మోహన్ బాబుకు సుప్రీంలో చుక్కెదురు
ఫీజు రీఇంబర్స్ మెంట్ కోసం చేసిన ధర్నా ఎంసిసి (ఎన్నికల నియమావళి ఉల్లంఘన) పరిధి కిందకు రాదని మంచు మోహన్ బాబు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.;
వెటరన్ నటుడు మంచు మోహన్ బాబుకు సుప్రీంలో చుక్కెదురైంది. 2019లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసులో స్టే ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు మే 2 న విచారణాధికారి ముందుకు మోహన్ బాబును హాజరు కావాలని ఆదేశించింది. జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
ఫీజు రీఇంబర్స్ మెంట్ కోసం చేసిన ధర్నా ఎంసిసి (ఎన్నికల నియమావళి ఉల్లంఘన) పరిధి కిందకు రాదని మంచు మోహన్ బాబు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. వాదోపవాదనలు విన్న కోర్టు తుది విచారణ కోసం నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.
ఇటీవల మంచు కుటుంబంలో కలతలు మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. మంచు విష్ణు, మనోజ్ మధ్య వివాదం మోహన్ బాబుకు ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం కోర్టు వివాదంలోను మరోసారి మంచు కాంపౌండ్ పేరు వార్తల్లో నిలుస్తోంది.