• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ట్రాఫిక్ విషయంలో...

ట్రాఫిక్ విషయంలో బెంగళూరు వరల్డ్ రికార్డ్.. హైదరాబాద్ స్థానం ఇదే!

| ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన నగరల్లో జనాభా రోజు రోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2026-01-22 08:11 GMT

ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన నగరల్లో జనాభా రోజు రోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఉన్నత చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో గ్రామాల్లోని ప్రజలు పట్టణాలకు పరుగుతులు తీస్తున్నారు. ఈ సమయంలో ప్రధాన నగరాల్లో జనాభా పెరుగుతుంది, వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది.. ఫలితంగా ట్రాఫిక్ సమస్యలు తదనుగుణంగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో ప్రపంచంలో ఏయే నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉందనే అంశంపై టామ్ టామ్ సంస్థ ఒక నివేదిక వెల్లడించింది.

అవును... ప్రపంచవ్యాప్తంగా పలు కీలక నగరాల్లో జనాభా విపరీతంగా పెరుగుతోంది.. వాహనాల సంఖ్య పెరుగుతోంది.. అయినప్పటికీ రోడ్లు మాత్రం అంతే ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు రోజు రోజుకీ కఠినతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తాజాగా నెదర్లాండ్స్‌ కు చెందిన సంస్థ టామ్‌ టామ్ ఓ ఆసక్తికర నివేదిక విడుదల చేసింది. ఈ 2025 రద్దీ డేటా ప్రకారం.. అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో మెక్సీకో నగరం టాప్ ప్లేస్ లో నిలవగా.. బెంగళూరు నగరం రెండో స్థానంలో నిలిచింది.

తాజా ట్రాఫిక్ ఇండెక్స్‌ లో 75.9 స్కోరుతో అత్యంత రద్దీగా ఉండే నగరంగా మెక్సికో నగరం నిలిచింది. దీని ఫ్రీ-ఫ్లో ప్రయాణ సమయం కి.మీ.కు 1 నిమిషం 57 సెకన్లు కానీ దాని సగటు వాస్తవ ప్రయాణ సమయం కి.మీ.కు 3 నిమిషాలు 27 సెకన్లు. ఇక.. భారతదేశంలోని బెంగళూరు ఈ జాబితాలో రెండవ స్థానంలో (74.4) ఉంది. ఇక్కడ సగటు వేగం గంటకు 16.6 కి.మీ. కావడం గమనార్హం. ఇక ఐర్లాండ్‌ లోని చారిత్రాత్మక నగర కేంద్రం డబ్లిన్ ఈ జాబితాలో మూడవ స్థానంలో (72.9) ఉంది.

ఈ క్రమంలో... 2025 లో సమీక్షించబడిన దాదాపు 500 నగరాల్లో, కేవలం 34 నగరాల్లో మాత్రమే 2024 సంవత్సరంతో పోలిస్తే కిలోమీటరుకు వాటి అంతర్గత ప్రయాణ సమయాలు తగ్గాయని నివేదిక తెలిపింది. ఈ జాబితాలో ఉన్న భారతీయ నగరాల వివరాలు చూస్తే.. ముంబై (18వ స్థానం), ఢిల్లీ (23), కోల్‌ కతా (29), చెన్నై (32), హైదరాబాద్ (47) స్థానాల్లో నిలిచాయి. వాస్తవానికి కోల్ కతా గత ఏడాది ట్రాఫిక్ లో రెండో స్థానంలో ఉన్నప్పటికీ ఈ ఏడాది మెరుగుపడింది!

ఇక... అమెరికాలోని మూడు నగరాల్లో ప్రయాణ సమయాలు గత ఏడాదితో పోలిస్తే మరింత దిగజారాయి. ఇందులో భాగంగా... 2024లో సిరక్యూస్‌ లో ఒక కిలోమీటరు ప్రయాణానికి 1 నిమిషం 19 సెకన్లు పట్టగా.. 2025లో అది 1 నిమిషం 26కి పెరిగింది. మిన్నియాపాలిస్‌ లో ప్రయాణ సమయాలు 1:12 నుండి 1:17కి పెరిగాయి. ఇదే క్రమంలో... శాన్ ఫ్రాన్సిస్కాన్లు ట్రాఫిక్‌ లో అదనంగా 11 సెకన్లు గడిపారు. ఇక్కడ కి.మీ.కు 2024లో 2:47 నుండి 2025లో 2:58కి పెరిగాయి.

Tags:    
  • trafficcongestion 
  • bengaluru 
  • tomtomreport 
  • globalcities 
  • urbantraffic 
  • indiancities 
  • mexicocity 

Similar News

కారు నాది.. పెట్రోల్ నాది.. రోడ్డుపై వెళ్లాలంటే ట్యాక్స్ కట్టాలా? హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్‌పై నెటిజన్ల సెటైర్లు

2026-11-26 05:47 GMT

ఎవరీ జగన్ మోహన్... విజయసాయి నోట అదే పిలుపు !

2026-11-26 05:38 GMT

పెట్రోల్ బంకా.. ఇన్సూరెన్స్ ఆఫీసా? పెట్రోల్ పోయరా? ఇదేందయ్యా సామీ

2026-11-26 05:17 GMT

ఆక్స్ఫర్డ్‌లో భారతీయ విద్యార్థినికి అవమానం.. పెర్ఫ్యూమ్ వాసనపై మహిళ కామెంట్!

2026-11-26 04:25 GMT

అమెరికాలో పుట్టిన పిల్లలకు పౌరసత్వం.. ట్రంప్ కొత్త ఆదేశాలనూ అడ్డుకున్న కోర్టు!

2026-11-26 03:54 GMT

వాడేసిన టైర్లతో కాలుష్యం.. వాటితో చెప్పులు తయారు చేస్తున్న స్టార్టప్

2026-11-26 03:54 GMT

భారత్, పాక్ క్రికెటర్ల తీరుపై హర్భజన్ ఫైర్.. ఐసీసీకి కీలక సూచన!

2026-11-26 03:53 GMT

అమెరికాలో OPT పేరుతో మోసాలు.. F-1 విద్యార్థులను టార్గెట్ చేస్తున్న కన్సల్టెన్సీలు!

2026-11-26 03:52 GMT

లోకేష్ మమేకం.. ఇతర పార్టీలూ నేర్చాల్సిందే !

2026-11-26 03:50 GMT

విశాఖ మేయర్...వెరీ పవర్ ఫుల్ !

2026-11-26 03:50 GMT

ఢిల్లీకి ఫిర్యాదు...ఏపీ బీజేపీ నేతల వ్యూహం

2026-11-26 03:49 GMT

ఎందుకు ధిక్కరించానో పవన్ కే చెబుతా !

2026-11-26 03:44 GMT

Copyright @2026

Powered by Blink CMS