మెరుపులే మెరుపులు.. ఇతని కన్ను చూస్తే షాకవుతారు!

మీరు చాలా బంగారు దంతాలను చూసి ఉంటారు. సినిమాల్లో తరచుగా బంగారంతో చేసిన దంతాలు ఉన్న పాత్రలు కనిపిస్తాయి.;

Update: 2025-11-02 14:30 GMT

మీరు చాలా బంగారు దంతాలను చూసి ఉంటారు. సినిమాల్లో తరచుగా బంగారంతో చేసిన దంతాలు ఉన్న పాత్రలు కనిపిస్తాయి. ఇదే క్రమంలో... నిజ జీవితంలోనూ బంగారు దంతాలు కలిగి ఉన్న చాలా మంది ధనవంతులు ఉన్నారు. అయితే, ఇక్కడ ఒక వ్యక్తి బంగారు దంతాల కంటే ఒక అడుగు ముందుకు వేశాడు. ఇందులో భాగంగా... అతని కంటిలో 2 క్యారెట్ల వజ్రం పొదగబడి ఉంది.

అవును... అలబామాకు చెందిన స్లేటర్ జోన్స్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కృత్రిమ కన్ను కలిగి ఉన్నాడు. ఇందులో భాగంగా... జోన్స్ ఒక నగల దుకాణం కలిగి ఉన్నాడు. అతని కృత్రిమ కంటిలో 2 క్యారెట్ల వజ్రం పొందుపరచబడింది. తన కుడి కన్ను పూర్తిగా కోల్పోయిన తర్వాత, ఈ తన కొత్త కృత్రిమ కంటికి వజ్రం అమర్చాలని నిర్ణయించుకున్నాడు.

ఈ నేపథ్యంలో... తీవ్ర అనారోగ్యం కారణంగా కుడి కన్ను కోల్పోయిన ఆ నగల దుకాణం యజమాని కృత్రిమ కంటి ఇంప్లాంట్లలో నిపుణుడైన జాన్ లిమ్‌ ను సంప్రదించాడు. దీంతో ఆ వజ్రం అతని నల్ల గుడ్డు స్థానంలో అమర్చబడింది. జోన్స్ కంటిలోని వజ్రం మెరుస్తుంది. ఈ వజ్ర కన్ను జోన్స్ ఎక్కడికి వెళ్ళినా చర్చనీయాంశంగా మారుతుంది.

ఈ సందర్భంగా స్పందించిన జోన్స్.. "నేను నా నిజమైన కన్నును కోల్పోయాను, కానీ అది నా జీవితంలోకి కొత్త వెలుగును తెచ్చింది" అని అన్నారు. ఇదే సమయంలో స్పందించిన జాన్ లిమ్.. "ఆరు వారాల శిశువుల నుండి 100 ఏళ్లు పైబడిన వారి వరకు నేను దాదాపు 10,000 కృత్రిమ కళ్లను తయారు చేసాను, కానీ ఇది అత్యంత ఖరీదైన కృత్రిమ కన్ను" అని అన్నారు.

ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. ఈ సందర్భంగా జోన్స్ క్రియేటివిటీని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇదే సమయంలో బయటకు వెళ్లినప్పుడు అతని భద్రత గురించి అలర్ట్ చేస్తున్నారు.



Tags:    

Similar News