నాగబాబుని గుర్తు పట్టని మోడీ
ఆయన మోడీకి స్వాగతం పలికేందుకు జనసేన తరఫున ఉన్నారు. అయితే ఆయన పక్కన బీజేపీకి చెందిన మాజీ ఏపీ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఉన్నారు.;
మెగా బ్రదర్ గా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే ఎమ్మెల్సీగా నెగ్గి చట్టసభలో అడుగుపెట్టిన ప్రజా ప్రతినిధిగా నాగబాబు ఉన్నారు. అయితే ఆయన రాజకీయంగా చూస్తే ఇంకా వర్ధమాన దశలోనే ఉన్నారని అంటారు. నాగబాబు గురించి రాజకీయంగా ఇంకా ఎవరికీ పెద్దగా తెలియదు అని అనుకున్న వారూ ఉన్నారు.
ఇవన్నీ పక్కన పెడితే నాగబాబు ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటనకు వచ్చిన సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో అతిధులతో కరచాలనం చేస్తూ ముందుకు సాగినపుడు అక్కడ ఎమ్మెల్సీగా తాను కూడా కనిపించారు.
ఆయన మోడీకి స్వాగతం పలికేందుకు జనసేన తరఫున ఉన్నారు. అయితే ఆయన పక్కన బీజేపీకి చెందిన మాజీ ఏపీ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఉన్నారు. ఆయన దాకా వచ్చి పలకరించిన మోడీ నాగబాబు నుంచి అభివాదాలు తీసుకుంటూనే అలా ఆలోచనలో పడ్డారు. ఆయన నాగబాబును గుర్తు పట్టలేదని అక్కడ ఉన్న వారు అనుకున్నారని చెబుతున్నారు.
మరి జనసేన అధినేత పవన్ తో ఎంతో ఆత్మీయ అనుబంధం కొనసాగించే నరేంద్ర మోడీ ఆయన సోదరుడు అయిన నాగబాబుని గుర్తు పట్టలేదా అన్న చర్చ సాగుతోంది. అయితే నాగబాబుని గుర్తుపట్టక పోవడంలో వింత కూడా ఏమీ లేదని అంటున్నారు. ఆయన ఇంకా ఫుల్ టైం పొలిటీషియన్ గా ఎస్టాబ్లిష్ కాలేదు కదా అని అంటున్నారు.
నాగబాబు ఇపుడే ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన భవిష్యత్తులో మరింతగా ముందుకు వచ్చి రాజకీయంగా తన సత్తా చాటుకుని తనేంటే రుజువు చేసుకుంటే అపుడు మీడియాలో ఎక్కువగా మెరుస్తారు ఆ మీదట ఆయనను కేంద్ర పెద్దలు ప్రముఖులు కూడా ఇలా చూడగానే అలా గుర్తించే విధంగా ఉంటుందని అంటున్నారు.
అయితే జనసేనలో మాత్రం నాగబాబు స్థానం అలా అంతకంతకు పెరుగుతోంది. ఆయనను ప్రధానికి స్వాగతం పలికేందుకు పంపించడమే ఇందుకు తార్కాణం అని అంటున్నారు. ఇక ప్రధాని రిసీవ్ చేసుకున్న వారిని అందరినీ పేరు పేరునా పలకరించారు. అంతే కాదు వారి గురించి ఆయనకు తెలిసిన విషయాలు కూడా పంచుకున్నారు.
అంతే కాకుండా వారి యోగ క్షేమాలు కూడా ప్రస్తావించారు. మరి నాగబాబు వద్దకు వచ్చేసరికి మాత్రం ఆయన గుర్తు పట్టలేదని ఒక వార్త పుకారుగా షికారు చేస్తోంది. జనసేన అధినేతకు ఆయన మెగా బ్రదర్ అని తెలిసి ఉంటే మోడీ నుంచి రియాక్షన్ వేరే విధంగా ఉండేదని అంటున్నారు.
ఏది ఏమైనా ఈ గాసిప్ ని చూస్తూంటే నాగబాబు రాజకీయంగా ఇంకా దూకుడు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. రాజకీయాల్లో గుర్తింపు సాధించడం చాలా కష్టమైనదే. అకేషనల్ గా సీజనల్ గా పాలిటిక్స్ చేసేవారికి కూడా అది ఇబ్బందే అంటున్నారు. నిత్యం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ ప్రజలతో మమేకం అయిన వారికే జనాదరణతో పాటు దేశాధినేతల వద్ద కూడా మంచి గుర్తింపు ఉంటుందని చెబుతున్నారు.
ఆరున్నర పదుల వయసులో ఉన్న నాగబాబు రాజకీయంగా ఇంకా వర్ధమానుడు. అయినా సరే ఆయన తన పూర్తి సమయాన్ని రాజకీయాలకు వినియోగించి ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ఎప్పటికప్పుడు జనంలో మీడియాలో కనుక ఉంటే కనుక ఈయనా ఓహో అని అంతా అనుకునే పరిస్థితి ఉంటుంది. సో నాగబాబు అయితే చాలా అడుగులు ముందుకు వేయాల్సి ఉంది. అంతే కాదు పెద్దలు వచ్చినపుడు తరచూ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళడం ఢిల్లీ టూర్స్ పెట్టుకోవడం అక్కడ మీడియా మీటింగ్స్ నిర్వహించడం వంటికి చేయాల్సి ఉంది అంటున్నారు.