ప్రపంచలోనే అత్యంత ధనిక గ్రామం ఇదే.. ఇక్కడ ఎంత సంపద ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఆసియా ఖండంలోనే అత్యంత ధనిక గ్రామం భారత్ లో ఉందంటే నమ్ముతారా..? అవును మీరు విన్నది నిజమే భారత్ లోనే ఉంది.;

Update: 2025-08-11 15:30 GMT

ఆసియా ఖండంలోనే అత్యంత ధనిక గ్రామం భారత్ లో ఉందంటే నమ్ముతారా..? అవును మీరు విన్నది నిజమే భారత్ లోనే ఉంది. ఇక్కడ ఉన్న కుటుంబాలు తక్కువే.. కానీ వారి సంపాదన గురించి తెలుసుకుంటే మాత్రం కల్లు తిరిగిపోవాల్సిందే. ప్రతి ఇల్లు ఒక కోటీశ్వరుడిదే అంటే ఆశ్చర్యం కలుగకమానదు. అయితే వీరంతా వివిధ ప్రదేశాలు, విదేశాల్లో వ్యాపారం చేస్తుంటారు. ఎక్కడో ఒక చోట వ్యాపారం, వాణిజ్యం లాంటివి చేస్తూ తమ గ్రామంలోని బ్యాంకుల్లోనే డబ్బులను నిల్వ చేస్తుంటారు. అందుకే ఇక్కడ ఉన్న బ్యాంకుల్లో డబ్బులు అధికంగా పోగవుతున్నాయి. అక్కడి విలేజ్ ను చూస్తే ఆశ్చర్యం కలుగకమానదు. విలేజ్ అంటే స్పృరణలో మెదిలేది పూడి ఇళ్లు, లేదంటే గుడిసెలు కానీ ఇక్కడ ఉన్న ఇళ్లు చాలా రిచ్ గా ఉన్నాయి. అదే గుజరాత్ రాష్ట్రంలోని మధపర్ గ్రామం.

ఆఫ్రికన్ దేశాల్లో వీరు ఏం చేసేవారంటే..?

మధపర్ గ్రామానికి చెందిన వారు ప్రధానంగా ఆఫ్రికన్ దేశాల్లో వ్యాపారం చేస్తున్నారు. 1,200 కంటే ఎక్కువ ఎన్ఆర్ఐ కుటుంబాలు కలిగిన ఈ గ్రామం దాదాపు రూ. 7 వేల కోట్ల విలువైన స్థిర డిపాజిట్ల సంపద ఉంది. ఈ నిధులతో వీరు గ్రామాన్ని అన్ని విధాలుగా డెవలప్ చేసుకుంటున్నారు. రోడ్లు, పారిశుధ్యం, విద్యాలయాల ఏర్పాటు వంటి వాటితో సహా అనేక కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు. వీరి ఆర్థిక విజయానికి తమ ప్రాంతంపై ఉన్న ప్రేమనే అని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తుంటారు. విదేశాల్లో ఉన్నా కూడా చాలా మంది తమ డబ్బులను, ఆర్థిక లావాదేవీలను మధపర్ గ్రామ బ్యాంకుల నుంచే కొనసాగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇది గ్రామం శ్రేయస్సు, డెవలప్ మెంట్ కు ఎంతో తోడ్పడుతుంది.

సంస్కృతిక పరంగా ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం..

కేవలం ఆర్థికంగానే కాకుండా సంస్కృతిని కాపాడుకోవడంలో కూడా గ్రామస్తులు ఆదర్శకంగా నిలుస్తున్నారట. మధపర్ లో సనాతన్ ఠాకూర్ మందిర్, బార్లా ఆలయం, మహాదేవ్ ఆలయం, స్వామినారాయణ ఆలయం, యక్ష్ మందిర్, తదితర ఆలయాలు ఉన్నాయి. వీటన్నింటిని కూడా వారు చాలా సంఘటితంగా డెవలప్ చేస్తుంటారు. వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక్కటిగా ఉంటారు. మధపర్ దేశంలోని ఇతర గ్రామీణ ప్రాంతాలకు ప్రేరణగా నిలుస్తుంది.

Tags:    

Similar News