• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మిస్ వరల్డ్: నిమిషాల్లో...

మిస్ వరల్డ్: నిమిషాల్లో చీరకట్టులో మారి.. అచ్చ తెలుగు అమ్మాయిలుగా!

| అందాల పోటీలు అంటే.. అందాల ఆరబోత.. అవయువాల షోకేస్ చేయటమే తప్పించి ఇంకేమీ లేదన్న స్టీరియో టైప్ ఆలోచనలకు చెక్ చెప్పాల్సిందే.

By - Tupaki Desk
Update: 2025-05-15 03:15 GMT

అందాల పోటీలు అంటే.. అందాల ఆరబోత.. అవయువాల షోకేస్ చేయటమే తప్పించి ఇంకేమీ లేదన్న స్టీరియో టైప్ ఆలోచనలకు చెక్ చెప్పాల్సిందే. అందం అంటే.. కనిపించే రూపమే కాదు.. అంతకు మించిన టాలెంట్.. మహిళల సత్తా చాటే పోటీలుగా చూడాల్సిన అవసరం ఉంది. మనకు సదూరాన జరిగే అందాల పోటీల గురించి వినటం.. ఈ పోటీలకు వ్యతిరేకించే వాదనలని ఇంతకాలం విన్నాం. కానీ.. గడిచిన కొద్దిరోజులుగా తెలంగాణలో జరుగుతున్న అందాల పోటీల (మిస్ వరల్డ్) నిర్వహణ చూస్తున్న వేళలో.. ఇప్పటివరకు ఉన్న భావనలకు చెక్ చెప్పేలా ఉందని చెప్పాలి.

108 దేశాలకు చెందిన అందాల భామలు (ఆయా దేశాల్లో అందగత్తెలుగా మిస్ కిరీటాన్ని సొంతం చేసుకున్న వారు) తుది పోటీలకు తెలంగాణకు వచ్చారు. వారు వచ్చింది మొదలు నిత్యం అంతర్గతంగా జరిగే పోటీల్లో తమ సత్తా చాటటంతో పాటు.. ఇక్కడి కల్చర్ ను.. ప్రజల జీవన విధానాన్ని.. ఇక్కడ పర్యాటకానికి సంబంధించిన విశేషాల్ని తెలుసుకునేందుకు వారు చూపిస్తున్న ఆసక్తి.. ఆ సందర్భంగా వారి నుంచి వస్తున్న సానుకూలత చూసినప్పుడు అందాల పోటీల్ని చూడాల్సిన కోణాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందన్న భావన కలుగుతుంది.

బుధవారం ఉమ్మడి వరంగల్ లోని పలు దర్శనీయస్థలాల్ని చూసేందుకు వెళ్లిన 30 దేశాలకు పైనే అందాల భామలు.. ఆయా ప్రాంతాల్లోని విశేషాల గురించి విని విస్మయానికి గురయ్యారు. అన్నింటికి మించి రామప్ప దేవాలయంలోని కళా సంపదకు అచ్చెరువు పొందారు. రామప్ప ఆలయానికి వెళ్లే వేళలో.. వారి ప్రాశ్చాత్య వస్త్రాల్ని వదిలేసి.. సంప్రదాయ చీరకట్టులోకి మారిపోయారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే వీరంతా చీరకట్టులోకి మారిపోవటం.. నుదిటిన బొట్టు పెట్టుకొని.. జడలు వేసుకొని.. పూలు అలంకరించుకోవటంతో పాటు.. చేతులకు గాజులు వేసుకొన్న వైనం చూసినప్పుడు ప్రపంచ అందాలన్ని తెలుగు అందాలుగా మారిపోయిన వైనం కనిపిస్తుంది.

ప్రపంచ సుందరీమణులు చీరలు కట్టుకోవటానికి వీలుగా.. వారికి సాయం చేసేందుకు 11 మంది కాస్ట్యూమ్ డిజైనర్లను సిద్ధం చేసి ఉంచారు. వారంతా అతిథులకు తగ్గట్లు చీరకట్టు అలంకారాన్ని సిద్ధం చేశారు. ఇందుకోసం మొత్తం టీం 30 నిమిషాల వ్యవధిలోనే చీరలు కట్టుకొని.. పూర్తి అలంకరణతో అచ్చ తెలుగు అమ్మాయిలుగా మారిన వైనం ఆసక్తికరంగానే కాదు.. అందరిని అకట్టుకునేలా చేసిందని చెప్పక తప్పదు.

Tags:    
  • MissWorld2025 
  • TeluguTradition 
  • SareeTransformation 
  • IndianCulture 
  • MissWorldInIndia 
  • SareeElegance 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

Copyright @2026

Powered by Blink CMS