మొత్తం సిబ్బందిలో 4% శాతం మందికి మైక్రోసాఫ్ట్ బిగ్ షాక్!
అవును... దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైందని తెలుస్తోంది.;
ఇటీవల కాలంలో కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఒక్కసారిగా షాక్ కి గురిచేసే విషయంగా లేఆఫ్ లు మారిన సంగతి తెలిసిందే! ఆ మాట వింటేనే ఉద్యోగులు వణికిపోతుంటారు! ఎవరికి ఎప్పుడు షాక్ తగులుతుందోననే టెన్షన్ పడేవారిలో చిన్న సంస్థ, పెద్ద సంస్థ అనే తారతమ్యాలేమీ లేవు. ఈ క్రమంలో.. మైక్రోసాఫ్ట్ లో వేల మందికి బిగ్ షాక్ తగలనుంది!
అవును... దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. ఈ విషయాన్ని సియాటిల్ టైమ్స్ నివేదించింది! ఈ క్రమంలో... ఒకేసారి వేలాది మందికి లేఆఫ్ నోటీసులు జారీ చేస్తునట్లు ప్రకటించింది. దీంతో... నెలల వ్యవధిలోనే భారీగా లేఆఫ్ లు ప్రకటించడం ఇది రెండోసారి అవుతుంది!
ఇది ఉద్యోగులకు బిగ్ షాకింగ్ వార్తగా మారింది! ఈ దెబ్బతో ఒకరు కాదు ఇద్దరు కాదు, పదులు కాదు వందలు కాదు, ఏకంగా ఒకేసారి వేల మంది ఉద్యోగులపై వేటు పడనుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎంతమందిపై వేటు పడనుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పనప్పటికీ.. దాదాపు నాలుగు శాతం మంది ఉద్యోగులపై అని అంటున్నారు.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం జూన్ 2024 నాటికి మైక్రోసాఫ్ట్ లో సుమారు 2.28 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సమయంలో... భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపులను మొదలుపెట్టిన మైక్రోసాఫ్ట్.. ఈ ఏడాది మే నెలలో ఒకేసారి 6 వేల మందికి లేఆఫ్ లు ప్రకటించింది. ఇది అదిపెద్ద షాకింగ్ ఇష్యూగా నిలిచింది.
ఈ నేపథ్యంలో ఆ బిగ్ షాక్ ఇంకా హాట్ టాపిక్ గా ఉండగానే... మధ్యలో జూన్ నెల గ్యాప్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్.. జూలైలో మరోసారి పెద్దఎత్తున తొలగింపునకు సిద్ధమైందని తెలుస్తోంది. ఈ తాజా నిర్ణయంతో మొత్తం సిబ్బందిలో సుమారు నాలుగు శాతం మంది.. అంటే దాదాపు 9,100 మంది ఉద్యోగులపై ప్రభావం పడనున్నట్లు అంచనా!