ముద్రగడకు కీలక పదవి ఇచ్చిన జగన్!

ఇక పోతే పీఏసీని 33 మందితో ఏర్పాటు చేశారు. ఇందులో రీజనల్ కో ఆర్డినేటర్లు శాశ్వత ఆహ్నానితులుగా ఉంటారు వారిని కూడా కలుపుకుంటే ఆ నంబర్ పెద్దదే అవుతుంది.;

Update: 2025-04-12 17:32 GMT

ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మనాభరెడ్డికి వైసీపీలో కీలక పదవి దక్కింది. పార్టీ అధినేత జగన్ ఆయనకు అతి ముఖ్యమైన పదవిని కట్టబెట్టారు. టీడీపీకి పొలిట్ బ్యూరో మాదిరిగా వైసీపీకి అత్యున్నత విధాన నిర్ణయ కమిటీగా పొలిటికల్ అడ్వైజర్ కమిటీ ఉంటుంది. దానిని షార్ట్ కట్ లో పీఏసీ గా పిలుస్తారు.

తాజాగా వైసీపీ పీఏసీని పునర్వ్యవస్థీకరించారు. అందులో ముద్రగడ పద్మనాభానికి చోటు కల్పించారు. ముద్రగడ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి రాజకీయ సంచలనం సృష్టించారు. ఆయన పిఠాపురంలో పవన్ ఓటమి మీద పందెం కట్టి ఆఖరుకు తన పేరుని పద్మనాభరెడ్డి గా మార్చుకున్నారు.

ఆయన కుమార్తె జనసేనలో ఉంటే ముద్రగడ వైసీపీలో కొనసాగుతున్నారు. అయితే ఆయన వైసీపీ తరఫున అయితే అంత యాక్టివ్ గా లేరు అని ఒక వైపు ప్రచారం సాగుతూంటే మరో వైపు ఆయన సరైన సమయంలో రంగంలోకి దిగుతారు అని అంటున్నారు.

ఆయన కుమారుడికి వైసీపీలో కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జి పదవిని ఇచ్చారు అని కూడా చెప్పుకున్నారు. ఇపుడు ముద్రగడకు పీఏసీ మెంబర్ గా ప్రాధాన్యత కల్పించారు. దాంతో ముద్రగడ ఇక మీదట ఆ హోదాలో పార్టీ తరఫున మాట్లాడుతారు అన్న మాట.

ఇక పోతే పీఏసీని 33 మందితో ఏర్పాటు చేశారు. ఇందులో రీజనల్ కో ఆర్డినేటర్లు శాశ్వత ఆహ్నానితులుగా ఉంటారు వారిని కూడా కలుపుకుంటే ఆ నంబర్ పెద్దదే అవుతుంది. అయితే పీఏసీ మీటింగ్స్ వైసీపీలో గతంలో పెద్దగా జరిగినవి అయితే లేవు. పార్టీలో ఏదైనా అధినాయకత్వం నిర్ణయం తీసుకోవడం అమలు చేయడమే కనిపిస్తోంది అని అంటూంటారు.

కానీ ఒక రాజకీయ పార్టీ అన్నాక దానికి అన్ని అంగాలు ఉండాలి కాబట్టి పీఏసీ ఏర్పాటు చేసారు అని అంటున్నారు. ముద్రగడకు పదవి దక్కింది. మరి ఆయన రానున్న రోజులలో వైసీపీ తరఫున బిగ్ సౌండ్ చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. నాకు ఎందుకొచ్చిన రాజకీయం అని ఆయన వైరాగ్యం ప్రకటిస్తే కనుక గోదావరి జిల్లాలలో ఫ్యాన్ స్పీడ్ వేరేగా ఉంటుందని అంటున్నారు.

ఏది ఏమైనా వైసీపీ అధినాయకత్వం ఏర్చి కూర్చిన పీఏసీలో సీనియర్లకు చోటు దక్కింది. పార్టీ పదవులు అయితే అందరికీ దక్కుతున్నాయి. మరి పార్టీ పటిష్టత ఏ మేరకు సాగుతోంది అన్నది కూడా చర్చగానే ఉంది. చూడాలి మరి కొత్త పదవులతో ఏమి చేస్తారో ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News