రూ.2,196 కోట్ల జీతాన్ని తిరస్కరించిన 24 ఏళ్ల యువకుడు.. కారణం తెలిస్తే మైండ్ బ్లాక్!

24 సంవత్సరాల వయసున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసర్చర్ మాట్ డిట్కేను నియమించుకోవడానికి ఏకంగా 2, 196 కోట్ల రూపాయలు శాలరీని ఆఫర్ చేశారట.;

Update: 2025-08-06 14:30 GMT

ప్రపంచ దేశాలు టెక్నాలజీలో దూసుకుపోతున్నాయి. ఇందులో భాగంగానే ఏఐ టెక్నాలజీతో స్పీడ్ గా దూసుకెళుతున్నటువంటి దేశాల్లో మన ప్రత్యర్థి దేశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కొన్ని దేశాలు చాలా స్పీడ్ గా ముందుకు వెళ్తున్నాయి. ఇదే తరుణంలో మెటా అధినేత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకెర్ బర్గ్ ఒక సంచలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ల్యాబ్ కోసం 24 సంవత్సరాల వయసున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసర్చర్ మాట్ డిట్కేను నియమించుకోవడానికి ఏకంగా 2, 196 కోట్ల రూపాయలు శాలరీని ఆఫర్ చేశారట.

తొలుత మెటా మాట్ డిట్కేకి 125 మిలియన్ డాలర్ల వేతనాన్ని ఆఫర్ చేసారు. మన ఇండియన్ కరెన్సీ లో ఇది 1,098 కోట్ల రూపాయలు అవుతుంది. అయితే ఈ వేతనం ఇచ్చి జుకెర్ బర్గ్ ఆయనను ఒప్పించేందుకు చాలా సార్లు ప్రయత్నం చేశారట. అయినా డిట్కే తిరస్కరించడంతో తన జీతాన్ని రెట్టింపు చేసేసాడు. 265 మిలియన్ డాలర్లను ఆఫర్ చేశాడు. అంటే ఇది మన కరెన్సీలో 2,196 కోట్ల రూపాయల వేతనంతో సమానం. అయితే మొదట ఈ వేతనాన్ని కూడా డిట్కే తిరస్కరించడంతో.. ఆయనను స్వయంగా కలిసి మరి ఒప్పించినట్లు సమాచారం. మొత్తానికైతే ఇంత ఖర్చు పెట్టి ఆయనకి వేతనం ఇస్తున్నారంటే రాబోవు రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులకు ఎంత డిమాండ్ ఉండబోతోంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో టెక్ దిగ్గజాల మధ్య మరింత పోటీ నెలకొని ఉంటుంది. ఏఐ టాలెంట్ ఉన్న వారి కోసం టెక్ కంపెనీలు ఎంతగానో ఆదరణ చూపిస్తున్నాయి. ఇదే తరుణంలో మెటా అధినేత జుకెర్ బర్గ్ కూడా అత్యుత్తమ టెక్ నిపుణులను ఆకర్షించడానికి భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే 2,196 కోట్ల రూపాయల భారీ ప్యాకేజీ ఆఫర్ చేసినట్టు సమాచారం.

వాషింగ్టన్ యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పీహెచ్డీ చేపట్టారు మార్ట్ డిట్కే. దీన్ని మధ్యలోనే ఆపివేసి అలెన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఏఐ రియాలిటీ వరల్డ్ రీసెర్చర్ గా పని మొదలుపెట్టారు. అలా టీం లీడర్ స్థాయికి ఎదిగారు. అంతేకాకుండా ఫోటోలు,ఆడియోలు, టెక్స్ట్ ప్రాసెస్ చేయగల అత్యాధునిక మల్టీ మోడల్ చాట్ బట్ పై రీసెర్చ్ చేస్తున్నాడు. మోల్మో డెవలప్మెంట్ టీం లీడర్ గా వ్యవహరిస్తున్న ఈయన ఇటీవల చేసినటువంటి రీసెర్చ్ కి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక సమ్మిట్ NeurlPS 2022లో అవుట్ స్టాండింగ్ పేపర్ అవార్డు లభించింది.

అప్పటినుంచి మెటా ఎలాగైనా డిట్కేను తమ కంపెనీలోనే నియమించుకోవాలని ప్రయత్నాలు చేసింది. మొదటగా వేయికోట్లకు పైగా సాలరీ ఆఫర్ ఇచ్చింది. అయినా ఆయన తిరస్కరించడంతో ప్యాకేజీని ఒక్కసారిగా దాదాపు 200 మిలియన్ డాలర్లకు పైగా ఆఫర్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీన్ని డిట్కే ఒప్పుకొని మెటా కంపెనీలకి సపోర్ట్ చేస్తారా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది. ఒకవేళ ఒప్పుకుంటే మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఇదే అతిపెద్ద అపాయింట్మెంట్ అవుతుందని చెప్పవచ్చు.

Tags:    

Similar News