• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మీర్ పేట్ హత్య కేసులో...

మీర్ పేట్ హత్య కేసులో విస్మయకర విషయాలు... వామ్మో గురుమూర్తి!

| మీర్ పేట్ హత్య కేసులో నిందితుడు గురుమూర్తి ప్రవర్తన విస్మయానికి గురి చేసిందని అంటున్నారు.

By - Tupaki Desk
Update: 2025-01-30 08:57 GMT

మీర్ పేట్ లో భార్యను హత్య చేసి ముక్కలుగా చేసి, ఆధారాల కోసం పోలీసులు మూడు చెరువుల నీళ్లు తాగే పరిస్థితి కల్పించినట్లు చెబుతున్న నిందితుడు గురుమూర్తికి సంబంధించి తెరపైకి షాకింగ్ విషయాలు వస్తున్నాయి. హత్య అనంతరం ఇంట్లో హత్య చేసిన చోటే పిల్లలతో ఎంతో ప్రేమగా, ఏమీ జరగలేదు అన్నట్లు నార్మల్ గా అతడి ప్రవర్తన షాకింగ్ గా ఉందని అంటున్నారు.

అవును... మీర్ పేట్ హత్య కేసులో నిందితుడు గురుమూర్తి ప్రవర్తన విస్మయానికి గురి చేసిందని అంటున్నారు. ఇందులో భాగంగా... భార్యను హత్య చేసి ముక్కలుగా చేసిన అనంతరం కుమార్తె (9), కుమారుడు (4)ని బడంగ్ పేట్ లోని సోదరి ఇంటి నుంచి తన ఇంటికి తీసుకొచ్చే సమయంలోనూ, తీసుకొచ్చిన తర్వాతా చాలా నార్మల్ గానే ప్రవర్తించినట్లు చెబుతున్నారు.

ఇలా పిల్లలను ఇంటికి తీసుకొస్తున్నప్పుడు దారిలో అల్పాహరం తినిపించాడట. హత్య చేసిన చోటే గురుమూర్తి తన పిల్లలతో కలిసి రెండు రోజులు నివాసం ఉన్నాడు. ఇంటికి వచ్చాక అమ్మ ఏదని అడిగిన పిల్లలతో ఒక్కోసారి ఒక్కో సమాధానం చెప్పాడట. ఇక భార్య మృతదేహాన్ని ముక్కలూ చేసేందుకు వాడిన బాత్రుంలోనే పిల్లల అవసరాలు తీర్చి, ఏమీ జరగనట్లు అత్యంత నార్మల్ గా ఉన్నాడని అంటున్నారు.

వారికి ఆకలేస్తే ఆన్ లైన్ లో ఫుడ్ తెప్పించాడట. ఇక.. ఇల్లంతా చెడు వాసన వస్తుందని పిల్లలు అంటే.. ఎయిర్ ఫ్రెష్ నర్ తో ఆ దుర్వాసన పోగొట్టేందుకు ప్రయత్నించినట్లు చెబుతున్నారు. మరోపక్క పిల్లలు పడక గదిలోకి వెళ్లకుండా దానికి తాళం వేసినట్లు చెబుతున్నారు.

లాయర్ వద్దు... జైల్లోనే ఉంటాను!:

ఇక కోర్టులోనూ గురుమూర్తి ప్రవర్తన విస్మయానికి గురిచేసిందని అంటున్నారు. ఇందులో భాగంగా... మీర్ పేట పోలీసులు నిందితుడు గురుముర్తిని బుధవారం రంగారెడ్డి జిల్లా 6వ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఈ సమయలో న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు గురుమూర్తి ఏమాత్రం భయం, బెరుకు లేకుండా సమాధానం ఇచ్చినట్లు చెబుతున్నారు.

ఈ సమయంలో... న్యాయవాదిని పెట్టుకుంటావా అని న్యాయమూర్తి అడగ్గా.. వద్దు అని చెప్పిన గురుమూర్తి.. లీగల్ ఎయిడ్ తరుపున న్యాయవాదిని ఏర్పాటు చేయాలా అని అడిగినప్పుడు.. అవసరం లేదని, తాను జైల్లోనే ఉంటానని బదులిచ్చినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో గురుమూర్తికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.

Tags:    
  • Meerpet 
  • Meerpetcase 
  • Gurumuthi 
  • Meerpetincident 
  • Murder 
  • Hyderababdpolice 
  • Crime 
  • Telangana 
  • Hyderabad 
  • Rangareddycourt 

Similar News

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

Copyright @2026

Powered by Blink CMS