మోడీ వర్సెస్ జగన్...సీమలో సీన్ అదేనట

ఏపీలో రాజకీయం మారబోతోందా. ఇంతకాలం ఏకపక్షంగా టీడీపీ మాత్రమే ఎక్కువగా వైసీపీ మీద విరుచుకుపడుతోంది.;

Update: 2025-10-11 00:30 GMT

ఏపీలో రాజకీయం మారబోతోందా. ఇంతకాలం ఏకపక్షంగా టీడీపీ మాత్రమే ఎక్కువగా వైసీపీ మీద విరుచుకుపడుతోంది. జగన్ మీద ధాటీగా చంద్రబాబు అండ్ కో విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆ తరువాత జనసేన కూడా సమయం వచ్చినపుడు విమర్శలు గుప్పిస్తోంది కానీ బీజేపీ పెద్దలు ఎవరూ అంతగా రియాక్ట్ కావడం లేదని అంటున్నారు. అఫ్ కోర్స్ ఈ మధ్య విశాఖ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అయితే జగన్ మీద తీవ్రంగానే కామెంట్స్ చేశారు. అయితే వైసీపీ నుంచి వాటి మీద పెద్దగా కౌంటర్లు పడలేదు. ఇక ఇపుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి వస్తున్నారు. దాంతో రాజకీయంగా ఏమి జరగవచ్చు అన్నదే అంతా ఆసక్తిగా చూస్తున్నారు

జగన్ అడ్డా లాంటి చోట :

సాధారణంగా రాయలసీమను వైసీపీ హార్డ్ కోర్ రీజియన్ గా చెబుతారు. వైసీపీకి 2024 ఎన్నికలు తప్పించి అంతకు ముందు అన్ని ఎన్నికల్లోనూ భారీ విజయాలు అక్కడ దక్కాయి. ఇక వైసీపీ బలం ఈ రోజుకూ అక్కడ బాగానే ఉంది. అందుకే టీడీపీ సీమ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అదే సమయంలో జీఎస్టీ 2.0 సభలను కూడా ప్రధాని మోడీ నాయకత్వంలో సీమలోనే నిర్వహించాలని డిసైడ్ కావడం వెనక వ్యూహం ఉందని అంటున్నారు. దాంతో మోడీ కర్నూల్ టూర్ మీద అంచనాలు పెరిగిపోతున్నాయి.

జగన్ మీద ఫైర్ :

ఈ నెల 16న కర్నూల్ లో జరిగే సభకు ప్రధాని మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా మంత్రులు అంతా హాజరవుతున్నారు. సహజంగానే చంద్రబాబు జగన్ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తారు, మరి మోడీ మాట ఏమిటి అన్నదే ఇపుడు చర్చగా ఉంది. మోడీ కూడా జగన్ మీద నిప్పులు చెరుగుతారా అన్నది చూడాలని అంటున్నారు. ఇప్పటిదాకా ఏపీకి ఎన్నోసార్లు మోడీ వచ్చినా జగన్ మీద పెద్దగా విమర్శలు చేసినది లేదని గుర్తు చేస్తున్నారు. అమరావతి పునర్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన సభలో కూడా మిత్ర పక్షాలు జగన్ ని టార్గెట్ చేస్తే మోడీ మాత్రం ఆ విషయం కాకుండా అన్నీ మాట్లాడారు అని కొంత అసంతృప్తి అయితే కూటమి నేతలలో కనిపించింది. ఇపుడు ఆ లోటుని మోడీ పూరిస్తారా అన్నదే చర్చట.

రాయలసీమ కావడంతో :

రాయలసేమలో బలపడాలని బీజేపీ కూడా చూస్తోంది. ఆ పార్టీకి కూడా కొన్ని సీట్లు అనూహ్యంగా ఈసారి లభించాయి దాంతో మరింతగా అక్కడ పటిష్టం కావాలని బీజేపీ భావిస్తోంది. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పీవీఎన్ మాధవ్ కూడా తన పర్యటనలను కడప నుంచే ప్రారంభించారు. దాంతో మోడీ అయితే రాయలసీమకు కూటమి ప్రభుత్వం ఏమి చేస్తుందో చెబుతూనే వైసీపీ ప్రభుత్వం ఏమి చేయలేదో కూడా చెప్పాల్సి ఉంటుంది అని అంటున్నారు. అంతే కాదు జగన్ ప్రభుత్వం విధానాల మీద కూడా గట్టిగా మాట్లాడాల్సి ఉంటుంది. ఆ దిశగా మోడీ ఫైర్ అవుతారని కూటమి పార్టీలు భావిస్తున్నారు.

జగన్ దేశంలో లేని వేళ :

ఇక ఈ నెల 16న జరిగే కర్నూల్ లోని కూటమి సభ జగన్ దేశంలో లేని వేళ సాగుతోంది ఇదిలా ఉంటే మోడీ పాతికేల్ళ అధికార రాజకీయ ప్రస్తానం మీద ఈ మధ్యనే జగన్ ట్వీట్ వేసి మోడీని ఆకాశానికి ఎత్తేశారు. మరి ఈ సందర్భంలో మోడీ జగన్ గురించి ఏమి మాట్లాడుతారు, ఆయన మీద ఘాటు విమర్శలు చేస్తారా లేక లైట్ గా విమర్శించి ఊరుకుంటారా లేకపోతే అసలు ఆ ఊసే లేకుండా అభివృద్ధి మీదనే మాట్లాడి ముగిస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. సో అంతా ఈ నెల 16న జరిగే కర్నూల్ లో మోడీ మీటింగ్ కోసం వెయిటింగ్ అని అంటున్నారు.

Tags:    

Similar News