• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మేటర్ మేకప్ కిట్... భర్త,...

మేటర్ మేకప్ కిట్... భర్త, అత్తపై కేసుపెట్టి విడాకులు కోరుతున్న మహిళ!

| అవును... ఇటీవల కాలంలో భార్యాభర్తలకు సంబంధించిన పలు కేసులు ఆసక్తిగా మారుతున్నాయి

By - Tupaki Desk
Update: 2024-01-31 05:58 GMT

అగ్గిపుల్ల కుక్కపిల్ల సబ్బుబిల్ల కాదేది కవితకు అనర్హం అని శ్రీ శ్రీ అంటే... వంట చేయడం, కాఫీ పెట్టడం, షాపింగ్ కి తీసుకెళ్లలేనని చెప్పడం కూడా విడాకులకు అనర్హం కాదంటున్నారట కొంతమంది స్త్రీమూర్తులు! ఈ క్రమంలో తాజాగా ఒక ఊహించని కారణం దంపతుల మధ్య విడాకులకు కారణమైంది.. దీంతో ఈ విషయం తెలిసినవారు ముక్కున వేలేసుకుంటున్నారు.. "గుండమ్మ కథ" సినిమాలో పాటపాడుకుంటున్నారని తెలుస్తుంది!

అవును... ఇటీవల కాలంలో భార్యాభర్తలకు సంబంధించిన పలు కేసులు ఆసక్తిగా మారుతున్నాయి. వీటికి ఆయా కోర్టులు ఇస్తున్న తీర్పులు సంచలనంగా ఉంటున్నాయి. భారతీయ హిందూ వ్యవస్థలో వివాహాన్ని అత్యంత పవిత్ర కార్యంగా భావిస్తారు. ఈ వివాహ వ్యవస్థకి భారతదేశంలో ప్రధానంగా 3 ఉద్దేశాలు ఉన్నాయని.. వాటిని సక్రమంగా పాటించాలని చెబుతుంటారు. అప్పుడే ఆ దాంపత్యం నిండు నూరేళ్లూ సుఖసంతోషాలతో ఉంటుందని చెబుతుంటారు.

ఇందులో పేర్కొన్న మూడు అంశాలు... ధర్మం, ప్రజ, రతి! హిందూ శాస్త్రం ప్రకారం వివాహం చేసుకున్న స్త్రీ పురుషులిద్దరూ ధర్మబద్ధంగా జీవితాన్ని గడపాలి. అనంతరం ఈ బంధం ద్వారా సంతానాన్ని పొంది సమాజం నిరంతరం కొనసాగేలా చూడాలి. ఇదే సమయంలో... ధర్మబద్ధంగా శారీరక సంబంధాన్ని పాటించాలి!! అయితే కారణం ఏదైనా, కారకులు మరెవరైనా.. మారిన కాలంపై నెపం వేస్తూ ప్రస్తుత కాలంలో సమస్య రాగానే తొలి ఆలోచన విడాకులవైపు మళ్లుతున్న రోజులు ప్రస్తుతం నడుస్తున్నాయి!!

ఈ సమయంలో తాజాగా తన మేకప్ కిట్ తన అత్తగారు వాడారనే విషయం.. చినికి చినికి గాలివానగా మారి విడాకులవరకూ వచ్చిన ఘటన తాజాగా ఆగ్రాలో వెలుగుచూసింది! దీంతో ఈ విషయం తెలుసుకున్నవారు... విచిత్రమైన కారణాలతో విడాకులు కోరడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందంటూ కామెంట్లు చేస్తుంటే... వివాహ వ్యవస్థ రోజు రోజుకీ పతనమైపోతుందంటూ పెద్దలు కారాలూ మిరియాలూ నూరుతున్నారు!!

సంసార జీవితంలో సర్ధుకుపోవడంలో ఉన్న సుఖం అనుభవించినవారికే తెలుస్తుందని కొందరంటే... అది అవతలి వ్యక్తి అర్ధం చేసుకున్నవారికి మాత్రమే బాగుంటుందని మరికొందరు అంటారు.. అలాకానిపక్షంలో ఆ సర్ధుకుపోవడం అనేది బూడిదలో పోసిన పన్నీరుగా మిగిలిపోతుందని చెబుతుంటారు! ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ఆగ్రాలో అత్తగారు తన మేకప్ కిట్ వాడుతున్నారనే కారణంతో విడాకులు కోరింది ఒక మహిళ!

ఏదైనా కార్యక్రమానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు తన మేకప్ కిట్ ని అత్తగారు ఉపయోగిస్తున్నారని ఆమె ఆరోపిస్తుంది. దీంతో... అత్తగారు కోడలి మధ్య రచ్చ మొదలైంది. దీంతో కల్పించుకున్న భర్త.. తన భార్యపై కోపగించుకోవడం.. ఆమె పుట్టింటికి వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి! దీంతో తన అత్తగారు, తన భర్త తనను వేదిస్తున్నారని... నగరంలోని మల్పురా పోలీస్ స్టేషన్‌ ను కూడా ఆమె ఆశ్రయించింది.

ఈ క్రమంలో వీరిమధ్య దూరం పెరిగి పెరిగి ఇప్పుడు విడాకులు తీసుకోవాలనుకునేవారకూ వచ్చింది!! ఈ సమయంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ ప్రస్తుతం వారి ప్రయత్నాల్లో వారు ఉన్నప్పటికీ.. సదరు మహిళ.. ఇది సౌందర్య సాధనాల వాడకం గురించి మాత్రమే కాదని, గృహ హింస కూడా కారణమని చెబుతూ విడాకులు తీసుకోవాలని పట్టుబట్టిందని తెలుస్తుంది.

Tags:    
  • Motherinlaw 
  • Makeupproducts 
  • Permission 
  • Divorce 
  • Agrawoman 
  • Makeupkitcase 
  • Familycounciling 

Similar News

దమ్ము చూపిన జక్కంపూడి రాజా.. స్టేట్ లోనే రికార్డు

2026-11-07 14:12 GMT

అయోడిన్ టాబ్లెట్లు పంచుతున్న ఇరాన్.. అసలేంటి కథ? ఎందుకిలా?

2026-11-07 14:09 GMT

ఇందిర ఎమర్జెన్సీ మీద సోనియా షాకింగ్ కామెంట్స్ !

2026-11-07 14:09 GMT

ఎవరికి ఎన్ని సీట్లు? జిల్లాల వారీగా గెలుపు లెక్కలు

2026-11-07 14:08 GMT

లోకల్ రిజల్ట్ : జనాలకు ఇంట్రెస్ట్ తగ్గిందా ?

2026-11-07 14:07 GMT

మాజీ గర్ల్‌ఫ్రెండ్ కోసం ఆరాటం.. ఆర్టీఐతో పోరాటం..ఇదో సాధారణ బ్రేకప్ స్టోరీ కాదు సామీ

2026-11-07 14:05 GMT

ఆధునిక రాజకీయ శకం...వందేళ్ళ అద్వానీకి వందనం

2026-11-07 14:03 GMT

ఓబీసీ క్రీమీలేయ‌ర్‌.. మ‌రింత క‌ఠిన‌మా? సుప్రీంకోర్టు ఏం చెప్పింది!

2026-11-07 13:45 GMT

షర్మిల ఓవర్ కాన్ఫిడెన్స్

2026-11-07 11:50 GMT

జెడ్పీ పీఠాల వాటాలు...కూటమిలో లెక్క సెట్ అయిందా ?

2026-11-07 11:49 GMT

ఇరాన్ ను కొట్టలేక.. పాపం అమెరికాకు ఎంత గతి పట్టింది?

2026-11-07 11:40 GMT

ఎన్నికల్లో విజయం.. ఎంపీటీసీ గెలుపు చూడకుండానే మరణం.. ఎంత దురదృష్టం..

2026-11-07 11:25 GMT

Copyright @2026

Powered by Blink CMS