన, వీడిన సందిగ్ధం

2026-03-11 07:48 GMT

వెంటిలేటర్ పై మాజీ మంత్రి కావూరి.. అత్యంత విషమంగా ఆరోగ్యం

2026-03-10 04:57 GMT

ఏపీలో మరీ ఇంత దారుణమా? నలుగురు మహిళలపై గొడ్డలితో దాడి

2026-01-21 07:08 GMT

మాజీ ఉప ముఖ్యమంత్రి....శాసించిన చోట మౌనంగా !

2025-09-24 04:15 GMT

వైసీపీ మాజీ ఎమ్మెల్యే సోద‌రుల అరెస్టు: దెందులూరులో హైటెన్ష‌న్

2025-07-26 04:50 GMT

భార్యకు మేసేజ్ లు పంపాడని కుడి చేతిని నరికేశారు

2025-02-18 06:30 GMT

Copyright @2026

Powered by Blink CMS