ఏపీలో మోడీ అంటే పెద్దగా తెలియదు అంట ..?

దేశానికి ఆయన రాజు. అంతే కాదు విదేశాల్లో పేరు మారుమోగుతూ ఉంటుంది. ఇందిరాగాంధీ తరువాత అంతటి బలమైన శక్తివంతమైన నేత అని కూడా అంతా కీర్తిస్తారు.

Update: 2024-04-29 11:26 GMT

దేశానికి ఆయన రాజు. అంతే కాదు విదేశాల్లో పేరు మారుమోగుతూ ఉంటుంది. ఇందిరాగాంధీ తరువాత అంతటి బలమైన శక్తివంతమైన నేత అని కూడా అంతా కీర్తిస్తారు. ఆయన మౌన ముని కాదు, అలాగే ఒక్క చోటనే ఉండి పాలించే నేచర్ లేదు. ఆయన ఏడాది పొద్దంతా దేశ విదేశాల్లో విపరీతంగా పర్యటనలు చేస్తారు. పదేళ్ళ పాటు ప్రధానిగా ఆయన దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒకటికి పది సార్లు వచ్చి ఉంటారు.

ఇక మీడియా అటెన్షన్ తన వైపు ఎలా తిప్పుకోవాలో తెలిసిన వారు. ఆయన గురించి మీడియా కూడా ఫోకస్ పెట్టి ఎక్కువగానే చూపిస్తుంది. అలాంటి నరేంద్ర మోడీ అంటే తెలియదు అని ఎవరైనా అనుకోగలరా కానీ ఏంతో చిత్రం మోడీ అంటే తెలియదు అంటున్న వారూ ఉన్నారు. వారే ఏపీలో ఉన్నారు.

ఏపీలో చూస్తే డైరెక్ట్ పాలిటిక్స్ ఎక్కువ. అలాగే జనాలకు చదువులతో సంబంధం లేకుండా రాజకీయ అవగాహన బాగా ఎక్కువ. ఏపీలో ఎపుడూ ముఖా ముఖీ పోటీలే జరుగుతాయి. ఒకపుడు టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా పోటీ ఉంటూ వచ్చింది. ఇపుడు టీడీపీ వర్సెస్ వైసీపీగా భీకరమైన పోరు సాగుతోంది.

అలా చూస్తే కనుక ఏపీ రాజకీయాల్లో ఈ రెండు పార్టీల మధ్యనే పొలిటికల్ వార్ సాగుతూ ఉంటుంది. మధ్యలో కొత్త పార్టీగా జనసేన వచ్చినా ఆ పార్టీకి క్యాడర్ అంటూ ఇంకా పూర్తి స్థాయిలో లేదు. కాబట్టి సైడ్ గానే ఉంటోంది. పైగా జనసేనకు కుల పార్టీ ముద్ర కూడా బలంగా ఏర్పడిపోయింది.

Read more!

ఇక టీడీపీ జనసేన బీజేపీ కలసి కూటమి కట్టినా కూడా మోడీ వల్ల ఏమైనా కూటమి ఇమేజ్ పెరుగుతుందా అంటే ఏమీ లేదు అని అందరూ అంటున్నారు. ఏపీలో మోడీ ఎవరో తెలియని వారే ఎక్కువగా ఉంటారు. గ్రామీణ ప్రాంతాలలో చూస్తే కూడా ఆయన గురించి అవగాహన తక్కువ అని అంటున్నారు. అదే విధంగా బీజేపీ ఏపీకి చేసిన ద్రోహం తో పట్టణ వాసులు మోడీ గురించి మండిపోతూంటారు.

మోడీ పేరు ఎత్తగానే ప్రత్యేక హోదాతో పాటు అనేక హామీలు కళ్ల ముందు కదలాడి మోడీ మీద ఆగ్రహం వ్యక్తం చేసే సెక్షన్లు ఎక్కువగా ఉంటాయి. పైగా బీజేపీ రాజకీయ సిద్ధాంతం వేరు. మతం ఆధారంగా బీజేపీ పాలిటిక్స్ ఉంటుందని ఆ పార్టీ వైపు చూసే వారు తక్కువగా ఉంటారు అని అంటారు.

ఏపీలో బీజేపీని వెంట బెట్టుకుని టీడీపీ కూటమి ఎన్నికల్లో వెళ్లడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందని కూడా విశ్లేషణలు ఉన్నాయి. దీని మీద టీడీపీలోనూ అంతర్గతంగా చర్చ సాగుతోంది అని అంటున్నారు. బీజేపీ వల్ల ఓట్లు రాకపోగా ఇబ్బందులే అన్న ఆవేదన ఉంది అంటున్నారు. ఆరు ఎంపీ సీట్లు పది అసెంబ్లీ సీట్లు బీజేపీకి ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెబుతారు.

కానీ పక్కాగా ఎలక్షనీరింగ్ కోసం అని కూడా అంతా భావిస్తారు. అయితే బీజేపీ నుంచి ఏపాటి సహకారం అందుతోంది అన్న దాని మీద కూటమి పెద్దలు అసహనంగా ఉన్నారు అని అంటున్నారు. ఇక పేరుకు బీజేపీ కూటమిలో చేరినా మోడీ ఒకే ఒక మీటింగ్ కి అటెండ్ అయ్యారు. బీజేపీ పెద్దలు ఎవరూ ఏపీ వైపు తొంగి చూడడం లేదు. నిజానికి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కనీసం రెండు మూడు విడతలుగా మోడీ ఏపీకి వస్తారని అంతా అనుకున్నారు. కానీ అదేమీ కనిపించడం లేదు.

4

దాంతో మోడీ వైఖరి ఏమిటి అన్నది కూడా కూటమి పెద్దలకు అర్ధం కావడం లేదు. ఒక వేళ ఆయన వచ్చినా జగన్ మీద నేరుగా విమర్శలు చేయకుండా మైనారిటీలకు రిజర్వేషన్లు రద్దు అంటూ వివాదాస్పద అంశాలను టచ్ చేస్తే మాత్రం కూటమి పూర్తిగా బిగ్ ట్రబుల్ లో పడినట్లే అంటున్నారు. ఏది ఏమైనా మోడీ కి ఏపీ రాజకీయాలతో అవసరం లేదు, ఏపీ వారికి మోడీ ఎవరో కూడా తెలియ నవసరం లేదు అని సెటైర్లు పడుతున్నాయి.

మోడీ ఏపీకి రావడం ప్రచారం చేయడం వల్ల ఎంత లాభం అన్న దాని మీద కూడా ఇపుడు చర్చ సాగుతోందిట. దేశాన్ని ఊపేస్తున్న మోడీ మ్యాజిక్ ఏపీలో ఎందుకు పనిచేయడం లేదు అన్నదే బిగ్ క్వశ్చన్. దానికి జవాబు బీజేపీ పెద్దలకు మాత్రమే తెలుసు.

Tags:    

Similar News