జగన్ కి పద్మనాభరెడ్డి ఆత్మీయ లేఖ
ఇక ఆయన తాజాగా జగన్ కి తాజాగా లేఖ రాసారు. ఆ లేఖ మొత్తం జగన్ మీద ప్రేమ ఆత్మీయత ఉంది. తనకు వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీలో స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.;
ఎవరీ పద్మనాభరెడ్డి. జగన్ కి ఆయనకు ఏమిటి అనుబంధం. ఎందుకీ ఆత్మీయ లేఖ అన్న డౌట్ ఠక్కున ఎవరైనా రావచ్చు. పద్మనాభరెడ్డి దశాబ్దాలుగా ఏపీలో రాజకీయం గురించి తెలిసిన వారికి పరిచయం ఉన్న వారే. అలాగే ఆయనకు జగన్ కి అనుబంధం పెనవేసిన పార్టీగా వైసీపీ ఉంది. మరి ఆయన పూర్తి పేరు చెబితే అందరికీ ఎరుక అవుతుంది. ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డి. వెనకటి పేరు ముద్రగడ పద్మనాభం.
ఈ రోజుకీ అంతా అలాగే పిలుస్తారు. కానీ పవన్ మీద పిఠాపురంలో పందెం కట్టిన ఆయన తన పేరుని పంతం కొద్దీ మార్చుకున్నారు. అలా గెజిట్ నోటిఫికేషన్ లో కూడా ప్రకటించారు. దాంతో ఎవరు ఆయనను పద్మనాభంగా పిలిచినా ఆయన మాత్రం తన లెటర్ ప్యాడ్ మీద కానీ తన సంతకం కానీ పద్మనాభరెడ్డి గానే పేర్కొంటూ ఉంటారు.
ఇక ఆయన తాజాగా జగన్ కి తాజాగా లేఖ రాసారు. ఆ లేఖ మొత్తం జగన్ మీద ప్రేమ ఆత్మీయత ఉంది. తనకు వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీలో స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తనకు ప్రేమతో ఈ పదవి ఇచ్చారాని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఇక తన మీద బాధ్యతలు పెట్టినందుకు ఆయన స్వాగతిస్తూనే జగన్ ని అధికారంలోకి తిరిగి తెచ్చేలా తన శక్తివంచన లేకుండా కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు. ఇక జగన్ ఒక్కరే పేదలకు ఆక్సిజన్ లాంటి వారు అని అన్నారు. అంతే కాదు వైసీపీ 2029లో అధికారంలోకి తప్పకుండా వస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. వైసీపీ పవర్ లోకి వచ్చాక సీఎం పీఠం మీద ఎవరూ తొంగి చూడకుండా చిరకాలం జగన్ పాలించాలని ఆ విధంగా ఆయన పాలన ఉండాలని పద్మనాభరెడ్డి మనసారా కోరుకున్నారు.
ఇదిలా ఉంటే ఏపీలో కూటమి పాలనలో పేదలకు న్యాయం జరగడంలేదనే పరోక్ష విమర్శ కూడా ఆయన లేఖలో ఉందని అంటున్నారు. జగన్ పేదలకు ఆక్సిజన్ అంటే ఇతర పార్టీలు కాదనే అర్థం కదా అని అంటున్నారు. మరో వైపు చూస్తే జగన్ సీఎం సీటు ఎక్కాక మరొకరు ఆ వైపు చూడకూడదని ఆయన కోరుకుంటున్నారు.
ఏపీలో చూస్తే వెయిటింగ్ చీఫ్ మినిస్టర్లుగా ఇద్దరు కనిపిస్తారు. ఒకరు నారా లోకేష్. మరొకరు పవన్ కళ్యాణ్. పైగా పవన్ ముద్రగడ సామాజిక వర్గానికి చెందిన వారే. ఇక ఆ సామాజిక వర్గం నుంచి ఇప్పటిదాకా ఎవరూ సీఎం కాలేదు. కానీ ముద్రగడ మాత్రం జగన్ ఎప్పటికీ సీఎం కావాలని కోరుతున్నారు.
మొత్తానికి చూస్తే జగన్ పట్ల అదే ప్రేమ ఆత్మీయత చూపిస్తున్న పద్మనాభం అలియాస్ పద్మనాభరెడ్డి గోదావరి జిల్లాలలో జనసేన తాకిడిని తట్టుకుని వైసీపీని 2029 ఎన్నికల నాటికి అక్కడ బలోపేతం చేస్తారా అన్నదే అంతా చర్చిస్తున్నారు. అయితే రాజకీయ గాలి మారిన నాడు ముద్రగడ కూడా తన అసలు పవర్ ఏంటో చూపిస్తారు అంటున్నారు.