కాకినాడ గడప వద్ద మొంథా....పవన్ దిశా నిర్దేశం

ఇదిలా ఉండగా మొంథా తుపాను కాకినాడ గడప వద్ద తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది దాంతో అక్కడ అధికార యంత్రాగం ఫుల్ ఫోకస్ తో పనిచేస్తోంది.;

Update: 2025-10-27 18:03 GMT

ఏపీ మీద పగ పట్టినట్లుగా దూసుకుని వస్తున్న మొంథా తుపాను ఏకంగా మూడు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలను కురిపిస్తోంది. మొంథా తుపాను ప్రభావంతో శనివారం నుంచే దక్షిణ కోస్తా జిల్లాలు భారీ వర్షాలతో తడిసి ముద్దయి పోయాయి. సోమవారంతో ఏపీ మొత్తం మీద పూర్తి ప్రభావం చూపించింది మొంథా తుపాను. దాంతో ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఈ ప్రభావాన్ని వీలైనంతవరకూ నియంత్రించి ప్రజలను ఆదుకునేందుకు యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసుకుంది

కాకినాడ ఫుల్ అలెర్ట్ :

ఇదిలా ఉండగా మొంథా తుపాను కాకినాడ గడప వద్ద తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది దాంతో అక్కడ అధికార యంత్రాగం ఫుల్ ఫోకస్ తో పనిచేస్తోంది. మరో వైపు చూస్తే మొంథా తుపాను కాకి నాడ ప్రాంతంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలనిఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా పరిధిలోని 12 మండలాల పరిధిలో తుపాను ప్రభావం ఉండనుంది. ఈ నేపధ్యంలో మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మొత్తం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. అంతకాకుండా ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రభావిత ప్రాంతాల ప్రజలను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించాలని కోరారు.

అప్రమత్తం అంటున్న పవన్ :

ఇక చూస్తే కనుక మరీ ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, వృద్ధులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. మొంథా తుపాను ప్రభావం కాకినాడ జిల్లా పరిధిలోని 12 మండలాలపై ఉండనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికల ద్వారా తెలుస్తోందని పవన్ చెబుతూ అధికారులను అప్రమత్తం చేశారు. మొంథా తుపాను మంగళ వారం రాత్రికి కాకినాడ పరిసరాల్లోనే తీరం దాటే అవకాశం ఉందని పవన్ చెప్పారు. తుపాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తుపానును ఎదుర్కొనేందుకు ప్రభావిత మండలాల పరిధిలో యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో ఉండాలని ఆయన కోరరు. అలాగే ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ముందుగా తీర ప్రాంత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

ఆ సమయంలోనే :

ఏ తుఫాన్ అయినా తీరం దాటిన తరువాత నెమ్మదిగా బలహీనపడుతుంది. అయితే తీరం దాటే సమయంలోనే చాలా బీభత్సంగా ఉంటుంది. అందువల్ల ఆ సమయంలోనే అన్ని రకాలైన జాగ్రత్తలతో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలి. మొంథా తుపాను విషయానికి వస్తే కాకినాడ తీరానికి చేరే వేల పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది అధికారులు అంచనా వేస్తున్నారు. దాంతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. ఏ ఒక్క ప్రాణం పోరాదన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. అలాగే పవన్ సైతం తన సొంత జిల్లాలో ఇంతటి పెను విపత్తుని ఎదుర్కోనెలా అధికార యంత్రాంగాన్ని పూర్తిగా సమాయత్తం చేస్తున్నారు. ఈ గండం గడచి మళ్ళీ అంతా ప్రశాంతంగా జీవనం సాగించాలని కోరుకుంటున్నారు.

Tags:    

Similar News