• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బ్రేకింగ్... కరుణానిధి...

బ్రేకింగ్... కరుణానిధి పెద్ద కుమారుడు, నటుడు ముత్తు మృతి!

| తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు ముత్తువేల్ కరుణానిధి ముత్తు (ఎంకె ముత్తు) అనారోగ్యంతో మరణించారు.

By - Tupaki Desk
Update: 2025-07-19 05:12 GMT

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు ముత్తువేల్ కరుణానిధి ముత్తు (ఎంకె ముత్తు) అనారోగ్యంతో మరణించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 77 ఏళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఈయన 1948 జనవరి 14న కరుణానిధి - పద్మావతి దంపతులకు జన్మించారు.

అవును... కరుణానిధి పెద్ద భార్య పద్మావతికి జన్మించిన ఎం.కె.ముత్తు కాసేపటి క్రితం మరణించారు. తన తండ్రి కళాభిరుచి లాగే ఎం.కె.ముత్తు కూడా తొలుత నాటకాల్లో, తరువాత సినిమాల్లో నటించడం ప్రారంభించారు. ఇదే సమయంలో.. 70వ దశకంలో డీఎంకే వేదికలపై పార్టీ విధానాలను వివరిస్తూ పాటలు పాడటం ద్వారా ప్రజల్లో ఎంతో ఆదరణ పొందారు.

వాస్తవానికి ఎంజీఆర్ కు పోటీగా ఎం.కె.ముత్తును కరుణానిధి చిత్ర పరిశ్రమలోకి తీసుకువచ్చారని చెబుతారు. ఆయన నటించిన చిత్రాలలో పిళ్ళైయో పిళ్ళై (1972), పూకారి (1973), షయాలికారన్ (1974), దమయ విల్లుక్కు (1975) అత్యంత ముఖ్యమైనవిగా చెబుతారు. ఆయన డీఎంకే వేదికలపైనే కాకుండా పలు సినిమాల్లో కొన్ని పాటలు కూడా పాడారు.

ఆయన నటన, రూపురేఖలు ఎంజీఆర్ కు ఏమాత్రం తగ్గకుండా ఉన్నాయని అప్పట్లో చెప్పుకునేవారు! ఇక గత కొంతకాలంగా వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎం.కె.ముత్తు చెన్నైలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం అనారోగ్యంతో మరణించారు. ఆయన భౌతికకాయాన్ని చెన్నైలోని ఇంజంబక్కంలోని ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్ధం ఉంచారు.

మరోవైపు ఈరోజు డీఎంకే తరపున జరగాల్సిన అన్ని కార్యక్రమాలు రద్దు చేయబడ్డాయి. ఎం.కె.ముత్తు జీవితంలో కళ, రాజకీయాలు, వ్యక్తిగత సవాళ్లు సహా అనేక కోణాలు ఉన్నాయని చెబుతారు. ఆయన మరణం డీఎంకే కార్యకర్తలలోనూ, అటు చిత్ర పరిశ్రమలోనూ తీవ్ర విషాదాన్ని కలిగించింది.

కాగా... కరుణానిధికి పద్మావతి, దయాళు అమ్మాళ్, రాజతి అమ్మాళ్ అనే ముగ్గురు భార్యలు ఉండేవారు! కరుణానిధి, అతని మొదటి భార్య పద్మావతి దంపతుల ఏకైక కుమారుడు ఎంకే ముత్తు. ముత్తుకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. వారిలో కుమారుడు అరివునిధి, కుమార్తె తెన్‌ మొళి.

క‌రుణానిధి రెండో భార్య ద‌యాళు అమ్మాల్ కాగా... వీరికి నలుగురు సంతానం. అందులో వారి మొద‌టి కొడుకు ఆళ‌గిరి.. రెండో కుమారుడు సీఎం స్టాలిన్.. మూడో కుమారుడు తమిళరసు కాగా.. కుమార్తె సెల్వి!

ఇక.. కరుణానిధి మూడో భార్య పేరు రాజాతి అమ్మాళ్ కాగా.. ఆమెకు ఒకరే కుమార్తె. ఆమె పేరు కనిమొళి!

Tags:    
  • MKMuthu 
  • KarunanidhiFamily 
  • DMK 
  • TamilCinema 
  • MKStalin 
  • TamilNaduNews 
  • RIPMKMuthu 
  • DMKLegacy 
  • TamilPolitics 
  • KollywoodNews 
  • ఎంకెముత్తు 
  • కరుణానిధి 
  • తమిళనాడు 

Similar News

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

Copyright @2026

Powered by Blink CMS