ఎవరీ ఠాకూర్...బీజేపీ కండువా ఆమెకే ఎందుకు ?

ఇపుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశమంతా బీహార్ వైపు ఆసక్తిగా చూస్తోంది.;

Update: 2025-10-15 03:51 GMT

ఎన్నికలు అంటే ఎన్ని కలలో. అలాగే ఎన్నెన్ని చిత్రాలో కూడా. ఎవరి ఆశలను వారు పండించుకోవడానికి ఎన్నికలను ఒక వేదికగా తీసుకుంటారు. ఇపుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశమంతా బీహార్ వైపు ఆసక్తిగా చూస్తోంది. నవంబర్ 6, 11 తేదీలలో రెండు విడతలుగా బీహార్ కి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే అలాగే కాంగ్రెస్ ఆర్జేడీల మహా ఘట్ బంధన్ పూర్తి స్థాయిలో మోహరించి ఉన్నాయి. తమ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

తొలి విడతతో బీజేపీ :

సీట్ల ఒప్పందాన్ని బీజేపీ తన మిత్రులతో కుదుర్చుకుంది. నాలుగైదు పార్టీలతో ఉన్న ఎన్డీయేలో అందరినీ మెల్లగా సముదాయించి బీజేపీ ఈ సీరియస్ టాస్క్ ని దాటేసింది. అంతే కాదు తొలి విడతగా తమ పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్ధుల వివరాలను కూడా ప్రకటించింది. ఆ విధంగా ప్రత్యర్థి పార్టీల మీద పైచేయి సాధించింది. తొందరలో రెండవ విడత అలా చివరి విడత ప్రకటించి ప్రచార పర్వంలోకి దిగాలని బీజేపీ చూస్తోంది. ఇక చూస్తే కనుక బీజేపీ 101 అసెంబ్లీ సీట్లకు పోటీ పడుతోంది.

యువ గాయనికి టికెట్ :

ఈ నేపధ్యంలో బీహార్ లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది పాతికేళ్ళ యువ గాయనీమణి మైథిలీ ఠాకూర్ బీజేపీలో చేరారు. ఆమె జానపద గాయకురాలిగా బీహార్ అంతటా పేరు సంపాదించుకున్నారు బీహార్ జానపద సంగీతంలో ఆమె ప్రావీణ్యం సాధించారు అంతే కాదు ఎన్నో కచేరీలు బీహార్ తో పాటు విదేశాలలో ఇచ్చి అందరి మెప్పు సంపాదించారు. ప్రత్యేకించి బీహార్ సంస్కృతిని ఆమె ప్రజలలో ప్రచారం చేస్తూ వారికి చేరువ అయ్యారు. సోషల్ మీడియాలో ఆమెకు వీర లెవెల్ లో ఫాలోయింగ్ ఉంది. దాంతో ఆమెకు మంచి క్రేజ్ కూడా ఏర్పడింది. ఇక ఆమె తల్లిదండ్రులు రమేష్ ఠాకూర్, భారతీ ఠాకూర్ ఇద్దరూ కూడా సంగీత కళాకారులే. దాంతో ఆమె బీహార్ లో తనదాఇన శైలిలో రాణిస్తున్నారు.

బీహార్ పుత్రిక అంటూ :

ఇపుడు ఆమె మెడలో కాషాయం కండువా వేసిన బీజేపీ ఆమెను బీహార్ పుత్రికగా అభివర్ణించింది. ఆమె క్రేజ్ తో బీజేపీకి మరింతగా జనంలో ప్రచారం దక్కుతుందని భావిస్తోంది. ఇక ఇంతకు ముందే మైధిలీ తాను ప్రజా సేవ చేస్తాను అని ప్రకటించి ఉండడంతో ఆమె ఈసారి ఎన్నికల్లో రంగంలోకి దిగుతున్నారు అని అంటున్నారు.

ఆ ప్లేస్ లో ఆమె పోటీ :

ఆమె కోసం ఒక సీటుని కూడా బీజేపీ పెద్దలు రెడీ చేసి ఉంచారు అని అంటున్నారు అలీనగర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మిశ్రీలాల్ యాదవ్ కి గ్రాఫ్ పెద్దగా లేదని భావిస్తున్న బీజేపీ ఈసారి ఆయన సీటుకు కోత పెడుతోంది. ఆ సీటు నుంచి మైథిలీ ఠాకూర్ ని పోటీ చేయిస్తోంది. ఆమె ప్రజాదరణతో తప్పకుండా నెగ్గడమే కాకుండా పక్కనున్న నియోజకవర్గాల మీద రాష్ట్రవ్యాప్తంగా ఆమె ప్రభావం పడుతుందని అని బీజేపీ ఆశలు పెట్టుకుంటోంది. మొత్తానికి చూస్తే సంగీత కళాకారిణి రాజకీయంగా ఏ విధంగా రాణిస్తుంది అన్నదే కొత్త చర్చ.

Tags:    

Similar News