నెక్ట్స్ ప్రధాని వీరేనా..! రాసులు కూడా కలిసి వస్తున్నాయా..?
ప్రధానంగా వినిపించే పేరు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యా నాథ్. తక్కువ వయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన యూపీ సీఎంగా రెండో దఫా పని చేస్తున్నారు.;
‘ప్రధాని మోడీ తన పదవికి రాజీనామా చేస్తారా?’ చేయరు..! చేస్తారు..! ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉన్న టాపిక్.. ఏ కారణం చేత రాజీనామా చేయాలి..? అన్న టాపిక్ కూడా చర్చలో ఉంది. అయితే దీనికి బీజం ఎక్కడ పడింది. క్లుప్తంగా చూద్దాం.. ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ ఒక మాట అన్నారు. అది ఏ సందర్భం అనేది చాలా మంది పట్టించుకోవడం లేదు. కానీ ఒక్క ప్రధాని రాజీనామా అన్న విషయాన్ని మాత్రమే ట్రెండింగ్ చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త మోరోపంత్ జీ పింగళే శతజయంతి ఉత్సవాలలో భాగంగా ఆయనకు సంబంధించి ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. అందులో ఒక పేజీని చదువుతూ ‘75 సంవత్సరాల నిండిన వారు తన పదవికి రాజీనామా చేయాలి’ అని చదివారు. ఈ లెక్కన ఈ సంవత్సరం సెప్టెంబర్ 17కు మోడీకి 75 సంవత్సరాలు నిండుతాయి. అదే విధంగా మోహన్ భాగవత్ కు కూడా సెప్టెంబర్ 11కు 75 సంవత్సరాలు నిండుతాయి. ఇద్దరు రాజీనామా చేయాలని కొందరు వాదిస్తున్నారు. సరే ప్రధాని పదవికి మోడీ రాజీనామా చేస్తే ఎవరు ఆ పీఠం ఎక్కుతారు..? బీజేపీ నుంచి ఎవరు దీనికి అర్హులు అన్న చర్చ కూడా లేకపోలేదు.
ప్రధానంగా వినిపించే పేరు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యా నాథ్. తక్కువ వయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన యూపీ సీఎంగా రెండో దఫా పని చేస్తున్నారు. సన్యాస ఆశ్రమం స్వీకరించిన ఆయన తన పర భేదం లేకుండా పాలన సాగిస్తున్నారు. వాక్ చాతుర్యం ఉన్న నేత. దేశంలో ఉత్తరప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రం. అంత పెద్ద రాష్ట్రంను పాలించే నాయకుడు దేశాన్ని పాలిస్తే బాగుంటుందని మోడీ తర్వాత యోగీ పీఎం అవుతారని బీజేపీ యోగీని అక్కడ సీఎంను చేసిందని గతంలో బాగానే చర్చలు జరిగాయి. ఏది ఏమైనా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ గురంచి తమ దాయాది దేశం పాకిస్తాన్ కూడా వారి చట్ట సభల్లో గొప్పగా చెప్పింది. ఇక యోగీ జాతకాన్ని పరిశీలిస్తే శని, గురువు బలమైన స్థానాల్లో ఉండడంతో అతను బలమైన పోటీదారుడిగా నిలిచే అవకాశం లేకపోలేదు.
ఇక రెండో స్థానంలో అమిత్ షా.. అమిత్ షా ప్రధాని నరేంద్ర మోడీకి నమ్మిన అనుచరుడు. గతంలో పార్టీ పగ్గాలు చేపట్టి పార్టీని జాతీయ స్థాయిలో పటిష్టం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎంతో కష్టపడ్డారు. ఆయన పన్నిన చాణక్య ప్రణాళికలతోనే మోడీ ప్రధాని పీఠంపై కూర్చున్నారని అప్పట్లో చాలా కథనాలే వచ్చాయి. హిందుత్వం విషయంలో అగ్రసివ్ గా ఉన్న నాయకుడు. ప్రధానిని దగ్గరి నుంచి చూస్తున్న వ్యక్తి. ప్రధాని విధులపై అవగాహన ఉన్న వ్యక్తి. ఇక ఆయన జాతకాన్ని పరిశీలిస్తే రాహువు, చంద్రుడు సరైన స్థానాల్లో ఉన్నారు. కొన్ని కొన్ని ఆటంకాలను తప్పిస్తే ఆయనకు కూడా ప్రధాని పదవి వరించవచ్చు.
ఇక మూడో వ్యక్తి నితిన్ గడ్కరీ. బీజేపీకి గతంలో అధ్యక్షుడిగా పని చేశాడు. పార్టీలో, బయట మంచి గుర్తింపు ఉన్న నేత. ప్రస్తుతం రోడ్డు, రవాణా, మౌళిక సదుపాయాల రంగంలో విశేషంగా పని చేస్తున్నారు. అతని గ్రహాల కదలికలు కూడా బాగానే ఉన్నాయని జ్యోతిష్యులు చెప్తున్నారు. అయితే ప్రధాని పదవి అందుకోగలుగుతాడా? అన్నది కొంచెం సందేహం అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి.