తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ..!

ఈ సమయంలో తెలుగు మీడియా చరిత్రలో సంచలన విషయం తెరపైకి వచ్చింది

Update: 2024-05-10 11:30 GMT

ప్రభావం బలంగా ఉంటుందని ఆయా నేతలు నమ్ముతున్నారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు.. తెలంగాణ సీఎం రేవంత్, కేసీఆర్ లు ఇటీవల పలు టీవీ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సమయంలో తెలుగు మీడియా చరిత్రలో సంచలన విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... భారత ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద విషయమనే చర్చ మొదలైంది. కారణం... తాజాగా ఆ ఘనత ఎన్టీవీకి దక్కింది. అవును... తొలిసారి తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీవీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎక్స్‌ క్లూజివ్‌ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు.

ఈ ఇంటర్వ్యూలో దేశాన్ని పాలిస్తున్న ప్రధాని మోడీ.. ఎన్టీవీతో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ముచ్చట్ల గురించి మాట్లాడనున్నారు. లోక్‌ సభ ఎన్నికల వేళ మీడియాకు అతి తక్కువ సమయం మాత్రమే ఇవ్వగలిగేంత బిజీ షెడ్యూల్‌ లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్టీవీకి ఎక్స్‌ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వడం గమనార్హం. గతంలో భక్తి టీవీ నిర్వహించిన కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా ప్రధాని మోడీ హాజరయ్యారు.

వాస్తవానికి ఈ కీలక సమయంలో ఎన్టీవీకి ప్రధాని ఇంటర్వ్యూ ఇవ్వడమనేది చాలా పెద్ద విషయనే చెప్పుకోవాలి. ఈ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జరుగుతున్న కీలక పరిణామాలపై ప్రధాని మోడీ సమాధానమివ్వనున్నారు. ఈ సందర్భంగా... ప్రజల మెదళ్లలో నానుతున్న ఎన్నో ప్రశ్నలు, ప్రచారంలో ఉన్న మరెన్నో సందేహాలపై తెలుగు ప్రజల తరపున ఎన్టీవీ ప్రశ్నించనుంది.

Read more!

నేటి (శుక్రవారం) రాత్రి 8 గంటలకు ప్రధాని ఎన్టీవీకి ఎక్స్‌ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. ప్రధాని మోడీతో ఎన్టీవీ ఎక్స్‌ క్లూజివ్ ఇంటర్వ్యూ కోసం ఈ లింక్‌ ను క్లిక్ చేయండి.

Full View
Tags:    

Similar News