మోడీ సూచనలు పాటిస్తే.. దాదాపు నాలుగున్నర లక్షల కోట్లు ఆదా.. దేశ బడ్జెట్ నే మార్చే ఫిగర్..
ఇంధన నిల్వలు అయిపోయాయి.. అందుకే మోడీ మాట్లాడుతున్నారు.. సరిపోయేంత యూరియా దిగుమతిలో కేంద్రం విఫలమైంది. అందుకే సేంద్రియ సాగు చేయమంటున్నాడు. అంటూ ప్రచారం మొదలు పెట్టాయి.;
‘ఏడాది పాటు బంగారం కొనొద్దు.. పెట్రోల్ వాడకం తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాలను వాడండి.. విదేశీ పర్యటనలు వద్దు.. ఖర్చులు తగ్గించండి.. యూరియా వాడకం తగ్గించి.. సేంద్రియ సేద్యం చేయండి..’ అంటూ ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్ లో చెప్పారు. మోడీ చెప్పినవి అన్నీ బాగానే ఉన్నా.. ప్రతిపక్షం మాత్రం రాద్దాంతం మొదలు పెట్టింది. ఇంధన నిల్వలు అయిపోయాయి.. అందుకే మోడీ మాట్లాడుతున్నారు.. సరిపోయేంత యూరియా దిగుమతిలో కేంద్రం విఫలమైంది. అందుకే సేంద్రియ సాగు చేయమంటున్నాడు. అంటూ ప్రచారం మొదలు పెట్టాయి. కానీ ప్రజలకు తెలుసు మోడీ ఈ సూచనలు ఎందుకు చేశారో..
ఒక దేశ ప్రధాని సామాన్య ప్రజలనుద్దేశించి బంగారం కొనవద్దని లేదా విదేశీ ప్రయాణాలు తగ్గించుకోమని కోరడం వెనుక ఎంతటి లోతైన ఆర్థిక వ్యూహం ఉందో మనీ కంట్రోల్ అంచనాలు చూస్తుంటే అర్థం అవుతోంది. వ్యక్తి గతంగా మనకు ఇవి చిన్న విషయాలుగా అనిపించవచ్చు, కానీ కోట్లాది మంది భారతీయులు కలిసికట్టుగా ఈ నియమాలను పాటిస్తే దేశ ఖజానాకు ఏకంగా రూ. 4.27 లక్షల కోట్ల ($45 బిలియన్లు) లాభం చేకూరుతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది మన దేశ రక్షణ బడ్జెట్‌లో సగానికి పైగా సమానం కావడం విశేషం. భారత ఆర్థిక వ్యవస్థను దృఢంగా మార్చడానికి, డాలర్ నిల్వలను కాపాడుకోవడానికి ప్రధాని మోదీ ఇటీవల ప్రజలకు కొన్ని ప్రత్యేక విజ్ఞప్తులు చేశారు. ఈ మార్పుల వల్ల దేశానికి కలిగే ప్రయోజనాలను ప్రముఖ ఆర్థిక సంస్థలు ఈ క్రింది విధంగా లెక్కించాయి:
చమురు, బంగారం తగ్గిస్తే భారీగా ఆదా
భారతదేశం తన విదేశీ మారక ద్రవ్యాన్ని అత్యధికంగా ఖర్చు చేసేది ఈ రెండు రంగాల పైనే. మనం వాడే పెట్రోల్, డీజిల్‌ను కేవలం 10% తగ్గించినా ఏడాదికి సుమారు $13.5 బిలియన్లు ఆదా అవుతాయి. భారతీయులు బంగారం కొనుగోళ్లను ఒక 10% తగ్గించుకుంటే $7.2 బిలియన్లు మిగులుతాయి. ప్రస్తుతం ఆర్బీఐ తన నిల్వలను పెంచుకుంటూ ప్రజలను నియంత్రించమన్నది అందుకే.
విదేశీ ప్రయాణాలు, వంట నూనెలు
మన విలాసాలు, ఆహార అలవాట్లలో చిన్న మార్పులు దేశానికి పెద్ద మొత్తంలో నిధులను తెచ్చిపెడతాయి. భారతీయులు విదేశీ ప్రయాణాలను తాత్కాలికంగా నిలిపివేసి దేశీయ పర్యాటక రంగం వైపు మొగ్గు చూపితే ఏకంగా $15.8 బిలియన్లు దేశంలోనే ఉండిపోతాయి. పామాయిల్ వంటి వంట నూనెల దిగుమతులను 10% తగ్గించుకుంటే $1.95 బిలియన్లు పోగవుతాయి.
వ్యవసాయ రంగంలో మార్పులు
రసాయన ఎరువుల దిగుమతిపై ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తోంది. రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని 50% మేర తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్తే $7.3 బిలియన్లు ఆదా అవుతాయని అంచనా.
మొత్తంగా ఈ అన్ని రంగాల్లో మనం చేసే చిన్న త్యాగం వల్ల రూ. 4.27 లక్షల కోట్లు ఆదా అవుతాయి. ఈ భారీ నిధులను ప్రభుత్వం విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించే అవకాశం ఉంటుంది. అంటే, మనం బంగారం కొనకుండా ఉండటం లేదా విదేశీ పర్యటనలు తగ్గించుకోవడం ద్వారా పరోక్షంగా దేశ నిర్మాణంలో భాగస్వాములవుతున్నామన్నమాట.