వామ్మో.. 29 కోట్లు పలికిన చేప.. అంత ప్రత్యేకత ఏంటో?
ఈ క్రమంలోనే ఒక చేప ఏకంగా రూ.29 కోట్లు పలికి ప్రపంచంలోనే అత్యంత ధర కలిగిన చేపగా రికార్డు సృష్టించింది. దీని పేరు బ్లూ ఫిల్మ్ టూనా..;
చేపలు.. చిన్న, పెద్ద వయసుతో సంబంధం లేకుండా ముఖ్యమైన పోషక విలువలను అందిస్తూ.. ఆరోగ్యాన్ని కాపాడడంలో ముందుండే ఈ చేపలను ఎవరు మాత్రం ఇష్టపడకుండా ఉంటారు. ప్రతి ఒక్కరికి ఫేవరెట్ నాన్ వెజ్ ఐటమ్ గా నిలిచిన ఈ చేపలు అప్పుడప్పుడు అత్యంత అధిక ధరలు పలుకుతూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని చేపలు తినడానికి ఎంత రుచికరంగా ఉంటాయో.. మరికొన్ని చేపలు వేలం పాటలో ఏకంగా కోట్లు పలుకుతూ రికార్డులు సృష్టిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఒక చేప ఏకంగా రూ.29 కోట్లు పలికి ప్రపంచంలోనే అత్యంత ధర కలిగిన చేపగా రికార్డు సృష్టించింది. దీని పేరు బ్లూ ఫిల్మ్ టూనా.. మనం మన జీవితంలో ఎన్ని రకాల చేపలు తిన్నా కూడా ఈ చేపను మాత్రం తినలేము.ఇది ధర ఎక్కువే కాదు అరుదైన చేప కూడా. ఈ చేపను చూస్తే చాలు అనుకునే వాళ్ళు కూడా కోకొల్లలు. మరి ఈ జాతి చేపలు అంతరించబోతున్న నేపథ్యంలోనే వీటికి అంత డిమాండ్ ఉంది.
ఇదిలా ఉండగా జపాన్ సముద్ర జలాలలో ఎక్కువగా దొరికే ఈ బ్లూ ఫిలిం టూనా చేప.. 2019లో ఏకంగా 278 కిలోల బరువుతో గాలానికి పడింది. అయితే అప్పట్లో వేలంలో అది 2.5 మిలియన్ ఫౌండ్లకు అమ్మేయడం జరిగింది. అయితే ఇప్పుడు మరోసారి 243 కిలోలు ఉన్న బ్లూ ఫిల్మ్ టూనా చేప లభించింది. ఈ చేపకు మార్కెట్లో వేలంపాట నిర్వహించగా ఈ పాటలో కియోమురా సంస్థ అధ్యక్షుడు కియోషి కుముర పాల్గొని వేలం పాటలో ఈ చేపను 3.24 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నారు.అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దీని ధర అక్షరాల 29 కోట్లు..
కియోషి కుముర జపాన్ లో సుషి జాన్ మై పేరిట గొలుసుకట్టు సుషి రెస్టారెంట్లను నిర్వహిస్తున్నారు. ఈ వేలంలో చేపకు భారీ ధర చెల్లిస్తే వాళ్ల కంపెనీ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతుంది అనే ఉద్దేశంతోనే ఈ చేపను కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతేకాదు జపాన్ సాంప్రదాయం ప్రకారం కొత్త ఏడాది ప్రారంభంలో మొదటి వేలంలో సొంతం చేసుకున్న ఈ చేప అదృష్టం తెస్తుందని అక్కడి వారి ప్రగాఢ నమ్మకం. పైగా సముద్రంలో దొరికే చేపలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ చల్లని నీటి వల్ల చేపల్లో కొవ్వు శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ చేప రుచి అత్యద్భుతంగా ఉంటుంది.
అయితే ఈ చేపను భారీ ధరకు కొనుగోలు చేసినప్పటికీ కస్టమర్లకు మాత్రం సాధారణ ధరలకే అమ్ముతారు. కానీ ఈ ధరలు కంపెనీ వ్యాపారానికి మాత్రం గొప్ప ప్రచారంగా మారుతున్నాయి అనడంలో సందేహం లేదు. ఇకపోతే సాధారణంగా 200 నుండి 300 కిలోల బరువు పెరిగే ఈ చేపలు చూస్తే చాలు అనుకునే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ చేపకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.