మోడీ నేనూ ఎపుడూ సెలవు పెట్టలేదు...ఇంట్రెస్టింగ్ రీజన్
కేంద్రంలో నరేంద్ర మోడీ 75 ఏళ్ళు నిండిన వారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా 75 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు.;
కేంద్రంలో నరేంద్ర మోడీ 75 ఏళ్ళు నిండిన వారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా 75 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. కానీ వారిద్దరిని చూసినపుడు ఎవరికీ ఆ ఏజ్ విషయం తట్టదు, అదే వారిద్దరి గొప్పతనం. ఎందుకంటే వారికి ఏజ్ అన్నది జస్ట్ ఒక నెంబర్ మాత్రమే. మరి ఈ ఇద్దరూ కూడా అందరి లాంటి వారే కదా. వారికి ఎలాంటి సమస్యలు ఉండవా అన్న సందేహం చాలా మందిలో కలుగుతుంది. అయితే ఈ ఇద్దరి రాజకీయ జీవితం అందరికీ తెలిసిందే. వారి ప్రజా జీవితంలో అన్ని విషయాలు తెరచిన పుస్తకం మాదిరిగానే ఉంటుంది.
ఈ రోజుకీ డైనమిక్ గా :
రోజంతా టూర్లు వేయడంలో మోడీ బాబు ఎవరికి ఎవరూ తీసిపోరు. అలా దేశ విదేశాలలో ఎన్నో పర్యటనలు చేస్తూనే ఉంటారు నరేంద్ర మోడీ. చంద్రబాబు విషయం చెప్పాల్సింది లేదు. ఆయన ఉమ్మడి ఏపీనే చుట్టేసిన నాయకుడు, విభజన ఏపీలో ఆయనకు ఏ మూల నుంచి ఏ మూల అయినా తిరిగేందుకు ఓపికతో పాటు ఉత్సాహం కూడా అలాగే వచ్చేస్తుంది. ఈ ఇద్దరి నేతలలో ఒక్క మరో పోలిక ఏమిటి అంటే డైనమిక్ లీడర్స్ గా ఉండడం. ఈ రోజుకీ ఆలోచనల్లో కానీ ఆచరణలో కానీ ఆ దూకుడు ఎక్కడా తగ్గకపోవడం.
ఇది ఆలోచించారా :
ఈ మాట వింటే అవును కదా ఇంతవరకూ అసలు ఆలోచించలేదే అనిపించవచ్చు. కానీ ఈ విధంగా ఎందుకు ఆలోచించలేదు అంటే దానికి జవాబు ఆ ఇద్దరే అని చెప్పారు. అలా ఆలోచించే చాన్స్ ఆ ఇద్దరూ ఇవ్వలేదు అని చెప్పాలి. ఇంతకీ ఆ విషయం ఏమిటి అంటే నరేంద్ర మోడీ కానీ చంద్రబాబు కానీ ఎపుడైనా అనారోగ్యం బారిన పడడం. ఎంతగా ఆలోచించినా వారి పేరుకు వెనక అనారోగ్యం అన్న మాటకు అసలు పొంతనే కుదరదు. అసలు ఎవరి మెదడు కూడా ఆ రెండు విషయాలని లింకప్ చేసి కూడా థింక్ చేయదు అంటే అతిశయోక్తి కాదేమో.
అలా సెలవు తీసుకోలేదు :
ప్రధాని నరేంద్ర మోడీ కానీ తాను కానీ అనారోగ్య కారణాలతో ఎప్పుడూ సెలవు తీసుకోలేదు అని చంద్రబాబు చెప్పారు. దానికి కారణం నియమబద్ధమైన తమ జీవన విధానం అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ జీవన విధానం మార్చుకోవాలని బాబు సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహార అలవాట్లను మార్చుకోవాలని కోరరు. అంతే కాదు నూనె, పంచదార, ఉప్పు వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. ఆహరమే ఔషధం వంటశాలే ఫార్మసీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అని ఒక మంచి కొటేషన్ ని కూడా ఆయన ఇచ్చారు.
అదే విధంగా ప్రశాంతంగా జీవించడంతో పాటు రోజులో ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం అందరికీ తప్పనిసరి అన్నారు. అంతే కాకుండా యోగాను అందరూ జీవన విధానంగా అలవర్చుకోవాలని బాబు చెప్పారు. త్వరలోనే యోగాకు సంబంధించి ఓ యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తామని ఆయన అన్నారు. శాసనసభలో మాట్లాడుతూ బాబు తన ఎమ్మెల్యేలు మంత్రులతో పాటు ఏపీ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అందరికీ ఆరోగ్యం గురించి చెప్పిన మంచి మాటలు ఇవి. పాటిస్తే చంద్రబాబు నరేంద్ర మోడీ మాదిరిగా అంతా మంచి ఆయుష్షుతో వయసుని సైతం పక్కన పెట్టి ముందుకు సాగుతారు.