'పోలీసులు అత్యాచారాలను అరికట్టడం'పై డీజీపీ కీలక వ్యాఖ్యలు!

అవును... ఇటీవల కాలంలో లైంగిక వేదింపులు, అత్యాచారాలు వంటి ఘటనలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో... మధ్యప్రదేశ్ డీజీపీ కీలక వ్యాఖ్యలు చేశారు.;

Update: 2025-06-30 08:30 GMT
పోలీసులు అత్యాచారాలను అరికట్టడంపై డీజీపీ కీలక వ్యాఖ్యలు!

ఇటీవల కాలంలో అత్యాచారాలు గతంతో పోలిస్తే విపరీతంగా పెరుగుతున్నాయని నివేదికలు చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే.. మరి పోలీసులు ఏమి చేస్తున్నారు అనే ప్రశ్నలు తదనుగుణంగా ఎదురవుతుంటాయి! ఈ సమయంలో స్పందించిన మధ్యప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) కైలాష్ మక్వానా కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో వచ్చిన మార్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... ఇటీవల కాలంలో లైంగిక వేదింపులు, అత్యాచారాలు వంటి ఘటనలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో... మధ్యప్రదేశ్ డీజీపీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ ద్వారా అశ్లీలత విపరీతంగా అందుబాటులో ఉండటం వల్ల సమాజం నైతికంగా దిగజారిపోయిందని.. అందువల్ల పోలీసులు మాత్రమే అత్యాచార సంఘటనలను అరికట్టలేరని అన్నారు.

తాజాగా జరిగిన సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడిన డీజీపీ కైలాష్... ఇంటర్నెట్‌ లో అశ్లీలత అందుబాటులో ఉన్న విధానం వల్ల పిల్లల మనస్సులు వక్రీకరించబడుతున్నాయని అన్నారు. ఇటీవల కాలంలో పెరుగుతున్న అత్యాచార సంఘటనల వెనుక.. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు, అందుబాటులో ఉన్న అశ్లీలత, మద్యం ప్రధాన కారణాలుగా ఉన్నాయని తెలిపారు.

ఈ రోజుల్లో చేతిలో ఉన్న సెల్ ఫోన్ల ద్వారా.. ఎవరో ఎక్కడి నుంచో మరొకరికి కనెక్ట్ అవుతున్నారని.. సమాజంలో నైతికత క్షీణించడానికి ఇలాంటి అనేక కారణాలు ఉన్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు మాత్రమే దీనిని ఎదుర్కోవడం సాధ్యం కాదని ఆయన నొక్కి చెప్పారు. పైగా... గతంలో పిల్లలు టీచర్లు, కుటుంబ సభ్యుల మాట వినేవారు కానీ.. నేడు ఇంట్లో ఒకరినొకరు చూసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా... ఇంటర్నెట్‌ లో అందుబాటులో ఉన్న అశ్లీల కంటెంట్‌ ఖచ్చితంగా పిల్లల మనస్సులను వక్రీకరిస్తోందని. అందుకే ఈ సంఘటనలు జరుగుతున్నాయని డీజీపీ పునరుద్ఘాటించారు. కాగా... రాష్ట్ర హోం శాఖ అందుబాటులో ఉంచిన గణాంకాల ప్రకారం.. 2020లో 6134 అత్యాచార కేసులు నమోదవ్వగా.. ఇది 2024లో 19% పెరిగి.. 7294కి చేరుకోవడం గమనార్హం!

Tags:    

Similar News