ఏపీ తెలంగాణాలపై ఫోకస్...మోడీ అమిత్ షా టూర్లు !

ఇదిలా ఉంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా నవంబర్ 2న తెలంగాణలో పర్యటిస్తారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ నెలలో తెలంగాణలో టూర్ పెట్టుకున్నారు.

Update: 2026-10-27 03:48 GMT

దక్షిణాదిన బీజేపీకి పూర్తి స్థాయిలో ఆశలు ఉన్నవి రెండు తెలుగు రాష్ట్రాలే అన్నది తెలిసిదే. తమిళనాడు టీవీకే అన్న కొత్త పార్టీని గెలిపించింది. అలా విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు. కేరళలో కమ్యూనిస్టులు దిగిపోతే కాంగ్రెస్ అధికారం అందుకుంది. కర్ణాటకలో టఫ్ ఫైట్ కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉంది. ఈ నేపధ్యంలో 2029 ఎన్నికల గురించి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న బీజేపీ పెద్దలు ఏపీ తెలంగాణాల్లో వరస టూర్లకు ప్లాన్ చేశారు అని అంటున్నారు.

తెలంగాణా వ్యూహం :

ఇదిలా ఉంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా నవంబర్ 2న తెలంగాణలో పర్యటిస్తారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ నెలలో తెలంగాణలో టూర్ పెట్టుకున్నారు. నవంబర్ 2న హైదరాబాద్‌లో జరిగే బీజేపీ మహా పాదయాత్రలో అమిత్ షా పాల్గొంటారు. పోలింగ్ బూత్ కమిటీల సమావేశాలు సంస్థాగత సమీక్షలలో కూడా ఆయన హాజరవుతారు. నరేంద్ర మోదీ డిసెంబర్ లో వరంగల్‌లో మామునూరు విమానాశ్రయం శంకుస్థాపన కోసం వస్తున్నారు. అలాగే సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవాలు చేయడమే కాకుండా వరంగల్ లోనే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.

ఏపీలో సైతం ఇద్దరూ :

ఇదే నేపథ్యంలో ఏపీలో కూడా అధికారిక కార్యక్రమాలలో మోడీ అమిత్ షా పాల్గొంటారు. డిసెంబర్ 4 నుంచి 6వ తేదీల దాకా తిరుపతిలో డిజిపిలు,ఐజిపిల సమావేశంలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా హాజరవుతారు. తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ లో డిజిపిలు,ఐజిపిల జాతీయ స్థాయి సమావేశం జరగనుంది .వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన డిజిపిలు,ఐజిపిలు సహా 200 మందికి పైగా ఐపిఎస్ అధికారులు, 200 మంది వరకూ ఐబి అధికారులు,స్టేట్ అండ్ సెంట్రల్ ఫోర్సెర్సెస్ అధికారులు,ఎన్ఎస్ఏ,కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గోనున్నారు. ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోడి మొదటి రెండు రోజులు ఈ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది. దాని కోసం ఇప్పటి నుంచే కసరత్తు సాగుతోంది.

తెలుగు నాట పట్టు కోసం :

అలా డిసెంబర్ నెలలో మోడీ అమిత్ షా రెండు తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తారు. దాంతో ఏపీ తెలంగాణా రాజకీయం గురించి కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలాగే తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో అధికారం అందుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఏపీలో తన రాజకీయ బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. దీంతో మోడీ అమిత్ షా పర్యటనలు ఆసక్తిని రేపుతున్నాయి.

Tags:    

Similar News