ప్రధాని మోదీ చేతుల మీదుగా మారుతీ సుజుకీ ఈవీ కార్ ఆరంభం.. అదే లక్ష్యం!

అయితే తాజాగా నరేంద్ర మోడీ మారుతి సుజుకీ ఈ విటారా అనే ఎలక్ట్రిక్ కార్ ని తొలిసారి ప్రారంభించారు.;

Update: 2025-08-26 11:35 GMT

మార్కెట్లోకి కొత్త కొత్త కార్లు వస్తున్నాయి. టెక్నాలజీ పెరగడంతో ఎన్నో కొత్త ఫీచర్లతో ఉండే కార్లు వస్తున్నాయి. కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలు అయితే మరికొన్ని పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే తాజాగా నరేంద్ర మోడీ మారుతి సుజుకీ ఈ విటారా అనే ఎలక్ట్రిక్ కార్ ని తొలిసారి ప్రారంభించారు. ఈ మారుతి సుజుకీ ఈవి కార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని ఎన్నో ఆసక్తికర విషయాలు మాట్లాడారు. తాజాగా గుజరాత్ లోని హన్సల్ పూర్ లో జరిగిన సుజుకి మోటర్ ప్లాంట్ లో మారుతి సుజుకి ఈ విటారా అనే కారు , హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్ ఉత్పత్తి చేసే మొదటి ప్లాంట్ ను జెండా ఊపి ప్రారంభించారు.

అయితే ఎలక్ట్రిక్ కార్ కి సంబంధించి మోడీ తన సోషల్ మీడియా ఖాతాలో ఇంట్రెస్టింగ్ ట్వీట్ కూడా పెట్టారు. "భారతదేశం స్వావలంబన చేస్తున్న అన్వేషణలో ఇది ఒక ప్రత్యేకమైన రోజు" అంటూ చెప్పుకొచ్చారు. అలాగే మారుతి సుజుకి ఈవీ కార్లను ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకు ఎగుమతి చేయాలి అని చెబుతూ ఎలక్ట్రిక్ కారుకి జెండా ఊపి ప్రారంభించారు. అలాగే ఈ విటారా మొదటి ఎలక్ట్రిక్ కార్ యూకే కి ఎగుమతి చేస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా మొదటిసారి ఈ విటారా లను యూరప్ లో గత సంవత్సరం చివర్లో ప్రవేశపెట్టారు.

అలాగే భారతదేశంలో జరిగిన భారత్ మొబిలిటీ షో 2025 లో దీన్ని ప్రదర్శించారు. ఈ మారుతి సుజుకి ఈ విటారా కారు టయోటా సహకారంతో రూపొందించబడిన 40 PL డెడికేటెడ్ ఈవీ ఫ్లాట్ ఫామ్ పై నిర్మించబడింది. అలాగే ఈ విటారా కారులో రెండు రకాల బ్యాటరీ సదుపాయాలు ఉన్నాయి.ఒకటి 49kWh కాగా.. మరొకటి 61kWh.ఈ రెండు బ్యాటరీలలో 49 kWh తో వచ్చే కారు 189 Nm టార్క్ ని విడుదల చేయగా..144 హెచ్పీ శక్తిని కలిగి ఉంది. అలాగే 61 kWh బ్యాటరీతో వచ్చే కారులో 189 ఎన్ఎం టార్క్, 174 బిహెచ్పిని విడుదల చేస్తుంది.అలాగే ఈ కారులో ఉన్న అతిపెద్ద బ్యాటరీ 500 కిలోమీటర్లకు పైగా వెళ్తుందని కంపెనీ ప్రదర్శించిన వీడియోలో పేర్కొన్నారు.

ఇక మారుతి సుజుకీ కంపెనీ జనవరిలో ఈ విటారా ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించింది. అంతేకాకుండా ఈ ఈవీ కార్ ని 100 దేశాలకు ఎగుమతి చేయాలన్నదే ఈ కంపెనీ లక్ష్యం. ఇండియాలో మారుతి సుజుకి కంపెనీ ఈ ఈ - విటారా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడం కోసం రూ.2100 కోట్లు ఖర్చు చేసినట్టు ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ హిసాచి టకేయుచి తెలిపారు. అలాగే ఈ కార్ల కోసం తొలి దశలో 100 ప్రధాన నగరాల్లో ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాల్ని కూడా కల్పించబోతున్నట్లు తెలిపారు. అలాగే ఈ విటారా ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసే వారికి స్పెషల్ గా ఇన్స్టాలేషన్ సపోర్ట్, స్మార్ట్ హోమ్ చార్జర్ లు కూడా అందిస్తున్నారు.

Tags:    

Similar News