పులివెందుల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఆమె ?

బీటెక్ రవి సతీమణి. ఆమె పది రోజుల క్రితం పులివెందుల జెడ్పీటీసీకి జరిగిన ఉప ఎన్నికల్లో నామినేషన్ వేసినుపుడే అందరికీ తెలిసింది.;

Update: 2025-08-14 10:00 GMT

ఆమె రాజకీయం గురించి ఎరగరు. ఆమె భర్త వల్లనే రాజకీయం పరిచయం అయి ఉండాలి. అలాంటిది కొంగు బిగించి రంగంలోకి దిగితే కళ్ళు చెదిరే మెజారిటీ వచ్చింది. అంతే కాదు వైసీపీ కంచుకోటలో టీడీపీకి డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. ఇది ఎవరైనా ఊహించగలరా. కానీ జరిగింది. ఇంతకీ వైసీపీకి చుక్కలు చూపించిన ఆ వీర నారి ఎవరు అంటే మారెడ్డి లతారెడ్డి. బీటెక్ రవి సతీమణి. ఆమె పది రోజుల క్రితం పులివెందుల జెడ్పీటీసీకి జరిగిన ఉప ఎన్నికల్లో నామినేషన్ వేసినుపుడే అందరికీ తెలిసింది.

స్టేట్ మొత్తం పాపులర్ :

అతి చిన్న ఎన్నికగా జరిగినా స్టేట్ మొత్తం హోరెత్తించింది పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక. రెండు తెలుగు రాష్ట్రాలలో మారుమోగించిన ఎన్నికగా చెప్పుకోవాలి. దాంతో పులివెందుల జెడ్పీటీసీగా గెలిచిన లతా రెడ్డి ఇపుడు స్టేట్ వైడ్ పాపులర్ అయ్యారు. పులివెందుల మా అడ్డా అని వైసీపీ చెప్పుకునే వీలు లేకుండా అక్కడ టీడీపీ జెండాను పాతిన లతా రెడ్డి గురించే అంతా చర్చించుకుంటున్నారు.

జగన్ కి పోటీగా :

ఈ విజయం గొప్పదని టీడీపీ భావిస్తోంది. పులివెందుల గెలిచి తీరాలి అన్న టీడీపీ అధినాయకత్వం ఆదేశాన్ని పాటించి గెలిచి గిఫ్ట్ గా ఇచ్చారు. అలా పులివెందులలో వైసీపీ ప్రాభవానికి చెక్ చెప్పేశారు. దాంతో ఇపుడు టాక్ ఆఫ్ ది ఏపీ అన్నట్లుగా లతా రెడ్డి మారారు. దాంతో ఆమెని టీడీపీ అధినాయకత్వం బాగా గుర్తు పెట్టుకుంటుంది. దాంతో ఆమె రాజకీయం జెడ్పీటీసీతో ఆగేది ఉండదని అంటున్నారు. ఆమె జగన్ కి పోటీగా ఫ్యూచర్ లో పులివెందుల నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసినా చేయవచ్చు అని ప్రచారం అయితే సాగుతోంది.

మహిళా సెంటిమెంట్ తో :

పులివెందులలో మహిళా సెంటిమెంట్ ని ముందు పెట్టి ఏకంగా వైసీపీని దెబ్బ కొట్టాలి అంటే లతా రెడ్డిని రేపటి ఎన్నికల్లో జగన్ కి సరైన ప్రత్యర్థిగా చేయవచ్చు అన్న చర్చ అయితే సాగుతోంది. ఇప్పటికి రెండు సార్లు బీటెక్ రవి జగన్ మీద పోటీ చేసి పులివెందుల అసెంబ్లీ సీటు నుంచి ఓటమి పాలు అయ్యారు. ఈసారి జగన్ మీద అభ్యర్థిని మార్చాలి అనుకుంటే కనుక కచ్చితంగా లతారెడ్డి రంగంలోకి దిగుతారు అని అంటున్నారు. ఇది రాజకీయంగా కూడా సంచలనం అయిన పోటీగా ఉంటుంది.

పైగా పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో కీలకం అయిన పులివెందుల జెడ్పీటీసీ ఓట్ల బలాన్ని ఈ మధ్యకాలంలో టీడీపీ కచ్చితంగా పెంచుకోవడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఏ కారణమో మరే వ్యూహమో తెలియదు కానీ పులివెందుల రేసులో లతా రెడ్డిని ఎందుకు దించారో తెలియదు ఆమె తొలి అడుగులోనే వైసీపీకి పిడులు పడ్డాయి అంటే రానున్న రోజులలో ఆమె లక్కీ హ్యాండ్ ని టీడీపీ కచ్చితంగా వాడుకుంటుంది అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.

Tags:    

Similar News